Janaki Kalaganaledu October 10th: జెస్సి పనులకు జ్ఞానాంబ హ్యాపీ.. మరోసారి బోల్తా పడిన మల్లిక!

జానకి కలగనలేదు మరో ఆసక్తికరమైన కథనంతో విభిన్నంగా ఆకట్టుకుంటోంది. భర్త రామ సహాయంతో జానకి ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. అత్త జ్ఞానాంబ కూడా జానకి చదువుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇక జనకికి ఇంట్లోనే కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. మరి వాటిని దాటి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోనే ప్రధాన అంశం. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 406 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

 అత్తగారికి దగ్గరవ్వాలి అని..

అత్తగారికి దగ్గరవ్వాలి అని..

జానకి ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు ఇంటి సమస్యలను కూడా చాలా తెలివిగా పరిష్కరిస్తుంది. ఏ మాత్రం పట్టు విడవకుండా కొత్తగా వచ్చిన తోడికోడలికి కూడా ఆమె సహాయం చేస్తుంది. అయితే చిన్న కోడలు జెస్సి ఎలాగైనా అత్తగారికి దగ్గరవ్వాలి అని మంచి కోడలిగా అనిపించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అందుకోసం ఆమె ఇంటి ఆచారాలను పండుగల గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటుంది. అందుకు జానకి సహాయం కూడా కావాలని అంటుంది. ఇక జానకి చదువుకుంటున్న సమయంలోనే జెస్సీ వెళ్లి సహాయం అడుగుతుంది. అప్పటికే జానకి పరీక్షలకు చాలా సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఆమె ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా చదువుకోవాలని అనుకుంటుంది. రామ కూడా ఆమెను డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుంటాడు.

పూజ కోసం జెస్సి ప్రసాదాలు

పూజ కోసం జెస్సి ప్రసాదాలు

అయితే జానకి చదువుకుంటున్న సమయంలో వచ్చిన జెస్సి పండగ విశేషాల గురించి అలాగే అమ్మవారి కోసం చేసే ప్రసాదాల గురించి కూడా ప్రత్యేకంగా అడుగుతుంది. ఇక జానకి కూడా ఆమెకు అన్ని వివరంగా చెబుతోంది. వంట చేసే దగ్గరనుంచి పూజ ఫలహారాలు ఎలా చేయాలో అన్నీ కూడా జానకి వివరిస్తుంది. ఇక ఉదయాన్నే లేచిన జెస్సి పూజ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. ప్రసాదాలన్నిటిని కూడా ఆమె తన చేతితోనే ఎంతో నిష్టగా చేస్తుంది. ఇక జెస్సి ఆ విధంగా వంట చేస్తూ ఉండడంతో దూరం నుంచి అత్త జ్ఞానాంబ కూడా గమనిస్తూ ఉంటుంది.

మల్లిక చెడగొట్టే ప్రయత్నం

మల్లిక చెడగొట్టే ప్రయత్నం

అయితే అప్పుడే వచ్చిన మల్లికా జెస్సి చేసిన పనులు చూసి ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది. కొంపదీసి అత్తగారికి దగ్గరైపోవాలని చూడడం లేదు కదా అని ఆలోచిస్తుంది. అన్ని వంటలు కూడా చకచకా చేస్తూ ఉండడంతో ఆమె ఏ మాత్రం తట్టుకోలేక పోతుంది. అందుకే ఏదో ఒక విధంగా చెడగొట్టి అత్తగారికి కోపం తెప్పించేలా చేయాలని కూడా మల్లిక ఆలోచిస్తుంది. ఈరోజు చేయాల్సిన ప్రసాదాలు ఇవి కాదు అని మరొకటి చేయాలి అని కూడా జెస్సికి మల్లిక చెబుతుంది. ఇక జెస్సీ మాత్రం తడబడకుండా ఈరోజు చేయాల్సిన ప్రసాదాలు ఇవే అంటూ జానకి అక్క ఎంతో క్లారిటీగా చెప్పింది అని కూడా జెస్సి వివరణ ఇవ్వడంతో మల్లి షాక్ అవుతుంది. అయినప్పటికీ కూడా పదేపదే నువ్వు చేస్తుంది మరొక ప్రసాదం ఇది మరొక రోజు చేయాలి అని లేకపోతే అత్తగారికి కోపం వస్తుంది అని కూడా మల్లిక అంటుంది.

గమనించిన జ్ఞానాంబ

గమనించిన జ్ఞానాంబ


ఇక జెస్సి తడుముకోకుండా నవరాత్రుల సమయంలో ప్రతిరోజు చేయాల్సిన పూజ గురించి అలాగే అమ్మవారి అవతారాల గురించి నైవేద్యాల గురించి కూడా ఎంతో వివరంగా చెబుతుంది. ఆ మాటలు విన్న మల్లిక మళ్ళీ ఆశ్చర్యపోతుంది. దూరం నుంచి ఆమెను గమనించిన జ్ఞానాంబ కూడా కాస్త జెస్సి పై సంతృప్తి చెందుతుంది. ఇక అప్పుడే జానకి రామచంద్ర కూడా దూరం నుంచి జెస్సి చేస్తున్న ప్రసాదాల గురించి వింటూ ఉంటారు.

మల్లికకు చివాట్లు

మల్లికకు చివాట్లు

ఇక తర్వాత జెస్సి ఆ విధంగా చెప్పడంతో మల్లికా మరొక అబద్ధం చెప్పాలని అనుకుంటుంది. ఇక అప్పుడే జ్ఞానాంబ కోపంతో ఆమెను పిలుస్తుంది. నువ్వు ఎలాగో నేర్చుకోవు అలాగే నిన్న కాక మొన్న వచ్చిన ఆ అమ్మాయి తనకు వచ్చిన పనిని కరెక్టుగా చేస్తూ ఉంటే చెడగొట్టాలని అనుకుంటావా అని జ్ఞానాంబ అసహనం వ్యక్తం చేస్తుంది. ఇక తర్వాత జెస్సీతో మాట్లాడకపోయినా కూడా జ్ఞానాంబ సంతోషంగానే ఉంటుంది. ఇక తర్వాత జానకికి జెస్సి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతుంది.

అఖిల్ తో మరో ప్లాన్

అఖిల్ తో మరో ప్లాన్

ఇక మరోవైపు జెస్సి ఆలోచనకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలి అని ఆమె అత్తగారికి ఏ మాత్రం దగ్గరవ్వకూడదు అని అందుకు అఖిల్ ద్వారా ప్లాన్ వేయాలని అనుకుంటుంది. అఖిల్ కు కూడా మల్లిక లేని పోనీ మాటలు చెబుతూనే ఉంటుంది. నిన్ను మీ అమ్మకు దూరం చేయాలి అని ని భార్య ఆలోచిస్తుంది అని చెప్పడంతో అఖిల్ కూడా ఎలాగైనా జెస్సి దూకుడుకు తాళం వేయాలని అనుకుంటాడు. మరోవైపు జానకి చదువులో అశ్రద్ధ చేస్తుంది అని ఇంట్లో సమస్యల గురించి ఆలోచించి తన చదువు గురించి పట్టించుకోవడం లేదు అనే రామ కొంత అలకతో ఉంటాడు. అలా ఏమీ లేదు అని ఒకవైపు ఇంటి కోడలిగా నా బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంది అని చదువుకునేందుకు సమయం కూడా కేటాయిస్తాను అని అంటుంది. అదే సమయంలో అత్త జ్ఞానాంబ మిగతా ఇద్దరు కొడళ్ళు కడుపుతో ఉన్నారని కాబట్టి వారికి పాలల్లో కుంకుమ పువ్వు వేసి ఇవ్వాలని అంటుంది. ఇక జానకి తోడికోడళ్ళ విషయంలో ఇంకా బాధ్యత ఉండాలని అనుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X