Janaki Kalaganaledu November 26th: జానకి కోసం మరో స్కెచ్ వేసిన మల్లిక.. జ్ఞానాంబ తల్లి ప్రేమ

జానకి కలగనలేదు సీరియల్ కథ అసలు ట్రాక్ లోకి రావడంతో మరింత ఆసక్తికరంగా మారుతోంది. వీక్షకుల సంఖ్య కూడా అమాంతంగా పెరిగిపోతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి భర్త సహాయంతో కలను నెరవేర్చుకోవలని అనుకుంటుంది. కానీ పరిస్థితులు ఆమె కలను ప్రశ్నార్థకంగా మారిస్తాయి. అత్త పెట్టిన కట్టుబాట్ల మధ్యలో ఇబ్బందులను దాటి తన కలను నెరవేర్చుకోవాలని చూస్తుంది. ఇక రేటింగ్స్ విషయంలో కూడా జానకి కలగనలేదు మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. 43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 44వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.. ఇక రూరల్ ఏరియాలో 43వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 44వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 180వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

 జానకి చదువుకున్న అహంకారాన్ని చూపిస్తే

జానకి చదువుకున్న అహంకారాన్ని చూపిస్తే


జానకి తన కొడుకు రామచంద్ర కంటే ఎక్కువగా చదువుకున్న విషయం తెలుసుకున్న జ్ఞానాంబ కంగారు పడుతుంది. గతంలో ఎక్కువ చదువుకున్న అమ్మాయి అహంకారం కారణంగా తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు అని ఇప్పుడు రామ విషయంలో కూడా అదే తరహాలో జరుగుతుందేమో అని జ్ఞానాంబ భయపడుతుంది. జానకి చదువుకున్న అహంకారాన్ని చూపిస్తే అమాయకంగా ఉండే కొడుకు ఆత్మహత్య చేసుకుంటాడో ఏమో అని ఆందోళనలో ఉంటుంది. జానకిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలని కూడా అనుకుంటుంది. ఇక మొదటి నుంచి కూడా జానకి ఆలోచనా విధానం మంచితనం గురించి తెలుసుకున్న జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో తన అత్త మైరావతి సలహా తీసుకుంటుంది. ఇక జానకి గురించి తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తన సొంత ఊరికి వెళ్తుంది.

ఐపీఎస్ కలను కూడా మర్చిపోయేలా

ఐపీఎస్ కలను కూడా మర్చిపోయేలా

ఇక జానకి చదువు ఎప్పటికైనా ప్రమాదమే అంటూ మైరావతి జ్ఞానాంబను ఆదేశిస్తుంది. ఆమె చదువుకున్న పొగరును ఎప్పుడు చూపించిన కూడా రామచంద్ర జీవితానికి ఆటంకం గానే ఉంటుందని అందుకే విడాకులు ఇప్పించాలని చెబుతుంది. కానీ జ్ఞానాంబ మైరావతి చెప్పినట్లుగా కాకుండా జానకిని ఇంట్లోనే ఉండమని చెబుతుంది. కానీ మళ్ళీ ఎప్పటికి చదువుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవద్దని అసలు నువ్వు చదువుకున్న విషయం పూర్తిగా మర్చిపోవలని చెప్పడంతో జానకి అందుకు ఒప్పుకుంటుంది. తన ఐపీఎస్ కలను కూడా మర్చిపోయేందుకు సిద్ధమవుతుంది. కానీ రామచంద్ర మాత్రం జానకిని ఐపీఎస్ చదివించాలని అనుకుంటాడు.

జానకి తప్పు చేయలేదని..

జానకి తప్పు చేయలేదని..


జానకి విషయంలో ఎలాంటి మంచితనం లేదని కూడా మైరావతి భయపెడుతుంది. వీలైనంత వరకు ఆమెను తొందరగా ఇంట్లో నుంచి పంపించడమే మంచిది అంటూ తొందరగా విడాకులు ఇప్పించాలని కూడా మైరావతి వివరణ ఇస్తుంది. దీంతో జానకి విషయంలో మొదట కాస్త ఆందోళన చెందిన జ్ఞానాంబ ఆ తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. జానకి తెలిసి ఎలాంటి తప్పులు చేయలేదు అని కొన్ని పొరపాట్ల కారణంగానే మైరావతి దృష్టిలో తప్పుగా ఫోకస్ అయినట్లు అర్థం చేసుకుంటుంది.

 మల్లిక మరో నాటకం

మల్లిక మరో నాటకం

స్వీట్స్ తయారు చేసే ఖర్ఖానాలో పూత రేకులు తయారు చేయడానికి నెయ్యి అవసరమని గోవిందరాజులు మల్లికను పంపించాలని అనుకుంటాడు. కానీ అదే సమయంలో మల్లిక ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి కడుపు నొప్పి అని మరొక కారణం చెబుతుంది. గోవిందరాజులు ఆమె నాటకాన్ని అప్పుడే గమనించి సరే నేను వెళ్తాను అని అంటాడు. ఇక ఆ సమయంలో జానకి ముందుకు వస్తుంది.
ఖర్ఖానాలో కు నేను వెళ్తాను మామయ్యగారు అంటూ చెప్పడంతో మల్లిక ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేస్తుంది.

మందు కలిపిన మల్లిక

మందు కలిపిన మల్లిక

మల్లిక కావాలనే అలా నాటకం ఆడినట్లు తనలో తానే అనుకుంటుంది. ఇక జానకి నెయ్యి తీసుకొని ఖర్ఖానాకు వెళుతుంది. ఇక స్వీట్స్ చేసేవారికి నెయ్యి ఇచ్చి జానకి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తరువాత మల్లిక ఎవరు లేని సమయంలో స్వీట్ చేసే దగ్గరికి వచ్చి నెయ్యిలో ఒక మందు కలుపుతుంది. ఆ పూత రేకులు తిన్నవారు కడుపు నొప్పితో వాంతులు చేసుకుంటారని ఆ తరువాత జ్ఞానాంబ స్వీట్స్ కు చెడ్డపేరు వస్తుందని అనుకుంటుంది. అంతే కాకుండా జానకి పై ఆ నింద పడుతుందని ఆలోచిస్తుంది.

 జానకిపై జ్ఞానాంబ తల్లి ప్రేమ

జానకిపై జ్ఞానాంబ తల్లి ప్రేమ

ఇక మరోవైపు జానకి తన బెడ్ రూమ్ లో దీనంగా కూర్చోవడాన్ని రామచంద్ర గమనిస్తాడు. ఐపీఎస్ కలను మర్చిపోతాను అని మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన రామచంద్ర ఎంతగానో ఆవేదన చెందుతాడు. అయినప్పటికీ జానకి ఏ బాధ లేదని చెబుతూ.. చదువు విషయాన్ని మారచిపోయానని అంటుంది. ఇక జానకి జుట్టు సరి చేసుకుంటూ ఉండగా జ్ఞానాంబ వచ్చి ఒక తల్లి తరహాలో జుట్టు చిక్కులు దువ్వెనతో తీస్తుంది. ఇక ఆ తరువాత లీలావతి ఇంటికి వచ్చి మోసం చేసిన కోడలిని ఇంట్లో ఎలా పెట్టుకున్నావు అని అడగడంతో అందరూ షాక్ అవుతారు. ఇక జ్ఞానాంబ మాత్రం వెంటనే ఆమెకు కౌంటర్ ఇస్తుంది. నా కోడలు ఎంత చదువుకున్న కూడా అనుకువుగా ఉంటుందని లీలావతి నోరు మూయిస్తుంది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Siri తల్లి ఇచ్చిన వార్నింగ్ కి కంటతడి పెట్టుకున్న Shanmukh || Filmibeat Telugu
జానకి కలగనలేదు 46వ వారం రేటింగ్

జానకి కలగనలేదు 46వ వారం రేటింగ్

జానకి కలగనలేదు సీరియల్ విషయానికి వస్తే.. రూరల్‌ ప్రాంతంలో 45వ వారం 9.27 రేటింగ్‌ను, 46 వారంలో 9.69 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఇక అర్బన్ ప్రాంతంలో 45వ వారం 8.64 రేటింగ్ సాధించగా, 46వ వారం 9.27 రేటింగ్‌ను నమోదు చేసింది. ఈ వారం రేటింగ్ విషయంలో పెరుగుదల కనిపించడానికి కారణం కొంత ఎమోషనల్ కంటెంట్ ఉండటమనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X