For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 23rd: మైరావతి విడాకుల కండిషన్.. వెళ్లిపోవడానికి సిద్దమైన జానకి!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా టాప్ సీరియల్స్ లిస్టులోకి వెళుతోంది. మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతున్న సీరియల్ గా జనాల్లో క్రేజ్ రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఎలాగైనా ఐపీఎస్ అవ్వాలని అనుకున్న జానకి కుటుంబ కట్టుబాట్ల మధ్యలో ఎలాంటి ఇబ్బందులను దాటి తన కలను నెరవేర్చుకుంది అనే పాయింట్ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఇక భర్త సహకారంతో ఎలాగైనా ఐపీఎస్ పరీక్షలో పాస్ కావాలని అనుకుంటుంది.

  43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 44వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకోగా.. ఇక రూరల్ ఏరియాలో 43వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 44వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 177వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

  భయంతో జ్ఞానాంబ..

  భయంతో జ్ఞానాంబ..

  చదువుకోలేని కొడుకు కోసం చదువు లేని అమ్మాయిని భార్యగా తీసుకురావాలని జ్ఞానాంబ ఎంతగానో ఆలోచించి జానకితో పెళ్లి చేయడానికి ఒప్పుకుంటుంది. అయితే జానకి కుటుంబ సభ్యులు అబద్ధం చెప్పి ఆమె చదువుకోలేదని కేవలం ఐదవ తరగతి మాత్రమే చదువుకున్నట్టు పెళ్ళికి ఒప్పుకుంటారు. పెళ్లి జరిగిన కొన్ని నెలల తర్వాత జానకి డిగ్రీ పూర్తి చేసిందని నిజం తెలుసుకున్న జ్ఞానాంబ షాక్ అవుతుంది.

  జానకికి పెద్దలు అంటే చాలా గౌరవం అని అలాగే ఆమె ఎలాంటి తప్పు చేయలేదని ఇంట్లో వాళ్ళు అబద్ధం చెప్పిన కారణంగా జానకి ఇబ్బందుల్లో పడినట్లు ఉందని ఆలోచిస్తుంది. అయితే జ్ఞానాంబ ఎంత ఆలోచించినా కూడా చదువుకున్న అహంకారం ఎప్పటికైనా తన కొడుకు జీవితాన్ని ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉంటుంది అని ఆందోళన చెందుతోంది. గతంలో తన తమ్ముడి విషయంలో కూడా అలాంటి నిర్ణయం తీసుకుని చివరికి తమ్ముడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది అని భయంతో ఉంటుంది.

  వదిలించుకోవడం సరైన నిర్ణయయం

  వదిలించుకోవడం సరైన నిర్ణయయం

  జ్ఞానాంబ భజనకి విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి తన అత్త మైరావతి నిర్ణయాన్ని తీసుకోవాలని అనుకుంటుంది. జానకి గురించి తెలుసుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి అత్తగారి సొంత ఇంటికి వెళ్తుంది. అయితే జానకి మాత్రం మైరావతిని ఏమాత్రం సంతృప్తి పరచదు. ప్రతి విషయంలో కూడా జానకి కాస్త పొగరుగానే ఉంది అని పెద్దలంటే గౌరవం కూడా లేదని సమయానికి ఏ పనిచేయదని చెడ్డ పేరు తెచ్చుకుంటుంది.

  అనుకోని పరిస్థితుల కారణంగా జానకి మైరావతి దృష్టిలో పొగరు ఉన్న అమ్మాయిగా నిలిచిపోతుంది. దీంతో ఆమెను వదిలించుకోవడం సరైన నిర్ణయమని మైరావతి జ్ఞానాంబకు వివరణ ఇస్తుంది. ఎంతో అనుభవం ఉన్న నీకు ఎప్పటికైనా ఆమె ఇబ్బందిగానే తయారవుతుంది అని రామచంద్ర చాలా అమాయకుడిని అతని జీవితాన్ని అనవసరంగా ఇబ్బందులు పడేయవద్దని ఆదేశిస్తుంది.

  విడాకులు తీసుకోవాల్సిందే..

  విడాకులు తీసుకోవాల్సిందే..

  అంతేకాకుండా మైరావతి జానకి రామచంద్ర లకు విడాకులు ఇప్పించడం సరైన నిర్ణయమని మళ్లీ నేను మీ ఇంటికి వచ్చేసరికి జానకితో రామచంద్ర విడాకులు తీసుకుని ఉండాలి అని చెబుతుంది. అంతేకాకుండా రామచంద్ర కోసం నేను ఒక అమ్మాయిని కూడా చూసి పెడతాను అంటూ మైరావతి మాట ఇస్తుంది. తాను చెప్పినట్లు చేయకపోతే ఇక మీకున నాకు సంబంధం ముగిసినట్లే అని మైరావతి హెచ్చరిస్తుంది.

  మాట ఇచ్చిన రామచంద్ర

  మాట ఇచ్చిన రామచంద్ర

  ఇక మైరావతి మాటలకు ఆలోచనలో పడిన జ్ఞానాంబ మెల్లగా ఆమె ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అందరూ కూడా మైరావతి కాళ్లకు నమస్కారం చేసి ఇంటికి పయనమవుతారు. ఇక ఇంటికి రాగానే జ్ఞానాంబ ఒక్క సారిగా ఆలోచనలో పడుతుంది. రాత్రి సమయంలో ఏమీ అనకూడదు అని అందరూ మీ ఇంట్లోకి వెళ్లి పోతారు. మరోవైపు మల్లిక జానకి విషయంలో కోపంతోనే ఉంటుంది. ఇంకా ఎప్పుడు ఆమెను ఇంట్లో నుంచి బయటకు నెట్టి వేస్తారు అంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది.

  అయితే జానకి మాత్రం ఇంటితో తనకు సంబంధం తెగిపోయే సమయం వచ్చేసింది అంటూ రామచంద్రను పట్టుకొని ఎంతగానో రోధిస్తుంది. 15 రోజుల గడువులో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నాను కానీ ఈ పోటీలో నేను ఓడిపోయాను కాబట్టి బంధం తెగిపోతోంది అంటూ బాదాపడుతుంది. ఇక రామచంద్ర నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేను అని మరొకసారి మాట ఇస్తాడు.

  వెళ్లిపోవడానికి సిద్దమైన జానకి

  వెళ్లిపోవడానికి సిద్దమైన జానకి

  ఇక ఉదయం కాగానే మల్లికా మరొకసారి జ్ఞానాంబ మదిలో ఆలోచనలను కలిగించే విధంగా గోడచాటు నుంచి మాట్లాడుతూ ఉంటుంది. పెద్ద కోడలని ఒక తరహాలో చిన్న కోడలిని మరొక తరహాలో చూడడం మీ అమ్మగారికి అలవాటే అంటూ తన భర్త విష్ణుతో చెబుతుంది. అదే తప్పు తాను చేసి ఉంటే ఇప్పటికే ఇంట్లో నుంచి బయటకు నెట్టివేసి ఉండేవారు అంటూ.. ఇలా ఎందుకు చేస్తారో అర్థం కావడం లేదు అని కావాలని అంటుంది.

  ఇక ఆ తర్వాత జానకి అన్నయ్య కూడా ఇంటికి వచ్చి తన చెల్లెలిని తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. జానకి స్వయంగా ఫోన్ చేసి తనను ఇంటికి రమ్మని చెప్పింది అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఇక జానకి కూడా ఈ ఇంటితో తనకు బంధం తెగిపోయింది అని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. మరి జానకి విషయంలో జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 177
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X