Janaki Kalaganaledu October 26th: కొడుకును దూరం పెట్టిన జ్ఞానాంబ.. ఆనందంలో మల్లిక జోరు!

జానకి కలగనలేదు సీరియల్ రేటింగ్స్ అందుకోవడంలో రోజురోజుకు సరికొత్త రికార్డులను క్రియేట్ చేసుకుంటోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు జానకి రామ ఎమోషనల్ లవ్ స్టొరీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఐపీఎస్ అవ్వాలని జానకి భర్త సహకారాన్ని తీసుకుంటుంది. అత్తగారికి తెలియకుండా ఐపీఎస్ అవ్వాలని కలలు కంటుంది. కానీ జానకి కేవలం 5వ తరగతి మాత్రమే చదువుకున్నట్లు అనుకున్న జ్ఞానాంబకు ఆమె డిగ్రీ చదివినట్లు తెలియడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక జానకి, రామ ఇద్దరు అబద్దాలు చెప్పారని తెలియగానే వారితో మాట్లాడడం మనేస్తుంది.

అంతే కాకుండా జానకి మరొక విడాకుల కండిషన్ పెట్టడంతో కథ సరికొత్త మలుపు తిరుగుతుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ 40వ వారంలో అర్బన్ ప్రాంతంలో 7.56 రేటింగ్ అందుకుంది.. ఇక రూరల్ లో మాత్రం 39వ వారంలో 8.07 రేటింగ్ రాగా 40వ వారంలో 8.73 రేటింగ్ సాధించింది. అత్తగారి భయం వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందని జానకి అర్థం చేసుకుంటుంది.

ప్రస్తుతం నిజం తెలియడంతో మరొక ఆసక్తికరమైన అంశంతో ఈ సీరియల్ కొనసాగనుంది. జానకిని బయటకు పంపించాలని అనుకున్న మల్లికకు మరొక షాక్ తగులుతుంది. నేడు ప్రసారం కాబోయే 157వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

జ్ఞానాంబ నిర్ణయానికి విరుద్ధంగా

జ్ఞానాంబ నిర్ణయానికి విరుద్ధంగా

జానకి కేవలం 5 వ తరగతి మాత్రమే చదువుకున్నట్లు అనుకున్న జ్ఞానాంబ తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. అయితే పెళ్లి అనంతరం ఆమె చదివింది డిగ్రీ అని తెలియడంతో కొడుకు కోసం ఎంతగానో కంగారు పడుతుంది. గతంలో చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న కారణంగా తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు అని జ్ఞానాంబ ఆ భయంతోనే కొడుకు కోసం చదువుకోలేని అమ్మాయిని తీసుకురావాలని అనుకుంటుంది. కానీ జానకి కుటుంబ సభ్యులు అబద్ధం చెప్పి పెళ్లి చేయడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది.

మౌనంగానే ఒప్పుకున్న జ్ఞానాంబ

మౌనంగానే ఒప్పుకున్న జ్ఞానాంబ

జానకి చదువుకున్న విషయం గురించి రామచంద్ర కూడా తెలుసు అని చెప్పడంతో జ్ఞానాంబ కొడుకును కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందరూ కలిసి నన్ను మోసం చేశారు అని బాధ పడుతుంది. తనను అమ్మ అని పిలవద్దని కూడా రామచంద్రకు శిక్ష వేస్తుంది. అయితే తల్లి కొడుకులు తన కారణంగా విడిపోయారని బాధపడిన జానకి అత్త ముందు విడాకుల కండిషన్ పెడుతుంది. రామచంద్ర గారిని ఎప్పుడైనా సరే అవమాన పరిచినట్లు అనిపిస్తే ఈ విడాకుల పత్రాన్ని అంగీకరించాలని చెబుతుంది. తప్పు చేసినట్టు అనిపిస్తే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని కూడా చెబుతుంది. ఈ ఒక్క అవకాశం ఇవ్వాలని జానకి చెప్పడంతో జ్ఞానాంబ అందుకు మౌనంగానే ఒప్పుకుంటుంది.

కొడుకును దూరం పెట్టిన జ్ఞానాంబ

కొడుకును దూరం పెట్టిన జ్ఞానాంబ

ఇక జానకి పెట్టిన కండిషన్ కారణంగా రామచంద్ర కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు. దీంతో జానకి భర్తను చూసి కొంత ఆవేదన చెందుతుంది. నాకు మీరు అత్తయ్య గారు ఇద్దరు ఎప్పుడు ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే జానకి ఎంత చెప్పినా కూడా రామచంద్ర మాత్రం, అమ్మ మనస్సు బాధ పడుతోందని తను కూడా బాధపడుతూ కూర్చుంటాడు. ఇక తల్లితో భోజనం చేయాలని దగ్గరకు వెళ్లగా రామచంద్ర కు చేదు అనుభవం ఎదురవుతుంది.

Recommended Video

Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
లోపల ప్రేమ.. పైకి పంతం

లోపల ప్రేమ.. పైకి పంతం

ప్రతిరోజు తల్లితో కూర్చుని భోజనం చేసే రామచంద్ర ఒక ముద్ద కూడా ప్రేమగా పెట్టించుకుంటాడు. కానీ జ్ఞానాంబ మాత్రం కొడుకు చేసిన మోసం కారణంగా ఇంకా బాధ పడుతూనే ఉంటుంది. రామచంద్ర పక్కన ఉన్నా కూడా ఏమాత్రం లెక్కచేయదు. అనవసరంగా తనను బాధ పెట్టవద్దు అని తన భర్తకు చెబుతుంది. అయితే మనసులో ప్రేమ పెట్టుకొని పైకి పంతాన్ని ఎలా చూపిస్తున్నావు అని గోవింద రాజులు కూడా తన భార్యను ప్రశ్నిస్తాడు. రామ ఆకలి వేస్తుంది అని చెప్పినప్పుడు కూడా జ్ఞానాంబ మొండిగానే ఉంటుంది. తన పంతాన్ని పైకి చూపిస్తుంది. చివరికి జ్ఞానాంబ భోజనం తీసుకొని పక్కకు వెళ్లి పోతుంది.

ఆనందంలో మల్లిక

ఆనందంలో మల్లిక

మరోవైపు జ్ఞానాంబ తీరుతో మల్లిక ఎంతగానో ఆనందపడుతుంది. కోడలిని పురుగుని చూసినట్టు చూస్తోంది అంటూ కొడుకును కూడా పట్టించుకోవడం లేదు అని లోలోపల ఎంతగానో ఆనందపడుతూ. ఆమె ట్యాంక్ మెట్లను ఎక్కుతూ ఆకాశంలో తేలుతున్న ఆనందం కలుగుతోంది అని భర్తను కంగారు పెడుతుంది. భర్త విష్ణు ఎంత చెప్పినా కూడా ఆమె వెనక్కి తగ్గదు. ఇక చివరికి విష్ణు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు.

కొడుకును మరింత బాధపెడుతున్న జ్ఞానంబ

కొడుకును మరింత బాధపెడుతున్న జ్ఞానంబ

ఇక ప్రతిరోజూ తల్లి పడుకునే సమయంలో తల్లికి కాళ్ళు నొక్కి ముచ్చట్లు పెట్టే రామచంద్ర గది దగ్గరకు వస్తాడు. జ్ఞానాంబ కూడా అనుకోకుండా రామ కాళ్ళు నొక్కు అని చెబుతోంది. కానీ మళ్ళీ వెంటనే ఆగిపోతుంది. లోపల ప్రేమ పెట్టుకుని మళ్ళీ మనసు లోనే ఎందుకు దాచుకుంటావు అని భర్త అడిగినప్పటికీ కూడా జ్ఞానాంబ తన పంతాన్ని పైకి చూపిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో రామచంద్ర తల్లి కాళ్ళ దగ్గరకు వస్తాడు. కానీ జ్ఞానాంబ అక్కడి నుంచి అతన్ని వెళ్లిపోవాలని చెబుతుంది.

గుండెల్లో ఉన్న ఆ నొప్పి ఎవరికీ అర్థం కావడం లేదు అని మాటలతో రామచంద్ర ను మరింత బాధ పెడుతుంది. గోవింద రాజులు కూడా రామచంద్రను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెబుతాడు.

అయినప్పటికీ రామచంద్ర తల్లినీ బ్రతిమాలుకుంటూ ఉంటాడు. మరోవైపు మల్లికా మరొక మహిళను జ్ఞానాంబ మీదకు ఉసిగొల్పడానికి పంపిస్తుంది. మరి విష్ణు నిర్ణయంతో జ్ఞానాంబ ఇంకా ఎలా స్పందిస్తుందో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X