Janaki Kalaganaledu November 3rd: స్నేహితుల వల్ల ఇబ్బందుల్లో పడిన జానకి.. జ్ఞానాంబకు మరో అవమానం
జానకి కలగనలేదు సీరియల్ మొదలైనప్పుడు రాశి రీ ఎంట్రీ ఇస్తోంది అనగానే ఆ సీరియల్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. జ్ఞానాంబ పాత్రలో రాశి చాలా పవర్ఫుల్ గా కనిపించడంతో ఓ వర్గం ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే సీరియల్ మొదటి 50 ఎపిసోడ్స్ వరకు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. నెగిటివ్ కామెంట్స్ చాలానే వచ్చాయి. ఇక మెల్లగా అసలు కథలోకి రావడంతో వీక్షకుల సంఖ్య కూడా పెరిగింది. ఫైనల్ గా అసలు కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది.
ఫ్యామిలీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా నేటితరం యువతను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. రామ జానకి మధ్యలో వచ్చే లవ్ సీన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఐపీఎస్ అవ్వాలని అనుకున్న జానకి తన కలను ఏ విధంగా నెరవేర్చుకుంటుంది అనేది ఈ కథలో అసలు పాయింట్. ఇక చదువుకున్న అమ్మాయిని కోడలిగా చేసుకోవద్దని అనుకున్న జ్ఞానాంబకు తన కోడలు డిగ్రీ చదువుకున్నట్లు తెలియగానే షాక్ అవుతుంది. ఇక నేడు ప్రసారం కాబోయే 163వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

అబద్ధం కారణంగా..
చదువుకున్న కోడలని తెచ్చుకోవద్దు అనే జ్ఞానాంబ చాలా మంది అమ్మాయిలను చూస్తుంది. గతంలో తమ్ముడు చదువుకున్న అమ్మాయి అహంకారం కారణంగానే చనిపోయాడు అని మళ్లీ ఆ ఘటన తన కొడుకు జీవితంలో జరగకూడదని జ్ఞానాంబ ఎంతో ఆలోచించి చదువుకోలేని కోడలిని తెచ్చుకోవాలని అనుకుంటుంది. కుటుంబ సభ్యులు జానకి డిగ్రీ చదివిన విషయాన్ని దాచి పెట్టే పెళ్లి చేస్తారు.
ఆ విషయం ఆలస్యంగా తెలియడంతో సందిగ్ధంలో పడుతుంది. అయితే ఆమెను ఇంట్లోంచి పంపించాలని కూడా అనుకుంటుంది. కానీ కొడుకు రామచంద్ర అడ్డుపడతాడు. ఆమె చదువుకున్న విషయం కూడా అతనికి తెలియడంతో జ్ఞానాంబ మరింత సీరియస్ అవుతుంది కొడుకుతో కూడా మాట్లాడకుండా ఉంటుంది.

ఆవేదనకు గురైన రామచంద్ర
తల్లి మాట్లాడకపోవటంతో ఆవేదనకు గురైన రామచంద్ర స్వీట్ షాప్ ను కూడా పట్టించుకోవడం మానేస్తాడు. ఒక కస్టమర్ కు అనుకున్న సమయానికి స్వీట్స్ ఆర్డర్ చేయకపోవడంతో అతను కొట్టుకు వచ్చి గొడవ చేస్తాడు. ఇక అదే సమయంలో సమస్యను పరిష్కరించి జ్ఞానాంబ రామచంద్ర పై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇలా బాధగా ఉంటే మనకు ఎంతో ఆధారం అయినటువంటి స్వీట్ షాప్ భవిష్యత్తు ఏమవుతుంది అని ప్రశ్నిస్తుంది. అయితే అందుకు జానకి మీ అబ్బాయి గారు మీతో మాట్లాడక పోవడం వల్లనే చాలా బాధపడుతున్నారు అందువల్ల ఈ పొరపాట్లు జరుగుతున్నాయి అని చెబుతోంది ఇక జానకి ఆ విధంగా సమాధానం ఇవ్వడంతో జ్ఞానాంబ వారికి మరొక అవకాశం ఇస్తుంది.

15 రోజుల షరతు
రాబోయే 15 రోజుల్లో లో నా కొడుకును అవమానించినట్లు గాని లేదా నాకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇలాంటి పని చేసినా కూడా నిన్ను ఇంట్లో నుంచి పంపించడం జరుగుతుంది అని నీ భర్తే నిన్ను బయటకు పంపిచేస్తాడని కూడా జ్ఞానాంబ షరతులు విధిస్తుంది. దీంతో జానకి అత్త చెప్పిన మాటలకు అంగీకరిస్తూ తప్పకుండా మీకు గౌరవం కల్పించే విధంగా నేను ఎలాంటి పనులు చేయను అలా చేసిన రోజునే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటూ మరింత నమ్మకంతో జానకి సమాధానమిస్తుంది. ఇక వారు చెప్పిన విషయాన్ని జ్ఞానాంబ కూడా సున్నితంగా అంగీకరిస్తోంది.

మరో చిచ్చు పెట్టిన జ్ఞానాంబ
అయితే జ్ఞానాంబ కొడుకు కోడలితో ఏం మాట్లాడుతుందో అనే అనుమానాలతో మల్లిక సందిగ్ధంలో పడుతుంది. ఇక వారి గురించి తెలుసుకోవాలని తోటలోకి కూడా వెళుతుంది. అయితే దారిలో ఆమె స్నేహితురాలు అడ్డుపడి ఒక ఆట ఆడుదాం అని అంటుంది. కానీ మల్లిక లేదు త్వరగా వెళ్లాలి అని చెప్పినా కూడా ఆమె మా అత్తయ్య కూడా ఉన్నారు అంటూ ఒక ఆట ఆడుదాం అని ఉంటుంది. అత్తా కోడళ్ళ మధ్య చిచ్చు పెడితే తప్ప వదిలేలా లేరు అని మల్లికా ఆలోచించి ఒకరిపై ఒకరు నిందలు వేస్తుంది. దీంతో ఆ అత్తా కోడలు అక్కడే మళ్ళీ గొడవ పడతారు. ఇక మల్లికా తోటలోకి వచ్చి జ్ఞానాంబ కొడుకు కోడలితో వివరించిన షరతుల గురించి తెలుసుకుంటుంది.

జానకి స్నేహితుల కారణంగా..
తర్వాత జ్ఞానాంబ జానకినీ రామచంద్రుని క్షమించినట్లు తెలియడంతో ఇంట్లో వారందరూ కూడా స్వీట్స్ పంచుకుంటూ సంతోషంగా ఉంటారు. ఇక అదే సమయంలో జానకికి సంబంధించిన కొంతమంది స్నేహితులు వచ్చి 15 రోజుల్లో విధించిన షరతు గురించి ప్రశ్నిస్తారు. 15 రోజుల్లో తేడా వస్తే ఇంట్లో నుంచి బయటకు పంపించడం ఏమిటి అని అడుగుతారు. ఇక జ్ఞానాంబకు అది అగౌరవంగా అనిపించడంతో మళ్లీ ఆగ్రహానికి గురి అవుతుంది.
ఆ విషయంలో నా తప్పు లేదు అని జానకి చెప్పినప్పటికీ నువ్వే కావాలని అలా మాట్లాడించి ఉంటావాని అనుమానం వ్యక్తం చేస్తుంది. మరి ఈ వివాదం జానకి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి. అంతే కాకుండా జానకి ఐపీఎస్ అవ్వాలని అనుకుంటున్న నిజం గురించి తెలిస్తే ఆమె ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే విషయం కూడా ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











