For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 24th: జానకి విషయంలో జ్ఞానాంబ సంచలన నిర్ణయం.. ఐపీఎస్ కలను మర్చిపోవాల్సిందే!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మొదట్లో కాస్త నీరసంగా కొనసాగినప్పటికి ప్రస్తుతం మాత్రం చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. సీరియల్ అసలు కథ ట్రాక్ లోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల సంఖ్య కూడా అమాంతంగా పెరుగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి భర్త రామచంద్ర నుంచి కూడా సహాయం అందుకుంటుంది. కుటుంబ కట్టుబాట్ల మధ్యలో ఇబ్బందులను దాటి తన కలను నెరవేర్చుకోవాలని చూస్తుంది. అయితే భర్త సహకారంతో ఎలాగైనా ఐపీఎస్ పరీక్షలో పాస్ అవ్వాలని అనుకుంటుంది. ఇక రేటింగ్స్ విషయంలో కూడా జానకి కలగనలేదు మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది.

  43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 44వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.. ఇక రూరల్ ఏరియాలో 43వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 44వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 178వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

  అర్థం కానీ పరిస్థితులలో..

  అర్థం కానీ పరిస్థితులలో..

  కోడలు కొడుకు కంటే ఎక్కువగా చదువుకున్న విషయం తెలుసుకున్న జ్ఞానాంబ ఎలాగైనా ఆమెలో మార్పు తీసుకురావాలని అనుకుంటుంది. ఒకవేళ జానకి చదువుకున్న అహంకారాన్ని చూపిస్తే ఇంట్లో నుంచి బయటకు పంపించాలని కూడా ఆలోచిస్తుంది.

  అయితే మొదటి నుంచి కూడా జానకి ఆలోచనా విధానం మంచితనం గురించి తెలుసుకున్న జ్ఞానాంబ ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది. ఇక అందుకోసమే తన అత్త నిర్ణయం అడగాలని అనుకుంతుంది. ఇక జానకి గురించి తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తన సొంత ఊరికి వెళ్తుంది

  మైరావతి ఆగ్రహం

  మైరావతి ఆగ్రహం

  గతంలో తన తమ్ముడు ఒక చదువుకున్న అమ్మాయి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆందోళనలో ఉన్న జ్ఞానాంబ కొడుకు విషయంలో కూడా అదే భయం ఉంటుంది. రామచంద్ర అమాయకుడు అనే ఇప్పటికైనా జానకి చదువుకున్న అహంకారాన్ని చూపిస్తే అతను కూడా ఏమైనా చేసుకుంటాడో అని జ్ఞానాంబ ఆలోచిస్తూ ఉంటుంది.

  ఇక అదే విషయాన్ని మైరావతికి వివరించగా ఆమె జానకిని అన్ని రకాలుగా ప్రశ్నిస్తుంది. అసలు జానకి లో ఓర్పు సహనం కోపం ఎంత వరకు ఉన్నాయో అని పరీక్షించడానికి ఎన్నో పనులు చేయిస్తుంది. అంతేకాకుండా చిన్న విషయానికి కూడా మైరావతి కోపానికి గురి అవుతూ జానకికి పెద్దలంటే ఎంతవరకు గౌరవం ఉంది అనే విషయాన్ని గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది.

  చెల్లి కోసం వచ్చిన యోగి

  చెల్లి కోసం వచ్చిన యోగి

  కొన్ని పరిస్థితుల ప్రభావం వలన మైరావతి దృష్టిలో జానకి విలన్ గా మారుతుంది. రామచంద్ర నుంచి జానకి వేరు చేయడమే సరైన నిర్ణయమని ఆదేశిస్తుంది. వెంటనే విడాకులు ఇప్పించాలని కూడా చెబుతుంది. అయితే జానకి ఆ విషయంలో ఎంతగానో బాధపడుతుంది. తప్పకుండా జ్ఞానాంబ ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంది అని ముందుగానే వెళ్లిపోవాలని అనుకుంటుంది. తన అన్న యోగిని కూడా ఇంటికి పిలిపిస్తుంది. యోగి వచ్చిన సమయంలో మల్లిక అతని మాటలతో ఎంతగానో బాధ పెడుతుంది. మరొక అబద్ధం చెప్పి మోసం చేయాలని చూస్తున్నారా? అంటూ తలుపు దగ్గరే ఉండి మాట్లాడుతుంది.

  వెళ్లిపోవడానికి సిద్దమైన జానకి

  వెళ్లిపోవడానికి సిద్దమైన జానకి

  ఇంతలో గోవింద రాజులు వచ్చి యోగిని లోపలికి రావాలని పిలుస్తాడు. ఇంటికి రావడం కాదు జానకి ని తీసుకువెళ్లడానికి వచ్చాను అంటూ చెబుతాడు. జానకి కూడా పెట్టే సర్దుకొని బయటకు వెళ్లి పోతూ అత్తమామల ఆశీర్వాదం తీసుకుంటుంది. తాను 15 రోజుల గడువులో మంచి కోడలు అని నిరూపించుకో కాకపోతే బయటకు వెళ్ళిపోతాను అని చెప్పాను. అమ్మమ్మ గారి దృష్టిలో నేను మంచి ఇల్లాలిగా పేరు సంపాదించుకోలేక పోయాను అందుకే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను అని సమాధానం ఇస్తుంది.

  ట్విస్ట్ ఇచ్చిన జ్ఞానాంబ

  ట్విస్ట్ ఇచ్చిన జ్ఞానాంబ

  ఇక జానకి గడప దాటుతున్న సమయంలో జ్ఞానాంబ జానకిని అగమని చెబుతుంది. జానకి ఈ పందెంలో ఓడిపోలేదు అంటూ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు.. ఇక మల్లిక కూడా అనేక రకాల సందేహాలను వ్యక్తపరుస్తుంది. మైరావతి పెట్టిన చాలా పరీక్షల్లో జానకి ఎంతో ఓర్పుగా సహనంతో కనిపించింది. ఆమె అనుకోకుండా చేసిన పొరపాట్లు నిజాయితీగా నే ఒప్పుకుంది. అంతేగానీ మాయ చేయాలని అనుకోలేదు.

  మా అత్తయ్య గారు జానకి పై కోపంతో ఉన్నారు కాబట్టి సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. కానీ ఆమె తప్పకుండా జానకిని మళ్లీ మెచ్చుకుంటుంది. నేను అన్నీ వివరంగా చెబుతాను అని అందరికి సమాధానం ఇస్తుంది. అయితే జానకి చదువు విషయంలో జ్ఞానాంబ మాత్రం కొంత భయంతోనే ఉంటుంది. తన తమ్ముడి కి జరిగిన అన్యాయం కొడుకు విషయంలో కూడా జరుగుతుందేమో అని భయం ఇంకా ఉంది.

  అందుకే నువ్వు చదువుకున్న విషయాన్ని ఇంతటితో మర్చిపోవాలి అని జ్ఞానాంబ చెబుతుంది. దీంతో జానకి కూడా అత్తకు ప్రమాణం చేస్తుంది. మరి జానకి ఐపీఎస్ అవ్వాలని అనుకున్న కోరికను నెరవేర్చుకుంటుందో లేదో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 178
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X