Janaki Kalaganaledu November 4th: జానకి జీవితంలోకి కొత్త క్యారెక్టర్.. ఆమెదే తుది నిర్ణయం!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు అభిమానుల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూనే ఉంది. జ్ఞానాంబ పాత్రలో రాశి చాలా పవర్ఫుల్ గా కనిపించడంతో ఓ వర్గం ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక సీరియల్ మొదటి 50 ఎపిసోడ్స్ వరకు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఫ్యామిలీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా నేటితరం యువతను కూడా ప్రేమ సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రామ జానకి మధ్యలో వచ్చే లవ్ సీన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక భర్త అండతో ఐపీఎస్ అవ్వాలని అనుకున్న జానకి తన కలను ఏ విధంగా నెరవేర్చుకుంటుంది అనేది ఈ కథలో అసలు పాయింట్. ఇక చదువుకున్న అమ్మాయిని కోడలిగా చేసుకోవద్దని అనుకున్న జ్ఞానాంబకు తన కోడలు డిగ్రీ చదువుకున్నట్లు తెలియగానే షాక్ అవుతుంది. ఇక నేడు ప్రసారం కాబోయే 163వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

 15 రోజుల్లో ఎలాంటి తేడా వచ్చినా

15 రోజుల్లో ఎలాంటి తేడా వచ్చినా

చదువుకోలేని కొడుకు కోసం చదువుకోలేని అమ్మాయిని భార్యగా తీసుకురావాలని జ్ఞానాంబ చాలా బలమైన నిర్ణయం తీసుకుంటుంది. అయితే జానకి కుటుంబ సభ్యులు మాత్రం రామచంద్ర పై నమ్మకంతో జానకి 5వ తరగతి మాత్రమే చదువుకుంది అని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారు. ఆ విషయం తెలియని జానకి అత్తగారి ఇంట్లోకి అడుగుపెట్టగానే అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటుంది. ఇక జానకి డిగ్రీ చదువుకున్న విషయం తెలియగానే ఇంట్లో నుంచి బయటకు పంపించాలని అనుకుంటుంది. కానీ రామచంద్ర తనకు ఆ విషయం ముందే తెలుసు అని చెప్పడంతో జ్ఞానాంబ కొడుకును కూడా దూరం పెడుతుంది. ఇక జానకి మంచి కోడలిగా మంచి భార్యగా నిరూపించుకోవడానికి జ్ఞానాంబ మరొక మంచి అవకాశాన్ని ఇస్తుంది. 15 రోజుల్లో ఎలాంటి తేడా వచ్చినా కూడా ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని కూడా షరతు పెడుతుంది.

గోవిందరాజు మద్దతు

గోవిందరాజు మద్దతు


తప్పకుండా జానకి 15 రోజుల్లోగా మంచి ఇల్లాలిగా గుర్తింపు పేరు సంపాదించుకుంటుంది అని గోవింద రాజులు కూడా ఎంతో నమ్మకంతో ఉంటాడు. అంతేకాకుండా ఇంట్లో అందరికీ స్వీట్స్ పంచుతూ ఉంటాడు కానీ ఇప్పుడే అలాంటి వేడుకలు ఏమి చేసుకోవద్దని ఇంకా పదిహేను రోజుల సమయంలో ఏదైనా జరగవచ్చు అని హెచ్చరిస్తుంది. కానీ గోవింద రాజులు మాత్రం జ్ఞానంబ మీద నమ్మకంతో తప్పకుండా ఈ షరతులకు నువ్వు విజయం సాధిస్తావు అని స్పందిస్తాడు. అయితే జానకి మనసులో మాత్రం ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ఉదయమే లేచి ఇంట్లో పనులన్నీ కూడా చేస్తుంది.

మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నంలో మల్లిక

మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నంలో మల్లిక


మరోవైపు మల్లిక ఎలాగైనా పెద్ద కోడలిని ఈ పదిహేను రోజుల్లోగా ఇంట్లో నుంచి పంపించేయాలని చాలెంజ్ చేస్తుంది. అయితే ఆమె భర్త అలాంటి చెడ్డ పనులు చేయ వద్దని చెప్పినా కూడా మళ్ళి ఏమాత్రం వెనక్కి తగ్గదు. ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా నేను జానకి విషయంలో వెనుకడుగు వేసేది లేదు అంటూ చాలెంజ్ చేస్తుంది. ఇక బయటకు వచ్చిన తర్వాత మల్లిక అత్తకు కాఫీ ఇచ్చి మాటలతో మరింత రెచ్చగొట్టాలని అనుకుంటుంది. కానీ జ్ఞానాంబ ఆ కాఫీ తీసుకోదు. దీంతో మల్లిక పెద్ద కోడలు కాఫీ ఇస్తేనే తీసుకుంటారు కదా అంటూ కౌంటర్ ఇస్తుంది అలాంటిదేమీ లేదు అని సమాధానం ఇచ్చినప్పటికీ కూడా జానకి తప్పు చేసినా కూడా మీరు ఇంట్లో పెట్టుకున్నారు ఎంతైనా నాకంటే మీకు ఆమెనే ఎక్కువ ఇష్టం అని జ్ఞానాంబ మరొక మాట చెబుతుంది. కానీ అలాంటిదేమీ లేదు అంటూ జ్ఞానాంబ చెబుతుంది.

నిలదీసిన జానకి స్నేహితులు

నిలదీసిన జానకి స్నేహితులు

ఇక అదే సమయంలో జానకి స్నేహితులు కూడా జానకి ఇంటికి వచ్చి ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు. 15 రోజుల్లోగా మంచి కోడలు మంచి భార్యగా నిరూపించుకో కాకపోతే ఇంట్లో నుంచి పంపికచేయడం ఏమిటి ఏ కాలంలో ఉన్నారు అని శ్రావణి తో పాటు స్నేహితులు కూడా అడుగుతారు. అయితే అప్పుడే జానకి కంగారుపడుతూ శ్రావణి దగ్గరికి వచ్చే మా అత్తగారు గురించి ఇంకొక్క మాట కూడా మాట్లాడకూడదు అంటూ ఎంతగానో వివరించే ప్రయత్నం చేస్తుంది. కానీ శ్రావణి మాత్రం నువ్వు సైలెంట్ గా ఉంటే నీ జీవితాన్ని కష్టాల్లో నెట్టేసుకుంటున్నావు అని చెబుతారు.

నువ్వు రావడమే వీళ్ళ అదృష్టం

నువ్వు రావడమే వీళ్ళ అదృష్టం


అంతేకాకుండా నువ్వు ఇంటికి కోడలిగా రావడం వీళ్ళ అదృష్టం నీకు ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలు కూడా వచ్చి ఉండేవి . నువ్వు చదువుకున్న దాన్నిబట్టి నీన్ను చాలా గొప్ప వాళ్ళు పెళ్లి చేసుకునే వారు. ఆ విషయం వీళ్లకు అర్థం కావడం లేదు. మీ అత్తగారు కేవలం ఆమె కొడుకు జీవితం గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ మరోవైపు ఒక ఆడపిల్ల జీవితం కూడా సందిగ్ధంలో పడుతుంది అనే ఆలోచన ఆమెకు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు అంటూ శ్రావణి జానకి వివరిస్తుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
జానకి జీవితంలోకి కొత్త క్యారెక్టర్

జానకి జీవితంలోకి కొత్త క్యారెక్టర్

ఇక జానకి చివరికి వాళ్లను అక్కడినుంచి పంపిచేసి వారు అన్నదానికి నా తరపున క్షమాపణ చెబుతున్నానని జ్ఞానాంబతో అంటుంది. కానీ ఆ మాటలు నువ్వే అనిపించి ఉంటావు అంటూ జ్ఞానాంబ మరొక కౌంటర్ ఇస్తుంది. ఇక జానకి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో జ్ఞానాంబ తన భర్త గోవిందరాజులు వద్ద కూడా సలహా అడుగుతుంది. అయితే ఈ పదిహేను రోజులు జానికి విషయంలో ఒక నిర్ణయానికి రావాలి అంటే మా అమ్మ మైరావతి బెస్ట్ అని. ఆమె అయితేనే జానకిని క్షుణ్ణంగా పరీక్షించి ఒక నిర్ణయానికి వస్తుందని అంటాడు. మరి ఆమె జానకి పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X