Janaki Kalaganaledu November 30th: మల్లిక చేసిన పనికి జ్ఞానాంబపై పోలీస్ కేసు.. రిస్క్ లో జానకి
జానకి కలగనలేదు సీరియల్ అసలు ట్రాక్ లోకి రావడంతో మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇటీవల కాలంలో ఈ సీరియల్ ప్రేక్షకుల సంఖ్యను కూడా అమాంతంగా పెంచుకుంటోంది. ఎలాగైనా ఐపీఎస్ అవ్వాలని అనుకున్న జానకి.. భర్త నుంచి కూడా సహాయం పొందుతుంది. కానీ పరిస్థితులు ఒక్కసారిగా ఆమెని ప్రశ్నార్థకంగా మారుస్తాయి. అత్త పెట్టిన కట్టుబాట్ల మధ్యలో ఇబ్బందులను దాటి తన కలను నెరవేర్చుకోవాలని కూడా అనుకుంటుంది.
రేటింగ్స్ అందుకోవడంలో జానకి కలగనలేదు మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 44వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.. ఇక రూరల్ ఏరియాలో 43వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 44వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 182వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

ఆత్మహత్య చేసుకున్నాడని..
కొడుకు కంటే ఎక్కువగా చదువుకుందనే అహంకారం వస్తే ఏం జరుగుతుందో ఏమో అని జ్ఞానాంబ ఆందోళన చెందుతుంది. భార్య అహంకారం కారణంగా తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని, అలాగే ఇప్పుడు రామ విషయంలో కూడా అలానే జరుగుతుందేమో అని జ్ఞానాంబ కూడా కొంత ఆందోళన చెందుతుంది. ఇక ఆ విషయంలో జ్ఞానంబ అత్త మైరావతి కూడా కఠినంగానే ఆలోచిస్తుంది.
చదువుకున్న పొగరును ఎప్పుడు చూపించిన కూడా ప్రమాదమే, అందుకే విడాకులు ఇప్పించాలని మైరావతి జ్ఞానాంబకు చెబుతుంది. కానీ జ్ఞానాంబ మైరావతి చెప్పినట్లుగా కాకుండా జానకిని ఇంట్లోనే ఉండమని చెబుతుంది.

జానకి స్నేహితుడు రావడంతో
మైరావతి జానకిని తప్పుగా అర్థం చేసుకున్నట్లు చెబుతూ.. ఇక ఇంట్లో నుంచి బయటకు పంపించాలని మల్లికకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. జ్ఞానాంబ జానకి ఇద్దరు కూడా సంతోషంగా ఉండటం చూసి మల్లిక కుళ్ళుతో ఎంతగానో బాధ పడుతుంది. ఇక అప్పుడు జ్ఞానాంబ వచ్చి కౌంటర్ కూడా ఇస్తుంది.
ఇక గుడికి వెళ్లిన జానకికి అనుకోకుండా ఒక చేదు అనుభవం ఎదురవుతుంది. ఎవరూ ఊహించని విధంగా జానకి స్నేహితుడు అభి కూడా గుడికి వస్తాడు. ఆమెకు ఐపీఎస్ కోర్సు సంబంధించిన పరీక్షల పుస్తకాలను ఇవ్వాలని అనుకుంటాడు. జానకి ఇంటికి వెళ్లే ముందు అతను కూడా గుడికి వస్తాడు.

అభిని కలవనివ్వకుండా చేసిన రామచంద్ర
ఇక ఆ గుడిలోనే జానకిని చూడడంతో ఇక్కడే జానకికి పుస్తకాలు ఇస్తే సరిపోతుంది కదా అని అనుకుంటాడు. ఇక జానకి అతన్ని చూసి మెల్లగా తప్పించుకోవాలని అనుకుంటుంది. ఇక ఆ తర్వాత జ్ఞానాంబ ఆ అబ్బాయిని పిలవడం విశేషం. అంతే కాకుండా అభి, రామచంద్రకు కూడా ఫోన్ చేస్తాడు. జానకిని కలవాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. ఇక రామచంద్ర వెంటనే అతన్ని అక్కడి నుంచి స్వీట్ షాప్ కు రమ్మని చెబుతాడు. ఇక రామ అలా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియక సైలెంట్ గా అభి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ఏమీ మాట్లాడకుండానే
ఇక అభి వెళ్లిపోతున్న సమయంలో అతన్ని జ్ఞానాంబ పిలుస్తుంది. దీంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు ఆమె ఎందుకు పిలుస్తుంది అని జానకి అనుకుంటున్న తరుణంలో జ్ఞానాంబ కేవలం టైమ్ ఎంత అవుతుందని అడుగుతుంది. ఇక ఆ తర్వాత అభి జానకిని చూసినప్పటికీ ఏమీ మాట్లాడకుండానే స్వీట్ షాప్ కి వెళ్లిపోతాడు.

చదువు అనే ప్రస్తావన తీసుకురావద్దు
అక్కడ రామచంద్ర అభికి జరిగిన విషయాన్ని వివరంగా చెబుతాడు. మా అమ్మగారికి తెలియకుండా జానకిని ఐపీఎస్ చదవాలని అనిపించుకున్నట్లు నిజం చెప్పడంతో అభి కూడా అర్థం చేసుకుంటాడు. అంతే కాకుండా రామ గొప్పతనాన్ని కూడా మెచ్చుకుంటాడు. ఆ తర్వాత జానకి కోసం తెచ్చిన పుస్తకాలను అభి రామచంద్రకు అక్కడ ఇచ్చేస్తాడు. పుస్తకాలు తీసుకొని రామచంద్ర ఇంటికి వస్తాడు. కానీ జానకి మాత్రం అభి చెప్పిన విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఫోన్ చేస్తుంది. మరొకసారి తన జీవితంలో చదువు అనే ప్రస్తావన తీసుకు రావద్దు అని తను ఇంట్లో కోడలిగా పూర్తి చేయాల్సిన బాధ్యత లో చాలా ఉన్నాయి అని వివరంగా చెబుతుంది.
Recommended Video

జ్ఞానాంబపై పోలీస్ కేసు
ఇక రామచంద్ర ఎంతగా బ్రతిమాలినప్పటికి కూడా జానకి ఆ పుస్తకాలను స్వీట్ షాప్ లో పొట్లాలు కట్టేందుకు పనిమనిషికి ఇచ్చి పంపిస్తుంది. ఆ క్రమంలో రామచంద్ర వాదిస్తూ ఉండగా అప్పుడే జ్ఞానాంబ కూడా ఎంట్రీ ఇస్తుంది. ఎందుకు ఇద్దరు వాదించుకుంటున్నారు అని అడిగినప్పుడు పనికిరాని పుస్తకాలను స్వీట్ షాప్ లోకి పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతారు.
అందుకు జ్ఞానాంబ భార్య మాట వినాలి కదా అంటూ రామచంద్రకు చెబుతుంది. ఇక సునంద ఇంట్లో ఫంక్షన్ కు వెళ్లేందుకు జ్ఞానాంబ కుటుంబ సిద్ధమవుతారు. అయితే ఆ వేడుకలో కొంతమంది జ్ఞానాంబ షాప్ నుంచి వచ్చిన పూతరేకుల కారణంగా వాంతులు చేసుకుని ఆసుపత్రి పాలవుతారు దీంతో ఆ పార్టీకి వచ్చిన పోలీసులు జ్ఞానాంబను అరెస్టు చేయాలని అంటారు. ఇక ముందుగానే జానకిపై నిందలు పడేలా మల్లిక పూత రేకుల నెయ్యిలో మందు కలుపుతుంది. ఇక ఆ పరిణామాలతో జానకి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











