Janaki Kalaganaledu November 5th: జ్ఞానాంబ కంటే మరో పవర్ఫుల్ అత్త.. జానకి జీవితంలో మరో ఛాలెంజ్
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఐపీఎస్ అవ్వాలని కలలు కన్న జానకి ఇంట్లో తల్లిదండ్రులు చనిపోవడంతో ఒక్కసారిగా తన కలను పక్కన పెట్టేస్తుంది. అంతే కాకుండా ఆమె అన్నయ్య పెళ్లి చేయడంతో భర్త సహాయంతో అయినా ఐపీఎస్ అవ్వాలని అనుకుంటుంది. చదువు కోసం కోచింగ్ కు కూడా సిద్ధమవుతుంది. కానీ అత్త జ్ఞానాంబకు చదువుకున్న కోడలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అలంటి పరిస్థితులలో కోడలు ఎలా తన కలను నెరవేర్చుకుంది అనే పాయింట్ తో సీరియల్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది.
సీరియల్ మొదటి 50 ఎపిసోడ్స్ వరకు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఫ్యామిలీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా నేటితరం యువతను కూడా ప్రేమ సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రామ జానకి మధ్యలో వచ్చే లవ్ సీన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక నేడు ప్రసారం కాబోయే 164వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

జానకి అబద్ధం చెబితే..
జానకి చదువు గురించి నిజం తెలియడంతో జ్ఞానాంబ సందిగ్దంలో పడుతుంది. అసలైతే జానకి అబద్ధం చెబితే నేను ఇంట్లో నుంచి పంపించాలని అనుకున్నా ఆమె ఆమెజానకి మంచితనం గురించి తెలుసుకొని ఆలోచనలో పడుతుంది. అందుకే పదిహేను రోజులలో మంచి భార్యగా మంచి కోడలిగా నిరూపించుకోకపోతే ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్లి పోవాల్సి ఉంటుంది అని ఒక షరతు కూడా విధిస్తుంది.
అందుకు జానకి కూడా అత్తగారు చెప్పిన షరతులకు ఒప్పుకుంటుంది. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను అంటూ.. ఒకవేళ అలాంటి పొరపాటు జరిగితే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెబుతోంది.

జ్ఞానాంబకు శ్రావణి కౌంటర్
జానకి ఎంత చెప్పినా కూడా జ్ఞానాంబ మనసులో మాత్రం ఆందోళన పోదు. చదువుకునే అహంకారాన్ని చూపిస్తే తన కొడుకు జీవితంలో ఏలాంటి విషాదం చోటు చేసుకుంటుందో అని భయంగా ఉంటుంది. ఇక జానకి స్నేహితులు శ్రావణి ఇంటికి వచ్చి జ్ఞానాంబ ప్రశ్నిస్తారు.
ఇంకా ఏ కాలంలో ఉన్నారు మంచి భార్యగా మంచి కోడలిగా నిరూపించుకో కాకపోతే ఇంట్లో నుంచి పంపించడం ఏమిటి అని శ్రావణి ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా నీ కొడుకు జీవితం గురించి ఆలోచిస్తున్నారు గాని ఒక అబ్బాయి జీవితం గురించి ఆలోచించడం లేదు అని కౌంటర్ ఇవ్వడంతో అందరు షాక్ అవుతారు.

ఎలాంటి సంబంధం లేదని..
ఇక వెంటనే శ్రావణిని అదుపులోకి తీసుకున్న జానకి అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని చెబుతుంది. అయితే వారు చెప్పిన మాటలకు తనకు ఎలాంటి సంబంధం లేదని మీ మీద నాకు అలాంటి తప్పుడు అభిప్రాయం లేదని కూడా జానకి అత్తగారికి వివరించే ప్రయత్నం చేస్తుంది. కానీ జ్ఞానాంబ మాత్రం వారి మాటలకు చాలా ఫీల్ అవుతూ జానకికి మరో కౌంటర్ ఇస్తుంది నీ మనసులో ఎలాంటి ఆలోచనలు లేకపోవచ్చు.. కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నా కొడుకు జీవితం సందిగ్ధంలో పడుతుంది అనే అనుమానం వ్యక్తం చేస్తుంది.

అనుమానాలు ఏమాత్రం తక్కువ కావు
అలా ఎన్నటికీ జరగదు అని జానకికి వివరించే ప్రయత్నం చేస్తుంది. అయినా అలా ఎందుకు జరుగుతుంది మీరు నన్ను కన్నతల్లి కంటే ఎక్కువగా చేసుకుంటున్నారు. నా భర్త కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. ఇలాంటి వారి ముందు ఎందుకు అహంకారాన్ని చూపిస్తాను ఒకవేళ అలా చూపిస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటూ జానకి చెబుతుంది. అయినప్పటికీ జ్ఞానాంబకు జానకి విషయంలో అనుమానాలు ఏమాత్రం తక్కువ కావు. అలానే సందిగ్ధంలో ఆలోచిస్తూనే ఉంటుంది.

జానకి జీవితంలో మైరావతి
ఇక వెంటనే భర్త గోవిందరాజులు దగ్గరికి వచ్చి జానకి విషయంలో పడుతున్న ఆందోళన తగ్గి పోవాలి అంటే దానికి ఒకే ఒక్క దారి ఉంది అంటూ సలహా ఇస్తాడు. జానకికి ఇంకా 14 రోజుల గడువు ఉంది కాబట్టి మా అమ్మ మైరావతి ఆమెను గమనించి తన నిర్ణయాన్ని చెబుతుంది. ఆమె కూడా సాంప్రదాయాలు పద్ధతులు పాటించే మనిషి కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ఒక నిర్ణయానికి వస్తే నీకు పూర్తి నమ్మకం కలుగుతుంది అని గోవిందరాజులు వివరణ ఇస్తాడు.
Recommended Video

అత్తగారి అత్త గారు ఇంకా డేంజర్..
అందుకు జ్ఞానాంబ కూడా సరే ఉంటుంది. ఆ తర్వాత మల్లిక వెంటనే ఆ విషయాన్ని జానకికీ చెబుతుంది. వెంటనే జ్ఞానాంబ బట్టలు సర్ది చేసుకొని మీ ఇంటికి వెళ్ళిపో లేకపోతే మళ్లీ తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని సమాధానం ఇస్తుంది. ఎందుకంటే అత్తగారి అత్త గారు ఇంకా డేంజర్ అంటూ మైరావతి గురించి చెబుతుంది.
అయినప్పటికీ జానకి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మైరవతి ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతోంది ఆ క్రమంలో లో జానకిని చూసిన మైరావతి చాలా కోపంతోనే చూస్తుంది. జరిగిన విషయం మొత్తం జ్ఞానాంబ ముందుగానే మైరావతికి చెబుతుంది.. మరి ఆ విషయంలో మైరావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











