Janaki Kalaganaledu November 25th: ఐపీఎస్ కలను మర్చిపోయి.. జ్ఞానాంబ కలను నిజం చేయబోతున్న జానకి!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. అసలు కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల సంఖ్య కూడా అమాంతంగా పెరుగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి భర్త సహాయంతో కలను నెరవేర్చుకోవలని అనుకుంటుంది. కానీ పరిస్థితులు ఆమె కలను ప్రశ్నార్థకంగా మారిస్తాయి. అత్త పెట్టిన కట్టుబాట్ల మధ్యలో ఇబ్బందులను దాటి తన కలను నెరవేర్చుకోవాలని చూస్తుంది. ఇక రేటింగ్స్ విషయంలో కూడా జానకి కలగనలేదు మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది.

43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 44వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.. ఇక రూరల్ ఏరియాలో 43వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 44వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 179వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

చదువు విషయంలో అనుమానాలు

చదువు విషయంలో అనుమానాలు

జానకి కొడుకు కంటే ఎక్కువగా చదువుకున్న విషయం తెలుసుకున్న జ్ఞానాంబ కంగారు పడుతుంది. జానకి చదువుకున్న అహంకారాన్ని చూపిస్తే అమాయకంగా ఉండే కొడుకు ఆత్మహత్య చేసుకుంటాడో ఏమో అని ఆందోళనలో ఇంతుంది. జానకిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలని కూడా ఆలోచిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా జానకి ఆలోచనా విధానం మంచితనం గురించి తెలుసుకున్న జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో తన అత్త మైరావతి సలహా తీసుకుంటుంది. ఇక జానకి గురించి తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తన సొంత ఊరికి వెళ్తుంది.

జానకి ఎలాంటి తప్పు చేయలేదు

జానకి ఎలాంటి తప్పు చేయలేదు

అయితే జానకి చదువు ఎప్పటికైనా ప్రమాదమే అంటూ మైరావతి జ్ఞానాంబను ఆదేశిస్తుంది. ఆమె చదువుకున్న పొగరు ను ఎప్పుడు చూపించిన కూడా రామచంద్ర జీవితానికి ఆటంకం గానే ఉంటుంది అని ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదని కూడా భయపెడుతుంది. వీలైనంత వరకు ఆమెను తొందరగా ఇంట్లో నుంచి పంపించడమే మంచిది అంటూ తొందరగా విడాకులు ఇప్పించాలని కూడా మైరావతి వివరణ ఇస్తుంది.

దీంతో జానకి విషయంలో మొదట కాస్త ఆందోళన చెందిన జ్ఞానాంబ ఆ తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. జానకి తెలిసి ఎలాంటి తప్పులు చేయలేదు అని కొన్ని పొరపాట్ల కారణంగానే మైరావతి దృష్టిలో తప్పుగా ఫోకస్ అయినట్లు అర్థం చేసుకుంటుంది.

మాట ఇచ్చిన జానకి

మాట ఇచ్చిన జానకి

జానకి అనుకున్న సమయంలో జ్ఞానాంబ అడ్డుపడుతుంది. నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కానీ నీ చదువు విషయంలో మాత్రం నాకు ఒక మాట ఇవ్వాలి. మళ్లీ నువ్వు డిగ్రీ చదువుకున్నా అనే విషయం నీకు కూడా గుర్తుకు ఉండకూడదు. నీ జీవితంలో ఎప్పుడు కూడా చదువు అనే టాపిక్ రాకూడదు అని చెప్పడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆమె కలను కూడా మర్చిపోవడానికి అత్తగారికి మాట ఇస్తుంది.

మల్లికలో మరింత కోపం

మల్లికలో మరింత కోపం

జానకి ఆ మాట ఇవ్వడంతో ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. జానకి నడుచుకునే విధానానికి రామచంద్ర కూడా ఎంతో సంతోషంగా ఉంటాడు. ఆ తర్వాత మల్లిక మాత్రం తోడికోడలు విషయంలో ఏ మాత్రం ప్రశాంతంగా ఉండదు. మళ్లీ ఇంట్లో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి అంటూ ఎప్పటికైనా అవకాశం దొరికితే జానకినీ ఇంట్లో నుంచి బయటకు పంపించే విధంగా ప్రణాళికలు రచించాలని అనుకుంటుంది.

జ్ఞానాంబకు గుడ్ న్యూస్ చెప్పిన జానకి

జ్ఞానాంబకు గుడ్ న్యూస్ చెప్పిన జానకి

ఇక జానకి జ్ఞానాంబతో మాట్లాడుతూ తప్పకుండా త్వరలోనే మీ కలలు నెరవేరుతాయని మరొక సంతోషకరమైన విషయాన్ని చెబుతుంది. జ్ఞానాంబ ఎప్పటినుంచో ఇంట్లో మనవడు మనవరాలు ఉండాలి అని ఆశ పడుతుంది. ఇక ఆ మంచి తరుణం జానకి నిజం చేయాలని అనుకుంటున్నాం అని జ్ఞానంబ ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తుంది. మన కలలు తొందరలోనే నిజం కాబోతున్నాయి అంటూ తన భర్తతో చెప్పుకొని నవ్వుతూ ఉంటుంది. కానీ మల్లిక మాత్రం ఏదో ఒక మోసం చేసే వాళ్ళని అడ్డుకోవాలని అని అనుకుంటుంది.

ఐపీఎస్ కలను కూడా మర్చిపోవాలని

ఐపీఎస్ కలను కూడా మర్చిపోవాలని

ఇక మరో వైపు జానకి తన చదువును పూర్తిగా మర్చిపోవాలి అని ఐపీఎస్ కలను కూడా మర్చిపోవాలని అనుకుంటుంది. తన భర్త ఎంతో ప్రేమగా తెచ్చిన పుస్తకాలను కూడా అమ్మడానికి సిద్ధమవుతోంది. ఇక అదే సమయంలో రామచంద్ర బైక్ పై వస్తుండగా మరొక వైపు నుంచి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి నడుచుకుంటూ వెళుతుంది.

ఆమెను అడ్డుకున్న రామచంద్ర ఎందుకు చనిపోవాలి అని అనుకుంటున్నారు అని ఉన్నప్పుడు తనకు ఇష్టమైన చదువు కాకుండా మరొక కోర్సు చేయిస్తున్నారు అని అందుకే చనిపోవాలని అనుకుంటున్నట్లు చెబుతుంది.

Recommended Video

Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
జానకిపై నిందలు పడేలా..

జానకిపై నిందలు పడేలా..

ఇక మనకు ఇష్టమైన కలర్ నెరవేరకపోతే బ్రతికే ఉన్నా చచ్చినా ఒక్కటే అంటూ వివరణ ఇస్తుంది. ఇక ఆ సమయంలో రామచంద్ర జానకి కల గురించి ఆలోచిస్తాడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా వెనక్కి తగ్గకూడదు అంటూ ధైర్యం చెబుతాడు. ఇక మరోవైపు జానకిపై నిందలు పడేలా మల్లిక ప్రణాళికలు రచిస్తూ ఉంటుంది. ఇక మల్లిక నిర్ణయం జానకి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X