Janaki Kalaganaledu November 7th: బాధలో మాధురి తల్లిదండ్రులు.. అఖిల్ పై జానకి పోలీస్ కేసు!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. జ్ఞానాంబ కుటుంబంలో గొడవల వలన విబేధాలు రావడంతో పరిస్థితులు మారిపోతుంటాయి. ఇక పెద్ద కోడలు జానకి ఎవరిని విడిపోనివ్వకుండా చూసుకుంటుంది. జానకి తన భర్త రామ సహాయంతోనే ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక మరోవైపు అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. జనకికి ఇంట్లోనే మల్లిక నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి.
మరి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోని ప్రధాన అంశం. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 426 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

మాధురికి నిజం తెలియడంతో
జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ ఏ పని లేకుండా ఇంట్లో ఖాళీగా ఉండడంతో జానకి అతనికి ఏదైనా పని చేసుకోమని చెబుతుంది. అలాగే ఏదైనా కోర్సు నేర్చుకుని జాబ్ సాధించాలి అని కూడా చెబుతుంది. అయితే అఖిల్ మాత్రం ఆ మాటలను పట్టించుకోకుండా చెడుగా ఆలోచిస్తాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతో తప్పటడుగులు వేస్తూ ఉంటాడు. తన స్నేహితుడు సలహా మేరకు అఖిల్ డ్రగ్స్ మాఫియాలోకి అడుగుపెడతాడు.
తన కాలేజీలోనే డ్రగ్స్ అమ్ముతూ ఒక అమ్మాయికి కూడా అతను దొరికిపోతాడు. ఆ అమ్మాయి అఖిల్ స్నేహితురాలు మాధురి. ఇక మాధురి వెంటనే అఖిల్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని నువ్వు తప్పటడుగులు వేస్తూ ఉంటే సైలెంట్ గా ఉండలేను అని ఈ విషయం వెంటనే మీ ఇంట్లో చెబుతాను అని మాధురి అంటుంది.

మాధురి పరిస్థితి సీరియస్
అయితే అఖిల్ మాధురిని కంట్రోల్ చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఈ విషయం ఎట్టి పరిస్థితులను మా ఇంట్లో చెప్పకు అని నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకో అని అఖిల్ బ్రతిమాలతాడు. కానీ మాధురి మాత్రం వినకుండా అక్కడి నుంచి వెళుతుంది. అఖిల్ ఆమె వెంట పరిగెడుతూ ఒక కర్ర తీసుకొని కొడతాడు.
ఆ ఘటనను జానకి కూడా చూస్తుంది. జానకి వెంటనే మాధురిని తీసుకొని హాస్పిటల్ కి వెళుతుంది. అక్కడ ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. కానీ మాధురి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది అనే వైద్యులు చెబుతారు. ఇక వారి తల్లిదండ్రులు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు.

అఖిల్ నుంచి నిజం తెలుసుకోవాలి
అసలు అఖిల్ మాధురిని ఎందుకు కొట్టాడు అనే విషయంలో నిజం తెలుసుకోవాలి అని జానకి ఆలోచిస్తుంది. అందుకోసం అతనితో ప్రత్యేకంగా మాట్లాడాలని కూడా అనుకుంటుంది. ఇక అఖిల్ ఇంటికి రాగానే అతను ఏమీ తెలియనట్టుగా చాలా మారిపోయినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక జెస్సి తో మాట్లాడుతుండగా వెంటనే జానకి వచ్చి ఎవరో నీ కోసం వచ్చారు అని అబద్ధం చెబుతుంది.
ఇక కాస్త టెన్షన్ పడిన అఖిల్ మాధురి గురించి అడగడానికి వచ్చారేమో అని అనుకొని వెంటనే పరిగెడతాడు. కానీ జానకీ మాత్రం అఖిల్ దగ్గరికి వెళ్లి ఎవరూ రాలేదు అని అంటుంది. అసలు మాధురి ఎవరో కూడా తెలియదని చెప్పిన అఖిల్ ఆ తర్వాత జానకి మాటలకు దొరికిపోతాడు. ఇక అతని నుంచి సమాధానం రాబట్టాలని జానకి అనుకుంటుంది.

అప్పుడే చెప్పకూడదు అని..
అయితే జెస్సి మాత్రం అఖిల్ చాలా మారిపోయాడు అని అనుకుంటుంది. అందుకే జానకి అప్పుడే అందరి ముందు మాధురినీ కొట్టిన విషయాన్ని బయటకు చెప్పకూడదు అని అనుకుంటుంది. ఇక రామచంద్ర తో అయినా ఈ విషయం గురించి చెప్పాలని అనుకున్న జానకి మళ్ళీ ఎందుకో వెనుకడుగు వేస్తుంది. ఇక తర్వాత ఉదయాన్నే ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్ కు వెళ్ళిన జానకి అక్కడ మాధురి తల్లిదండ్రులు బాధపడుతున్న విధానాన్ని చూసి చలించి పోతుంది. అంతే కాకుండా జానకి తాను ఆలోచిస్తున్న విధానం కూడా చాలా తప్పు అని అనుకుంటుంది.

పోలీసులకు పట్టించాలని
స్వార్థంగా ఆలోచించకూడదు అని ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటే ఎలాంటి భేదాలు కూడా చూపకూడదని బాధితులకు న్యాయం చేసేలా ఉండాలి అని ఇంతకుముందే జానకి ప్రమాణం చేస్తుంది. ఇక ఇప్పుడు తన కుటుంబం కోసం ఆలోచించి అఖిల్ ను కాపాడాలని అనుకోవడం తప్పు అవుతుంది అని.. నిజం తెలుసు కాబట్టి వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని కూడా జానకి అనుకుంటుంది.
అనుకున్నట్లే జానకి పోలీస్ స్టేషన్ కు వెళ్లి అఖిల్ మీద కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులు జ్ఞానాంబ ఇంటికి వెళ్లి అఖిల్ ను అరెస్ట్ చేస్తున్నట్లు చెబుతారు. అయితే జ్ఞానాంబ మాత్రం ఈ ఒక్కసారికి పోలీసులను వెళ్ళమని చెప్పు తర్వాత దీని గురించి మాట్లాడదామని నచ్చ చెప్పాలని చూస్తుంది. కానీ జానకి సమయం లేదు అంటూ అందుకు అవకాశం కూడా లేదు అని చెబుతుంది. మరి ఈ వివాదంతో జానకి ఇంట్లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











