For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 25th: కోడలిని కాపాడిన జ్ఞానాంబ.. జానకి విషయంలో రామ ఛాలెంజ్

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరో ట్విస్ట్ తో ఆసక్తికరంగా మారుతోంది. జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ మాధురి అనే అమ్మాయిపై హత్య ప్రయత్నం చేయడంతో జానకి చూస్తుంది. ఇక జానకి అతడి పై కేసు కూడా పెడుతుంది. కానీ జానకి పొరపాటు పడింది అని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటాడు. అఖిల్ కూడా ఆ విధంగా అందరిని నమ్మిస్తాడు. జానకి తన భర్త ఒత్తిడి కారణంగా అలాగే కుటుంబం సంతోషం కారణంగా అఖిల్ మీద కేసును వెనక్కి తీసుకుంటుంది. దీంతో జానకి తన ఐపిఎస్ చదువుకు న్యాయం చేయలేనెమో అనుకొని ఆ చదువులు ఇంతటితో వదిలేయాలని అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం అలా జరగకూడదు అని అనుకుంటాడు. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 440 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  తప్పు కారణంగా..

  తప్పు కారణంగా..

  అఖిల్ విషయంలో జరిగిన తప్పు కారణంగా జానకి తన చదువు విషయంలో ఊహించని విధంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది. అతను హత్య ప్రయత్నం చేసినప్పటికి కూడా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా నమ్మకపోవడంతో తను చదివిన ఐపిఎస్ చదువుకు ఏమాత్రం అర్థం ఉండదు అని ఏకంగా తన చదువును ఇంతటితో ఆపేయాలని అనుకుంటుంది. అయితే రామచంద్ర మాత్రం ఆమెను ఎలాగైనా ఒప్పించాలి అని జరిగిన పొరపాటున కూడా సరిదిద్దుకోవాలని అనుకుంటాడు. ఇక చిన్నప్పటినుంచి ఎన్నో కలలు కన్న ఇపిఎస్ చదువును ఆ విధంగా వదిలేసుకుంటే మీరు సంతోషంగా ఉండగలరా అంటూ జానకిని అడిగినప్పుడు నాకు మీకంటే ఎవరు ఎక్కువ కాదు అని కోడలిగా నా బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని జానకి చెబుతుంది.

  మల్లిక సంతోషం

  మల్లిక సంతోషం

  అయితే రామచంద్ర మాత్రం ఎలాగైనా జానకిని మళ్ళీ చదువుకునేలా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు అంతే కాకుండా ఆమెకి ఒక సరదాగా ఒక ఛాలెంజ్ కూడా విసురుతాడు. మీతో ఎలాగైనా నెగ్గుతాను అని మళ్లీ మీరు చదువుకునేలా ఒప్పిస్తాను అని అంటాడు. అయితే అందుకు జానకి కూడా అదే తరహాలో నన్ను ఒప్పించలేరు అని చెబుతుంది. అయితే జానకీ చదువు మానేసినట్లు నిర్ణయం తీసుకున్నట్లుగా మల్లికా తెలుసుకుంటుంది. దీంతో ఆమె ఎంతో సంతోషపడుతుంది. ఎప్పటినుంచో జానకి చదువుకోకూడదు అని అనుకుంటున్నాను. కానీ నా కష్టం లేకుండానే తనే సొంతంగా నిర్ణయం తీసుకుంది అని సంతోషంతో ఎగిరి డ్యాన్స్ చేస్తుంది.

  కోడలిని కాపాడిన జ్ఞానాంబ

  కోడలిని కాపాడిన జ్ఞానాంబ

  అయితే మల్లిక హాల్ లో ఉండి అలా డాన్స్ చేస్తూ ఉండడంతో హఠాత్తుగా కింద పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడే జ్ఞానాంబ , మల్లికను చూసి పట్టుకుంటుంది. కాస్త ఆలస్యమైనా కూడా ఆమె కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రమాదం జరిగేది అని సీరియస్ అవుతుంది. ఇక మల్లిక మళ్ళీ అత్తగారు ఏమైనా అంటారేమో అని కాలు నొప్పి నాటకం ఆడుతుంది. ఇక అలాంటి అనార్థం జరగడంతో గత రెండు మూడు రోజులుగా ఇంట్లో పరిస్థితి ఏమి బాగోలేదు అని ఏదో కీడు శంకిస్తోంది అని జ్ఞానాంబ బాగా ఆందోళన చెందుతూ ఉంటుంది.

  శివాలయంలో పూజలు

  శివాలయంలో పూజలు

  అయితే వెంటనే శాస్త్రి గారికి ఫోన్ చేసి ఏదైనా దోష పరిహారం ఉంటుందేమో చూడమని అడుగుతుంది. ఇక గోవిందరాజులు పంతులుకి ఫోన్ చేయగానే రేపు శివాలయంకి మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రావాలి అని మీ ఆందోళన తగ్గిపోయే విధంగా పూజలు చేయాలి అని అంటారు. దీంతో రామచంద్రను తన తల్లి అందుకు ఏర్పాట్లు చేయమని చెబుతోంది. మరోవైపు మల్లికా కాలునొప్పి అంటూ తన గదిలోకి వెళుతుంది. అయితే నువ్వు దొంగ ప్రెగ్నెన్సీ తో ఇంట్లో వాళ్ళందరిని మోసం చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని నేను చెప్పకపోయినా ఎప్పుడో ఒకప్పుడు నీవు కడుపు రాలేదు అనే విషయం బయటపడుతుంది అని జానకి అంటుంది.

  దీపం ఆర్పేయాలని మల్లిక ప్లాన్

  దీపం ఆర్పేయాలని మల్లిక ప్లాన్

  అయితే మల్లిక మాత్రం జానకి మాటలను పెద్దగా పట్టించుకోదు కానీ జానకి తన అత్త కోపం గురించి మరోసారి గుర్తు చేస్తుంది. అప్పుడు నిన్ను ఎవరు కాపాడలేరు అని కూడా చెప్పడంతో మల్లిగా మళ్ళీ టెన్షన్లో పడిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం అందరూ కూడా శివాలయం కు వెళతారు. అక్కడ హోమం కూడా చేయమని చెబుతారు. ఇక కోనేటిలో దీపాలను వదలాలని కూడా పంతులుగారు చెప్పడంతో జానకి రామచంద్ర ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. ఇక అఖిల్ మాత్రం జెస్సి పై ప్రేమ ఉన్నట్లుగా నాటకమాడుతూ ఉంటాడు. మరోవైపు జానకి తన చదువు విషయంలో నిర్ణయం వెనక్కి తీసుకోవాలి అని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఉంటాడు. అయితే తీరని కోరికలు మాత్రం కోరుకోవద్దని జానకి చెబుతుంది. ఇక మరోవైపు పక్కనే ఉన్న చిన్న కోడలు మల్లిక, జానకి దీపం ఎలాగైనా ఆర్పేయాలి అని నీళ్లను అటువైపుగా తోస్తుంది. ఆమె అలా చేస్తూ ఉండడంతో జానకి చూస్తుంది. మరి ఈ విషయంలో జానకి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 440:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X