Janaki Kalaganaledu November 9th: జానకి ఎదుట మరో ఛాలెంజ్... నీకు పునర్జన్మ గుర్తుకు వస్తుందంటూ జ్ఞానాంబ అత్త..

జానకి కలగనలేదు సీరియల్‌ కథలో మరో మలుపు తిరిగింది. పండగ నేపథ్యంలో జ్ఞానాంబ తన అత్తగారింటికి కుటుంబంతో సహ వెళ్లింది. అయితే జ్ఞానాంబ కంటే మరీ కోపిష్టి అయిన అత్తగారు మైరావతి జానకితోపాటు మరో కోడలి ప్రవర్తనపై దృష్టిపెట్టింది. జానకి చదువుకొన్న పిల్ల అని, ఏదైనా గర్వం ఉంటుందా లేదా నేను తేల్చేస్తాను అంటూ మైరావతి రంగంలోకి దిగింది. అలా జానకి కలగనలేదు సీరియల్ 167వ ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

అత్త మైరావతి సేవలో జ్ఞానాంబ

అత్త మైరావతి సేవలో జ్ఞానాంబ


తన అత్త మైరావతి సేవల్లో జ్ఞానాంబ మునిగిపోయింది. తన కాళ్లు పడుతు ఉండటం చూసి కోడలు జ్ఞానాంబపై మైరావతి ప్రేమను కురిపించింది. ఎంత వయసు పెరిగినా పద్దతులు మరిచిపోలేదంటూ అత్త ప్రశంసించడంతో మురిసిపోయింది. పద్దతులు పాతవైనా మంచివే అంటూ జ్ఞానాంబ అనడంతో కోడలి ప్రేమను చూసి ఆనందంలో మునిగిపోయింది. నీ పద్దతులు అంటే నాకు చాలా ఇష్టం అంటూ మైరావతి సంతోషం వ్యక్తం చేసింది.

జ్ఞానాంబ ఎమోషనల్‌గా అత్తతో

జ్ఞానాంబ ఎమోషనల్‌గా అత్తతో

అయితే మైరావతి మనసును కదిలిస్తూ.. అత్తగారు మీరు ఎన్నాళ్లు ఒంటరిగా ఇక్కడ ఉంటారు. ఇప్పుడైనా మాతో వచ్చేయండి. మీరు కూడా మాతోనే ఉండండి అంటూ జ్ఞానాంబ కోరింది. దాంతో మైరావతి ఎమోషనల్ అయ్యారు. ఈ ఇల్లు, ఈ వాతావరణం మీ మామగారి జ్ఞాపకాలు. ఆయన ప్రాణం పోయిన చోటే నా ప్రాణం పోవాలి. నాక్కూడా మీతో ఉండాలని ఉంది. సరదాగా జీవితం గడపాలని ఉన్నప్పటికీ.. మీతో అక్కడ ఉంటే.. నా ప్రాణం ఇక్కడే ఉంటుంది. ఈ ఇంటితో ఉన్న సంబంధం నీకు తెలుసు కదా.. జ్ఞానాంబ అర్ధం చేసుకో అంటూ మైరావతి ఎమోషనల్ అయింది.

జానకి విషయం నేను చూసుకొంటా..

జానకి విషయం నేను చూసుకొంటా..

అయితే జ్ఞానాంబ మనసును చూసి..ఏదో చెప్పాలని వచ్చి ఏదో దాచిపెడుతున్నావు అంటూ మైరావతి అడిగితే.. జానకి సమస్య అంటే జ్ఞానాంబ మనసు విప్పింది. దాంతో నీవు పరిష్కరించలేనటువంటి సమస్య ఏదీ ఉండదు. అయినా నీవు అంతలా ఆలోచిస్తున్నావంటే సమస్య ఏదో పెద్దదే అయి ఉంటుంది అంటూ మైరావతి అంటే.. జానకి విషయమే అంటూ జ్ఞానాంబ బదులు ఇచ్చింది. దాంతో నేను చూసుకొంటాను.. నాకు వదిలేయ్ అంటూ మైరావతి చెప్పింది.

రాముడికి జానకి భార్య కావడం అదృష్టం

రాముడికి జానకి భార్య కావడం అదృష్టం

జానకి గురించి జ్ఞానాంబ చెబుతూ... మన ఇంటి కోడలు కావడం చాలా అదృష్టం. భర్తకు మంచి విలువ ఇస్తుంది. అత్తా, మామలకు కూడా అంతే విలువ ఇస్తుంది. ఏదైనా తిట్టినా మౌనంగా తలవంచుకొంటుంది. తన చేయని తప్పకు కూడా శిక్షలు విధించుకొంటుంది. అంత మంచిది జానకి. అందరి మంచి కోసం, ఇంటి పరువు నిలబెట్టుడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నది. రాముడికి అంతకంటే మంచి భార్య దొరకదు. అని జ్ఞానాంబ చెప్పింది.

నా తమ్ముడికి జరిగిన అవమానం అంటూ

నా తమ్ముడికి జరిగిన అవమానం అంటూ

అయితే నాకు ఒకటే భయం. జానకి తాను ఎక్కువ చదువు కోవడం వల్ల రాముడికి ఏదైనా జరుగుతుందోనని భయం. ఎక్కువ చదువుకొన్నాననే అహంకారంతో వ్యవహరిస్తుందేమోనని అనుమానం. నా జీవితంలో నా తమ్ముడికి జరిగిన అవమానం రాముడికి జరుగకూడదనేది నా కోరిక. నా తమ్ముడి భార్య బాగా చదువుకొని తన అతడిని అవమానించింది. దాంతో నా తమ్ముడు ఆత్మహత్య చేసుకొని మరణించాడు. రాముడి విషయంలో కూడా అది జరుగకూడదు. నా కొడుకు అసలే అమాయకుడు. అలాంటి వాడు భార్య అవమానిస్తే తట్టుకోగలడా అంటూ జ్ఞానాంబ బాధపడింది. ఈ విషయంలో నీవు భయపడకు.. జానకి ఎలాంటిందో నేను తేల్చేస్తానని మైరావతి చెప్పడంతో జ్ఞానాంబ ఊరట చెందింది.

జానకిని మొక్కలు నాటమని అంటూ..

జానకిని మొక్కలు నాటమని అంటూ..

ఇక జానకిని పిలిచి నీతో ఉంది.. నాతో రా అంటూ మైరావతి ఆదేశించింది. జానకిని తీసుకెళ్లి.. ఇంట్లో మొక్కలు పెట్టమని చెప్పింది. నీవు ఇంటికి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటమని చెప్పింది. భర్తతో గానీ మరేవరి సహాయం తీసుకోకుండా ఇంట్లో మొక్కలు నాటాలి. నేను చెప్పిన పనిని మనస్పూర్తిగా చేయాలి. మొక్కలు నాటడం నామోషిగా భావిస్తావేమో అనుకొంటావా అని మైరావతి అంటే.. పెద్దలు చెప్పడమే నా బాధ్యత అంటూ జానకి చెప్పింది.

 నేను చెప్పిన పని చేయకపోతే పునర్జన్మ అంటూ

నేను చెప్పిన పని చేయకపోతే పునర్జన్మ అంటూ

పెద్దల మాట బాధ్యతగా భావించి పనులు చేయి. లేకపోతే నీ పునర్జన్మ గుర్తుకు వస్తుంది. ఎవరి సహాయం లేకుండా మొక్కలు నాటు అంటూ మైరావతి చెప్పింది. దాంతో మొక్కలు నాటడంలో నిమగ్నమైంది. జానకి మొక్కలు నాటుతుంటే మైరావతి చూస్తూ మురిసిపోయింది.

Recommended Video

Raja Vikramarka Pre Release Event సినిమాకి పాత రోజులు వచ్చాయి Vishwak Sen
జానకి కలగనలేదు 43వ వారం రేటింగ్

జానకి కలగనలేదు 43వ వారం రేటింగ్

ఇదిలా ఉంటే.. జానకి కలగనలేదు సీరియల్ మంచి రేటింగ్‌తో నిలకడగా సాగుతున్నది. 42వ వారంలో అర్బన్‌లో 8.61 రేటింగ్ సొంతం చేసుకోగా, 43 వారంలో 8.15 రేటింగ్‌ నమోదు చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతంలో 42వారంలో 9.58 రేటింగ్ నమోదు చేసుకొంటే.. 43వ వారంలో 8.96 రేటింగ్‌ను సాధించింది. దాంతో ఈ సీరియల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందనే విషయం స్పష్టమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X