For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 22: జానకిని వదిలించుకోవడమే సరైన నిర్ణయం.. ట్విస్ట్ ఇచ్చిన మైరావతి

  |

  జానకి కలగనలేదు సీరియల్ ఇతర సీరియల్స్ తో పోలిస్తే ప్రస్తుతం టాప్ లిస్టులోకి అతివేగంగా కొనసాగుతున్న సీరియల్ గా క్రేజ్ అందుకుంటోంది. ఈ సీరియల్ కాన్సెప్ట్ స్టోరీ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఐపీఎస్ అవ్వాలని అనుకున్న జానకి కుటుంబ కట్టుబాట్ల మధ్యలో ఎలాంటి ఇబ్బందులను దాటి తన కలను నెరవేర్చుకుంది అనే పాయింట్ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఇక భర్త సహకారంతో ఎలాగైనా ఐపీఎస్ పరీక్షలో పాస్ కావాలని అనుకుంటుంది. ఇక 43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 44వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతానికి వస్తే.. 43వ వారంలో 8.96 రేటింగ్ రాగా, 44వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 176వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

  అహంకారం కారణంగా..

  అహంకారం కారణంగా..

  చదువుకున్న అమ్మాయి కోడలిగా రావద్దని జ్ఞానాంబ ఎంతగానో ఆలోచించి రామచంద్రకు జానకినిచ్చి పెళ్ళి చేస్తుంది. పెళ్లికి ముందు జానకి కేవలం 5వ తరగతి మాత్రమే చదువుకున్నట్లు చెప్తారు. అయితే పెళ్లి తరువాత మాత్రం జానకి డిగ్రీ పూర్తి చేసినట్లు తెలియడంతో జానకి కంగారు పడుతుంది. చదువుకున్న అమ్మాయి అహంకారం కారణంగా తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు అని ఇప్పుడు కొడుకు జీవితంలో కూడా అలాంటి పరిణామాలు చేసుకుంటే తట్టుకోలేను అని జ్ఞానాంబ కంగారు పడుతుంది. ఇక జానకి విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి తన అత్తయ్య మైరావతి ఇంటికి వెళుతుంది.

  పూజకు ఆలస్యం కావడంతో

  పూజకు ఆలస్యం కావడంతో

  అయితే మైరావతి జానకి విషయంలో ఏమాత్రం సంతృప్తి చెందదు. ఆమె పెట్టిన ప్రతి పరీక్షలో కూడా జానకి నిధానంగానే నడుచుకున్నప్పటికి కూడా మైరావతి ఏమాత్రం సంతృప్తి చెందదు. ఇక పూజ విషయంలో కూడా జానకి ఆలస్యం చేయడంతో అందుకు ఆమెకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. జానకి చెప్పిన సమయానికి పూజలో కూర్చోవాలి అని మైరావతి ఆదేశిస్తుంది. అంతే కాకుండా ప్రత్యేకంగా బట్టలు కూడా ఇస్తుంది. కానీ దానికి ఆ బట్టలను వేసుకోవడంలో కాస్త ఇబ్బంది పడుతుంది. సహాయం కోసం మల్లికను పిలిపించినప్పటికీ కూడా స్పందించదు.

  మైరావతిని ఎదిరించి..

  మైరావతిని ఎదిరించి..


  ఇక మొత్తానికి పూజకు ఆలస్యంగా రావడంతో మైరావతి జానకిపై ఒక్కసారి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వెంటనే పూజను క్యాన్సిల్ చేసినప్పటికీ కూడా జ్ఞానాంబ అత్తయ్యను ఎదిరించి పూజను కొనసాగిస్తుంది. పూజ మధ్యలో ఆపివేయడం సరైన నిర్ణయం కాదని మైరావతిని ఎదిరించి పూజలో జానకి రామచంద్రను కూర్చోబెడుతుంది. ఇక ఆ తర్వాత మైరావతి అందరిపైనా ఆగ్రహంతో ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆమె వెనక్కి తగ్గదు.

   జానకి చెంప పగలగొట్టాలి

  జానకి చెంప పగలగొట్టాలి

  అయితే కోపం తగ్గాలంటే ఏం చేయాలి అని రామచంద్ర అడిగినప్పుడు మ్మైరావతి కఠిన నిర్ణయం తీసుకుంటుంది. నీ భార్య కారణంగానే నేను ఈరోజు అవమానానికి గురి అయ్యాను. నా కోడలు కూడా నా మాటను కాదని పూజ చేయించింది కదా.. అందుకు కారణం నీ భార్య కాబట్టి నాలోని కోపం తగ్గాలి అంటే అందరి ముందు జానకి చెంప పగలగొట్టాలి అని ఆదేశిస్తుంది. కానీ అందుకు రామచంద్ర ఎంతగానో ఆలోచిస్తాడు. చేతికి కారం ఉన్నప్పటికీ కూడా కొట్టేందుకు సిద్ధమవుతాడు. ఆ విషయంలో జానకి రామచంద్ర కు మద్దతు గా నిలుస్తుంది. అమ్మమ్మ గారి కోపం తగ్గాడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధమే అంటూ.. కొద్దిగా కూడా నేను బాధపడను అనే విధంగా రామచంద్ర కు సమాధానం ఇస్తుంది.

  అడ్డుకున్న గోవిందరాజులు

  అడ్డుకున్న గోవిందరాజులు

  ఇక రామచంద్ర జానకిపై చేయి ఎత్తిన క్రమంలో వెంటనే గోవిందరాజులు వచ్చి కొడుకును అడ్డుకుంటాడు. ఏలాంటి తప్పు చేయని జానకిని శిక్షించడం న్యాయం కాదని నువ్వు ఇచ్చిన బట్టలు సరిగా వేసుకోకపోవడం వల్ల ఆలస్యమైందని అలాగే పూజకు తొందరగా రావాలి అనే క్రమంలో కాలికి దెబ్బ కూడా తగిలిందని చెప్పారు. అయినప్పటికీ మైరారావతి ఆగ్రహం ఏమాత్రం చల్లారదు. ఎవరి మాటలు పట్టించుకోకుండా మరోసారి లోపలికి వెళ్ళి పోతుంది. ఇక ఆ తరువాత అందరూ ఇంటి నుంచి వెళ్లి పోతున్న క్రమంలో మైరావతి బాధపడుతుంది. మేము అందరం కూడా వెళ్లి పోతున్నాము అంటూ జ్ఞానాంబ వివరిస్తుంది. జాగ్రత్తగా వెళ్ళండి అని ఒక్క మాట చెప్పు అని మైరావతిని అడగడంతో ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది.

  Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
  వదిలించుకోవడమే సరైన నిర్ణయం

  వదిలించుకోవడమే సరైన నిర్ణయం


  ఇక జానకి విషయంలో కూడా నిర్ణయాన్ని చెప్పాలి అని అడగడంతో మైరావతి ఆగ్రహంతోనే సమాధానమిస్తుంది. నీ కోడలు ఏదో ఒక రోజు నీపై తప్పకుండా ఎదురు తిరుగుతుంది అని ఆమెలో ఉన్నా అహం ఎప్పటికైనా ప్రభావం చూపుతుంది అని మరిన్ని అనుమానాలు కలుగజేస్తుంది. జానకిని వదిలించుకోవడమే సరైన నిర్ణయం అని మైరావతి చెప్పడంతో జ్ఞానాంబ కూడా ఆలోచనలో పడుతుంది. ఇక ఆ తర్వాత జానకి సోదరుడు ఇంటికి వచ్చి తన చెల్లిని తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. జానకి కూడా తనకు ఇంట్లో ఇంకా స్థానం లేదు అని పెట్టిన పరీక్షలో కూడా తను విఫలమయ్యాను అని బాధపడుతూ బయటకు వెళ్లి పోవడానికి సిద్ధమవుతుంది. మరి ఆ విషయంపై జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 176:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X