For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 29th: జానకి జీవితానికి మరో ముప్పు.. మల్లికకు మరో ఛాన్స్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇటీవల కాలంలో ఈ సీరియల్ వీక్షకుల సంఖ్య కూడా అమాంతంగా పెరిగిపోతోంది. ఇక ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి ఎలాగైనా తన కలను నెరవేర్చుకోవాలని అనుకుంటుంది. అందుకు భర్త కూడా సహాయం చేస్తాడు. ఇక పరిస్థితులు ఆమె కలను ప్రశ్నార్థకంగా మారుస్తాయ. అత్త పెట్టిన కట్టుబాట్ల మధ్యలో ఇబ్బందులను దాటి తన కలను నెరవేర్చుకోవాలని చూస్తుంది.

  ఇక రేటింగ్స్ విషయంలో కూడా జానకి కలగనలేదు మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. 43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 44వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.. ఇక రూరల్ ఏరియాలో 43వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 44వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 181వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

  జ్ఞానాంబ ఆందోళన

  జ్ఞానాంబ ఆందోళన

  కొడుకు రామచంద్రకు చదువు లేదని చదువుకోలేని అమ్మాయిని తీసుకురావాలని జ్ఞానాంబ అనుకుంటుంది. ఇక జానకి పెళ్లి తరువాత డిగ్రీ చదువుకున్నట్లు తెలుసుకున్న జ్ఞానాంబ కంగారు పడుతుంది. గతంలో ఎక్కువ చదువుకున్న అమ్మాయి అహంకారం కారణంగా తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఇప్పుడు రామ విషయంలో కూడా జరుగుతుందేమో అని జ్ఞానాంబ ఆందోళన చెందుతుంది. ఇక ఆ విషయంలో తన అత్త మైరావతి నిర్ణయాన్ని తీసుకున్న జ్ఞానాంబ మొదట జానకిపై కోపంగానే ఉంటుంది.

  జానకి, జ్ఞానాంబ సంతోషం

  జానకి, జ్ఞానాంబ సంతోషం

  ఆమె చదువుకున్న పొగరును ఎప్పుడు చూపించిన కూడా ప్రమాదమే, రామచంద్ర జీవితానికి ఆటంకం గానే ఉంటుందని అందుకే విడాకులు ఇప్పించాలని మైరావతి జ్ఞానాంబకు చెబుతుంది. కానీ జ్ఞానాంబ మైరావతి చెప్పినట్లుగా కాకుండా జానకిని ఇంట్లోనే ఉండమని చెబుతుంది. పరిస్థితుల ప్రభావం వలన మైరావతి జానకిని తప్పుగా అర్థం చేసుకున్నట్లు చెబుతుంది. ఇక ఇంట్లో నుంచి బయటకు పంపించాలని అనుకున్నా మల్లికకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. జ్ఞానాంబ జానకి ఇద్దరు కూడా సంతోషంగా ఉండటం చూసి మల్లిక కుళ్ళుతో ఎంతగానో బాధ పడుతుంది. ఇక అప్పుడు జ్ఞానాంబ వచ్చి కౌంటర్ కూడా ఇస్తుంది.

  మల్లికకు మరో కౌంటర్

  మల్లికకు మరో కౌంటర్

  ఇక జానకి మల్లిక తో కలిసి గుడికి వెళ్ళాలి అని అనుకుంటుంది. అదే విషయాన్ని ఆమె అడగడంతో అందుకు ఏమాత్రం ఒప్పుకోదు. నువ్వు మోసం చేసి ఇంట్లోకి కోడలిగా వచ్చావు బయట జనలు అందరికీ ఆ విషయం తెలుసు. ఎవరైనా నన్ను చూస్తే అదే తరహాలో మోసం చేసిన అమ్మాయితో తిరుగుతున్నవా? అని ప్రశ్నిస్తారు. ఆ మాటలను నేను పడలేను. అంటే జ్ఞానాంబ ముందే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. మల్లిక మాటలకు మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన జ్ఞానంగా అలాంటి సూటిపోటి మాటలు ఎవరు అంటారో నేను చూస్తాను.. అని గుడికి వెళ్దాం పదండి అని అంటుంది.

  లీలావతి నోరు మూయించిన జ్ఞానాంబ

  లీలావతి నోరు మూయించిన జ్ఞానాంబ

  గుడికి వెళ్లాలని సిద్ధమైన సమయంలో ఇంటికి అప్పుడే లీలావతి కూడా వస్తుంది. మోసం చేసిన కోడలిని ఇంట్లోనే పెట్టుకున్నావు అంటే భయంతోనే అనిపిస్తోంది అని లీలావతి జ్ఞానాంబను మరింత రెచ్చగొడుతుంది. చదువులేని అమ్మాయిని కోడలిగా తీసుకురావాలి అని చాలా రోజుల పాటు రామచంద్రకు పెళ్లి చేయకుండా ఉంచావు. ఇక ఇప్పుడు ఈ కోడలు మోసం చేసిందని బయటకు పంపించే వేస్తే మళ్లీ మరో అమ్మాయి దొరకదేమో అని భయంతో ఆలోచిస్తున్నావు కదా అని ప్రశ్నిస్తుంది.

  అందుకు జ్ఞానాంబ కూడా లీలావతికి సరైన కౌంటర్ ఇస్తుంది. అవును ఇలాంటి అమ్మాయి నా కొడుకుకి ఎక్కడ వెతికినా దొరకదు.జానకి ఇంట్లోకి రావడం మా అదృష్టం ఆ విషయంలో ఎవరు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోసారి నా కోడలిని ఏదైనా అంటే మర్యాదగా ఉండదు అంటూ సరైన జవాబు ఇస్తుంది.

  Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
  మరో ముప్పులో జానకి

  మరో ముప్పులో జానకి

  ఇక అత్త చెప్పిన మాటలకు జానకి కూడా ఎంతగానో సంబరపడుతుంది. తనపై అత్తయ్య గారి ప్రేమ ఎప్పుడూ ఇలానే ఉండాలి అని గుడికి వెళ్ళి దేవుడిని కూడా ప్రార్థిస్తుంది. అయితే అదే సమయంలో ఎవరూ ఊహించని విధంగా జానకి స్నేహితుడు కలుస్తాడు. ఆమెకు ఏపీఎస్ కోర్సు సంబంధించిన పరీక్షల పుస్తకాలను ఇవ్వాలని అనుకుంటాడు. జానకి ఇంటికి వెళ్లే ముందు అతను కూడా గుడికి వస్తాడు. ఇక ఆ ప్రదేశంలోనే జానకిని చూడడంతో ఇక్కడే జానకికి పుస్తకాలు ఇస్తే సరిపోతుంది కదా అని అనుకుంటాడు.

  ఇక జానకి అతన్ని చూసి మెల్లగా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ తర్వాత జ్ఞానాంబ ఆ అబ్బాయిని పిలవడం విశేషం. అంతే కాకుండా ఆ కుర్రాడు రామచంద్రకు కూడా ఫోన్ చేస్తాడు. జానకిని కలవాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. దీంతో ఒక్కసారిగా జానకి జీవితానికి మరో ముప్పు ఏర్పడుతుంది. అసలు జ్ఞానాంబ ఆ కుర్రాడిని ఎందుకు పిలిచింది. అసలు జానకి తన అనుకున్న కల విషయంపై కూడా జ్ఞానాంబకు చెందుతుందా లేదా? ఇక రామచంద్ర ఈ గ్యాప్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 181:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X