For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu October 11th: జ్ఞానాంబ భయం వెనుక దారుణమైన ఫ్లాష్ బ్యాక్.. జానకి చదువుకు బ్రేక్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. రీసెంట్ గా వచ్చిన సీరియల్స్ లలో టెలివిజన్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సీరియల్స్ లో టాప్ రేటింగ్స్ అందుకుంటోంది. 38వ వారంలో అర్బన్ ప్రాంతంలో 7.56 రేటింగ్ సాధిస్తే.. 39వ వారంలో 8.26 రేటింగ్ నమోదు చేసింది. ఇక రూరల్ లో 38వ వారంలో 8.07 రేటింగ్ నమోదు చేస్తే.. 39వ వారంలో 8.73 రేటింగ్ సాధించింది. మొత్తానికి జానకి కలగనలేదు సీరియల్ అయితే అసలు కథలోకి వచ్చేసింది. చదువుకున్న కోడలు వస్తే కొడుకుతో సరిగ్గా కాపురం చేయదని ఆ తరువాత అతని జీవితం దుర్భరంగా మారుతుందని జ్ఞానాంబ అనుమానంతో ఉంటుంది. ఇక ఆ భయంకరమైన అనుమానం వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. ఇటీవల రామచంద్ర ఆ విషయాన్ని తన భార్య జానకికి తెలియజేశాడు. ఇక జానకి అబద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందననే పాయింట్ కు మొత్తానికి ముగింపు కార్డ్ పడింది. ఇక ఇప్పటి నుంచి మరొక ఆసక్తికరమైన అంశంతో సీరియల్ కొనసాగనుంది. నేడు ప్రసారం కాబోయే 146వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

   కళాశాలలో జానకి ఫొటో

  కళాశాలలో జానకి ఫొటో

  జ్ఞానాంబకు చదువుకున్న అమ్మాయిలు అంటే ఎంతగానో ఇష్టపడుతుంది. పేద విద్యార్థులకు కూడా ఆమె సహాయం చేస్తుంది. ఇటీవల ఇంటర్మీడియట్ లో టాప్ రాంక్స్ అందుకున్నటువంటి పేద విద్యార్థులకు ఆమె ఆర్థికంగా సహాయం చేసేందుకు కూడా ముందుకు వస్తుంది. అయితే అనుకోకుండా ఆమె జానకి చదువుకున్న కళాశాలకు వెళ్లడంతో అక్కడ జానకి ఫోటో కూడా కనిపిస్తుంది. జనాకికి అక్కడ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని తెలుసుకుంటుంది.

   మరో చిచ్చు పెట్టిన మల్లిక

  మరో చిచ్చు పెట్టిన మల్లిక

  జానకి కుటుంబ సభ్యులు కేవలం 5 వ తరగతి వరకు చదువుకున్నట్లు చెప్పి పెళ్లి చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్న జ్ఞానాంబ కొంత ఆశ్చర్యానికి లోనవుతుంది. తనతో ఎందుకు అబద్దం చెప్పారు అని ఆలోచనలో పడుతుంది. చదువుకోలేని కొడుకుకి చదువుకోలేని అమ్మాయిని తీసుకురావాలని అనుకున్న జ్ఞానాంబ ఆ విషయం తెలియడంతో కొంత భయానికి లోనవుతుంది. అలానే ఆలోచించుకుంటూ ఆమె వారి పొలం దగ్గరికి వెళుతుంది. అదే సమయంలో చిన్న కోడలు మల్లిక జానకికి సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్లను తెచ్చి చూపిస్తుంది. అంతేకాకుండా జానకి పై కోపం తెప్పించడానికి ఇదే సరైన సమయం అని ఆమె లేనివి కూడా కల్పించి చెబుతుంది

  గతంలో జరిగిన అన్యాయం

  గతంలో జరిగిన అన్యాయం

  జానకి మిమ్మల్ని మొదటి నుంచి కూడా ఎంతగానో మోసం చేస్తుంది నేను అదే విషయం మీకు ఎన్నో సార్లు చెప్పాలి అని అనుకున్నాను కానీ నా బ్యాడ్ లక్ వలన అందరూ నాదే తప్పు అని చెప్పడం మొదలు పెట్టారు నేను కేవలం మిమ్మల్ని మోసం చేయకుండా ఉండాలని చెప్పాను.. అలాగే బావగారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి నిజం చెప్పాలని అనుకున్నాను. ఎందుకంటే గతంలో మీ తమ్ముడికి జరిగిన అన్యాయం బావగారికి కూడా జరగవచ్చు అని అనిపిస్తోంది అని మల్లిక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.

   పుట్టినరోజు సందర్భంగా..

  పుట్టినరోజు సందర్భంగా..

  ఇక మరోవైపు పుట్టినరోజు వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని జానకి తన భర్తతో కలిసి ఒక ప్రత్యేకమైన హోటల్ కి వెళుతుంది. గతంలో చాలా సార్లు కాలేజీ లో చదువుకునేటప్పుడు తన స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చే దాన్ని అంటూ ఇప్పుడు మీతో రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను అని చెబుతుంది. ఇక ఆ తర్వాత మీ లాంటి భర్త నాకు దొరకడం నా అదృష్టం అని జానకి చెప్పడంతో రామచంద్ర కూడా ఎంతో సంతోషానికి లోనవుతాడు.

   జానకి అన్నయ్యతో ఫోన్ కాల్

  జానకి అన్నయ్యతో ఫోన్ కాల్

  ఇక జానకి మరో సర్ ప్రైజ్ ఇవ్వాలని రామచంద్ర వారి పొలానికి తీసుకువెళతాడు. వెంటనే అమెరికాలో ఉన్న జానకి అన్నయ్యకు ఫోన్ చేసి మాట్లాడుతాడు. మీ చెల్లి తో ఏదో చెప్పాలని అన్నారు కదా ఇదిగో మాట్లాడండి అంటూ అనగానే జానకి కూడా ఎంతగానో సంతోషిస్తుంది. నీ చదువు విషయంపై మీ అత్తగారికి అబద్ధం చెప్పి పెళ్లికి ఒప్పించాను.. కానీ నిజం తెలిసినా కూడా నీ భర్త నీకు ఎంతగానో అండగా ఉన్నారు నిజంగా ఆయన ఒక దేవుడు అని జానకి అన్నయ్య భావోద్వేగానికి లోన వున్నాడు.

  జ్ఞానాంబ జీవితంలో విషాద ఘటన

  జ్ఞానాంబ జీవితంలో విషాద ఘటన

  అయితే జానకి అన్నయ్య తో మాట్లాడిన తర్వాత జానకి భర్తను ఒక విషయాన్ని కూడా అడుగుతుంది. ఎంతోమంది పేద విద్యార్థులకు చదువుకోవడానికి సహాయం చేసే అత్తయ్య గారు కోడలు మాత్రం ఎందుకు చదువుకోకుండా ఉండాలి అనే ఆలోచన తో ఉంటుంది అని అడుగుతుంది. అందుకు రామచంద్ర తల్లి కి సంబంధించిన ఒక విషాదకరమైన సంఘటన గురించి చెబుతాడు. పెద్దగా చదువుకోలేని మా మామయ్య కూడా ఒక చదువుకున్న అమ్మాయి ని పెళ్లి చేసుకోవడంతో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అమ్మాయి సరిగా కాపురం చేయకపోవడంతో మా అమ్మ తమ్ముడు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న విషయాన్ని జానకితో చెబుతాడు.

  Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
  జానకి ఇంట్లో ఉండడానికి వీల్లేదు

  జానకి ఇంట్లో ఉండడానికి వీల్లేదు

  ఆ ఘటన కారణంగా చదువుకున్న అమ్మాయిలను చదువుకోలేని కొడుకులకు భార్యగా తీసుకురావద్దు అని నిర్ణయం తీసుకుంది అంటూ రామచంద్ర చెబుతాడు. ఇక ఆ తర్వాత జానకి రామచంద్ర ఇంటికి వెళ్లగానే జ్ఞానాంబ ఒక్కసారిగా జానకి సంబంధించిన పెట్టెను తీసి గుమ్మం ముందు పడేస్తుంది. తను ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ గట్టిగా చెప్పడంతో రామచంద్ర షాక్ అవుతాడు. మరి ఆ విషయంలో రామచంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 146
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X