Janaki Kalaganaledu November 2nd: జానకికి 15 రోజుల టార్గెట్ సెట్ చేసిన జ్ఞానాంబ.. తేడా వస్తే బయటికే..
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ సీరియల్ మొదలైనప్పుడు అంతగా ఆకట్టుకోవడం లేదని కామెంట్స్ కూడా వచ్చాయి. ఫైనల్ గా అసలు కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఫ్యామిలీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా నేటితరం యువతను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. రామ జానకి మధ్యలో వచ్చే లవ్ సీన్స్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక రాశి మొదటిసారి బుల్లితెరపై ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించడం విశేషం. రొటీన్ గా కాకుండా కాస్త భిన్నమైన ఎమోషన్ ను హైలెట్ చేస్తున్నారు. భర్త సహకారంతో ఐపీఎస్ అవ్వాలని అనుకున్న జానకి తన కలను ఏ విధంగా నెరవేర్చుకుంటుంది అనేది ఈ కథలో అసలు పాయింట్. ఇక చదువుకున్న అమ్మాయిని కోడలిగా చేసుకోవద్దని అనుకున్న జ్ఞానాంబకు తన కోడలు డిగ్రీ చదువుకుని మోసపూరితంగా ఇంట్లోకి అడుగు పెట్టిందని ఆందోళన చెందుతుంది. ఇక నేడు ప్రసారం కాబోయే 162వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒక లుక్కేయండి..

కొడుకు కూడా అబద్ధం చెప్పడంతో
జానకి కుటుంబ సభ్యులు జ్ఞానాంబకు తెలియకుండా జానకి 5వ తరగతి మాత్రమే చదువుకున్నట్లు చెప్పి ఆమె కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇక జరిగిన మోసం గురించి తెలుసుకున్న జ్ఞానాంబ షాక్ అవుతుంది. గతంలో చదువుకున్న అమ్మాయి కారణంగా తన తమ్ముడు అవమానంతో మృతి చెందాడు అని మళ్ళీ అదే తరహాలో కొడుక్కి ఏమైనా జరుగుతుందో ఏమో అని జ్ఞానాంబ బయపడుతుంది. అంతే కాకుండా కొడుకు కూడా భార్య విషయంలో నిజం దాచడంతో మరింత ఆశ్చర్యానికి గురైన జ్ఞానాంబ ఇద్దరితో మాట్లాడకుండా దూరంగా ఉంచుతుంది.

రామ చొక్కా పట్టుకున్న కస్టమర్
అయితే తల్లి మాట్లాడడం లేదు అనే బాధతో రామచంద్ర కూడా ఎంతగానో ఆవేదనకు గురి అవుతాడు. ఇక ఆ బాధతో స్వీట్ షాప్ లో వచ్చిన ఆర్డర్స్ ను కూడా సరిగ్గా పట్టించుకోడు. ఒకరోజు ముందుగానే వచ్చిన కస్టమర్ రేపు ఉదయం కల్లా పుతారేకులు ఇచ్చేయాలని చెప్పడంతో రామచంద్ర సరే అని అంటాడు. అయితే అప్పుడే పని వాళ్ళు ఆరోగ్యం బాగా లేదని మానేయడంతో రామచంద్ర తన తమ్ముడికి ఆర్డర్ క్యాన్సిల్ చేయమని చెబుతాడు. కానీ అతను మర్చిపోవడం తో కస్టమర్ వచ్చి రామచంద్రపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నడిరోడ్డులోకి తీసుకొచ్చి చొక్కా పట్టుకుంటాడు.

సీన్ లోకి వచ్చిన జ్ఞానాంబ
అప్పుడే భర్త కోసం భోజనం తెచ్చిన జానకి అది చూసి ఒక్క సారిగా షాక్ అవుతుంది. వెంటనే చొక్కా వదలమని అతనికి చెబుతుంది. అయినప్పటికీ కూడా అతను వెనక్కి తగ్గడు. ఇక ఇంతలో సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన జ్ఞానాంబ అతన్ని వెనక్కి నెట్టి వేస్తుంది. నా కొడుకు చొక్కా పట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం అంటూ వార్నింగ్ ఇస్తుంది. అయితే అంతకు ముందే జ్ఞానాంబ ఆర్డర్ గురించి తెలుసుకొని పూతరేకుల సిద్ధం చేస్తుంది. మీ పూతరేకులు ఇదిగో అంటూ తీసుకువెళ్లాలని చెబుతుంది.

జ్ఞానాంబ కళ్ళపై పడిన జానకి
అంతేకాకుండా తన కొడుకుకి క్షమాపణ చెప్పాలని అనడంతో అతను సారీ చెబుతాడు. ఇక ఆ తర్వాత రామచంద్ర తల్లి ప్రేమకు ఎంతగానో సంతోషపడుతూ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ కూడా జ్ఞానాంబ మనసు ఏమాత్రం కరగదు. జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకొని ఆమె తలలోని పంతన్ని చూపిస్తుంది. ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నం చేయగా జానకి కూడా అత్తగారి కాళ్ళ మీద పడుతుంది.

మల్లిక మనసులో మరో కంగారు
మీరు మాట్లాడడం లేదు అని మీ కొడుకు రెండు రోజులుగా మనిషి మనిషిలా లేడు. ఆయన ఏమైపోతాడో అని చాలా భయంగా ఉంది. కావాలంటే ఆయన నుంచి నన్ను దూరం చేయండి కానీ తల్లి ప్రేమను మాత్రం మీ కొడుకుకి దూరం చేయకండి. అతను ఏమాత్రం తట్టుకోలేడు అంటూ జానకి బ్రతిమాలుతుంది. ఆ తరువాత కాస్త ఆలోచించిన జ్ఞానాంబ నీ భార్యను తీసుకొని మన తోట లోకి రా అని రామచంద్రకు చెబుతుంది. ఇక మరోవైపు మల్లిక జానకి విషయంలో మరింత ఆందోళన చెందుతుంది. చదువు విషయం తెలిసిన తర్వాత కోడలిని ఇంట్లో నుంచి పంపేస్తుంది అనుకుంటే మళ్లీ తోటకు తీసుకువెళ్ళింది. ఈ దెబ్బతో వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ కలిసిపోతారు ఏమో అని కంగారుగా ఉంది అంటూ తన పని మనిషితో చెప్పుకుంటూ బాధపడుతుంది.
Recommended Video

జానకికి మరో 15 రోజుల గడువు
అయితే వారు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని మల్లిక కూడా తోట లోకి వెళుతుంది. అయితే అక్కడ జ్ఞానాంబ జానకి రామ చంద్రులకు ఒక విషయాన్ని చెబుతుంది. ముఖ్యంగా జానకికి 15 రోజుల గడువు కూడా ఇస్తుంది. ఈ పదిహేను రోజులలో నువ్వు చదువుకున్న అహంకారాన్ని చూపించినా.. మా ఇంటికి గౌరవం లేని విధంగా ప్రవర్తించినా.. కూడా నా కొడుకు జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్లి పోవాల్సి ఉంటుంది అని ఆదేశాలు జారీ చేస్తుంది. జానకి కూడా అందుకు ఒప్పుకుంటుంది. ఇక కార్ వెనకాలనుంచి జరిగిన సన్నివేశాన్ని చూసిన మల్లిక మరొక చిచ్చు పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. జానకి డిగ్రీ చదువుకుంది అనే కారణం తోనే మాట్లాడకుండా దూరం పెట్టిన జ్ఞానాంబ ఇక జానకి కలెక్టర్ చదువుతున్నట్లు నిజం తెలిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











