For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 29th: ఐపీఎస్ డ్రీమ్ కోసం మారుతున్న జానకి.. కన్నబాబుతో మరో ట్విస్ట్

  |

  జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన ట్విస్ట్ లతో రోజురోజుకు జనాల్లో ఆదరణ పెంచుకుంటోంది. జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ మాధురి అనే అమ్మాయిపై హత్య ప్రయత్నం చేయడంతో జానకి అది చూసి అతడి పై కేసు కూడా పెడుతుంది. కానీ జానకి పొరపాటు పడింది అని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటాడు. అఖిల్ కూడా ఆ విధంగా అందరిని నమ్మిస్తాడు. జానకి తన భర్త ఒత్తిడి కారణంగా అలాగే కుటుంబం సంతోషం కారణంగా అఖిల్ మీద కేసును వెనక్కి తీసుకుంటుంది. దీంతో జానకి తన ఐపిఎస్ చదువుకు న్యాయం చేయలేనెమో అనుకొని ఆ చదువులు ఇంతటితో వదిలేయాలని అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం అలా జరగకూడదు అని అనుకుంటాడు. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 442 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  చదువు విషయంలో సస్పెన్స్

  చదువు విషయంలో సస్పెన్స్

  జానకి ఐపిఎస్ చదువును మధ్యలోనే ఆపిస్తున్నట్లు చెప్పడంతో రామచంద్ర ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఇంట్లో వాళ్ళందరూ అఖిల్ విషయంలో చేసిన ఒత్తిడి కారణంగా జానకి భవిష్యత్తులో ఐపీఎస్ కి న్యాయం చేయలేను అని అనుకుంటుంది. ఇక అఖిల్ కోసం కుటుంబం కోసం ఆలోచించే తన ఐపిఎస్ చదవును ఇంతటితో మర్చిపోవాలని అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం తన భార్య ఐపీఎస్ కావాలని ఎలాగైనా చదవాలి అని ఆమె మనసును మళ్లీ మార్చాలి అని అనుకుంటాడు. కానీ జానకి మాత్రం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒకే తరహాలో ఆలోచిస్తూ ఉంటుంది.

  గుడిలో పూజలు హోమాలు

  గుడిలో పూజలు హోమాలు

  ఇక గుడిలో ప్రత్యేకంగా పూజలు చేయించడానికి కుటుంబ సభ్యులందరూ కూడా వెళతారు. అక్కడ జ్ఞానాంబ చిరకాల శత్రువు సునంద దేవి ఎదురిపడుతుంది. ఆమె అక్కడ అవమానించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ముందుగా పెద్ద కోడలు గర్భవతి కావాలి అని కానీ ఆమె కాకుండా చిన్నవాళ్ళు ఇద్దరు కూడా ప్రెగ్నెంట్ అవ్వడం ఏమిటో అని సునంద సూటిపోటు మాటలతో బాధపడే విధంగా మాట్లాడుతుంది.

  జానకి గుడ్ న్యూస్

  జానకి గుడ్ న్యూస్

  ఇక అప్పుడే జానకి వచ్చి సునంద నోటి మాటలకు కళ్లెం వేస్తుంది. మీరు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు అని త్వరలోనే మా అత్తగారి కోరిక కూడా నెరవేరుతుంది అని మాట ఇస్తుంది. అంతే కాకుండా రామచంద్రను కూడా అడుగుతుంది. అందుకు రామ కూడా ఓకే అంటాడు. సునంద కారణంగా జానకి మంచి శుభవార్త చెప్పడంతో జ్ఞానాంబ సంతోషిస్తూ ఆమెకు మళ్ళీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. హోమం పూర్తయిన తర్వాత జానకి అందరికీ ప్రసాదాలు ఇస్తూ ఉంటుంది.

  మహిళా పోలీస్ రావడంతో

  మహిళా పోలీస్ రావడంతో

  అప్పుడే గుడికి ఒక మహిళా పోలీస్ అధికారి యూనిఫాంలో వస్తుంది. ఆమెను చూసి జానకి తన డ్రీమ్ గురించి మరోసారి ఆలోచిస్తుంది. ఇక ఆ మహిళ పోలీస్ గుడిలోకి రాగానే జ్ఞానాంబ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆమెను చూస్తారు. జ్ఞానాంబ కూడా ఆమెతో మాట్లాడుతూ మా పెద్ద కోడలు కూడా ఇలాగే పోలీసు ఆఫీసర్ కావాలని చదువుకుంటుంది అని చెబుతారు. అప్పుడే రామచంద్ర కూడా కలుగజేసుకొని జానకిని రెచ్చగొట్టేందుకు ఇది మంచి అవకాశం అని మాట్లాడే ప్రయత్నం చేస్తాడు.

  జానకి మనసులో మరో ఆలోచన

  జానకి మనసులో మరో ఆలోచన

  ఒక వైపు కుటుంబ బాధ్యతలు పోలీస్ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారు అది సాధ్యమేనా అని రామ ఆమెను అడుగుతాడు. ఇక మన లక్ష్యం సాధించాలి అని పట్టుదల ఉంటే తప్పకుండా ఏదైనా సాధించవచ్చు అని ఆమె చెప్పడంతో జానకి కూడా మళ్లీ ఆలోచనలో పడుతుంది. అంతేకాకుండా ఆ పోలీసు అధికారి ప్రత్యేకంగా జానకికి ఆల్ ది బెస్ట్ చెబుతుంది. ఇక తర్వాత జానకి వెల్లగా బయటకు నడుచుకుంటూ వెళుతూ అఖిల్ విషయంలో రామ గారు ఏదో ఉన్నారు అని నా చిరకాల కోరికను పక్కన పెట్టడం కరెక్ట్ కాదేమో అని ఆలోచిస్తుంది. పోలీసు అధికారి అయితే బాగుంటుంది అని కూడా అనుకుంటుంది.

  కన్నబాబు కౌంటర్లు

  కన్నబాబు కౌంటర్లు

  ఇక జానకి అలా వెళుతుండగా అప్పుడే అక్కడికి సునంద దేవి కొడుకు కన్నబాబు కూడా వస్తాడు. ఇక జానకి గురించి అతను వెటకారంగా మాట్లాడుతుంటాడు. నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని అనుకుంటున్నావు అయితే అందులోని స్వార్థం చాలానే ఉంది అని తప్పు చేసినా కూడా నీ మరిదిని కేసు నుంచి బయటపడేలా చేసావు అని నీలాంటి అమ్మాయి సమాజంలో పోలీస్ అధికారి అయితే నేరస్తులు చాలా హ్యాపీగా తిరుగుతారు అని ముఖ్యంగా అఖిల్ భవిష్యత్తులో మరింత పెద్ద తప్పులు చేసిన కూడా ఏ మాత్రం ప్రాబ్లం ఉండదు అని అతను కౌంటర్ ఇచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటాడు.

  జానకి నిర్ణయం ఎలా ఉంటుందో..

  జానకి నిర్ణయం ఎలా ఉంటుందో..

  జానకి కూడా అతని మాటలకు సీరియస్ గానే సమాధానం చెబుతూ ఉంది. వచ్చిన పని చూసుకొని వెళ్ళు అని కూడా అంటుంది. అయితే కన్నబాబు చెప్పిన మాటలు కూడా జానకి మనసులో మెదులుతూ ఉంటాయి. రామచంద్ర కూడా తన భార్య మళ్ళీ చదువుకోవాలి అని దేవుడి ముందు చేతిలో కర్పూరం పెట్టుకొని ఉంటాడు. ఇక అప్పుడే జానకి వచ్చి ఆ కర్పూరం ను తీసేస్తుంది. మరి ఈ వివాదంతో జానకి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial November 29th Episode 442
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X