Janaki Kalaganaledu October 11th: జెస్సి గుండె పగిలేలా అఖిల్ ప్రవర్తన.. మల్లికలో మరింత ఆవేశం!

జానకి కలగనలేదు సీరియల్ మొదట్లో నీరసంగా అనిపించినప్పటికి ఇప్పుడు మాత్రం విభిన్నంగా ఆకట్టుకుంటోంది. భర్త రామ సహాయంతో జానకి ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. అత్త జ్ఞానాంబ కూడా ఆమెను చదువుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇక జనకికి ఇంట్లోనే కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి.

మరి వాటిని దాటి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోనే ప్రధాన అంశం. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 407 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

జానకికి బాధ్యత

జానకికి బాధ్యత

జానకి ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు ఇంటి బాధ్యతలను కూడా ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తుంది. అత్త జ్ఞానాంబ చెప్పినట్టుగానే చదువును పూర్తి చేస్తూనే కోడలిగా నీ బాధ్యతను కూడా నిర్వర్తించాలి అనే మాటలను జానకి గుర్తుపెట్టుకుంటుంది.

ఇక ఇంట్లో చిన్న కోడలు జెస్సికి అలాగే రెండవ కోడలు మల్లికా ఇద్దరు కూడా కడుపుతో ఉన్నారు అని వారికి కుంకుమ పువ్వుతో కలిపిన పాలను ఇస్తే బాగుంటుంది అని.. ప్రతీ రోజు పాలు తాగించే బాధ్యత నీదే అనే జ్ఞానాంబ చెబుతుంది. దీంతో జానకి కూడా ఏ మాత్రం నిరుత్సాహం చెందకుండా దాన్ని బాధ్యతగా తీసుకుని ఆ పనిని నిర్వర్తించాలని అనుకుంటుంది.

నీలావతితో మల్లిక ఫోన్ కాల్

నీలావతితో మల్లిక ఫోన్ కాల్

ఇక మొదట జానకి, జెస్సి కి ఆ పాలను అందిస్తుంది. నువ్వు ఈ సమయంలో ఈ పాలను తాగితే పుట్టబోయే బిడ్డకు చాలా ఆరోగ్యమని కూడా జానకి ఆమెకు చెబుతుంది. ఇక అందుకు జెస్సి కూడా సంతోషిస్తుంది. అంతేకాకుండా అత్తగారికి నీ మీద కోపం పోతుంది అని ఈ కుంకుమపువ్వు ప్రత్యేకంగా ఆమెనే నీకు ఇవ్వాలి అని చెప్పినట్లుగా జానకి చెబుతుంది. దీంతో జెస్సి మరింత సంతోషపడుతుంది.

అలాగే మల్లిక కూడా ఆ పాలు ఇవ్వాలి అని జానకి అనుకుంటుంది. అయితే మల్లిక, నీలావతి తో ఫోన్లో మాట్లాడుతూ మన ప్లాన్ ఫెయిల్ అయింది అని ఇంట్లో గొడవలు సృష్టించేందుకు మరొక ప్లాన్ వేయబోతున్నట్లు మాట్లాడుతుంది. ఇక అప్పుడే జానకి వెనకాల నుంచి వస్తుంది. దీంతో మల్లిక ఆమె నేను మాట్లాడిన మాటలు వినలేదేమో అని అనుకుంటుంది కానీ జానకి మాత్రం ఫోన్లో మాట్లాడకూడదు అని పుట్టబోయే బిడ్డకు రేడియేషన్ మంచిది కాదు అని సలహా ఇస్తుంది.

జెస్సిని బాధపెట్టిన అఖిల్

జెస్సిని బాధపెట్టిన అఖిల్

అంతేకాకుండా నువ్వు జెస్సీ విషయంలో వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన విషయం నాకు తెలుసు మరోసారి అలా చేయకు అని హెచ్చరిస్తుంది. ఇక మల్లిక జానకి మాటలకు మరింత ఆగ్రహం తెచ్చుకుంటుంది. ఎలాగైనా ఆమె సంతోషాన్ని చెడగొట్టాలని అనుకుంటుంది. మరోవైపు అఖిల్ జెస్సి పై మరింత ఆగ్రహాన్ని చూపిస్తాడు.

జెస్సీ పాల గ్లాసుతో గదిలోకి వస్తూ ఉండగా చాలా సంతోషంగా కనిపించడంతో అఖిల్ మల్లిక చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నీ తల్లినీ నీకు దూరం చేసేందుకు జెస్సీ ప్రయత్నం చేస్తుంది. అని మల్లిక చెప్పిన మాటలను నమ్మిన అఖిల్ ఇప్పుడు మరింత ఆగ్రహంతో ఉంటాడు. అంతేకాకుండా ఆమె చేతిలో ఉన్న పాల గ్లాసును కూడా కింద పడేస్తాడు. అప్పుడు జానకి కూడా ఆ సంఘటనను చూస్తుంది. అఖిల్ తో మాట్లాడాలని అనుకున్నప్పటికీ అతను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు.

ధైర్యం చెప్పిన జానకి

ధైర్యం చెప్పిన జానకి

ఇక జెస్సి బాధపడుతూ ఉండగా ఆమెకు జానకి ధైర్యం చెబుతుంది. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని అంటుంది. ఇక మరోవైపు మల్లికా ఎలాగైనా ఇంట్లో సంతోషం లేకుండా చేయాలి అని జానకి చదువుకు కూడా ఆటంకం కలిగించాలని అనుకుంటుంది.

ఈ ఇంట్లో నాకంటే నీకు అందరు ఎక్కువ మర్యాద ఇవ్వడం నాకు ఏమాత్రం నచ్చడం లేదు అని తనలో తానే అనుకున్న మల్లికా మరొక ప్లాన్ తో ఇంట్లో ఎవరికీ సంతోషం లేకుండా చేయాలని కూడా ఆలోచిస్తుంది. ఇక అప్పుడే ఆమె భర్త విష్ణు గురక పెట్టి నిద్రపోతూ ఉండడంతో చెంపపై కొడుతుంది సైలెంట్ గా పడుకోవాలి అని హెచ్చరిస్తుంది.

రామచంద్ర అసహనం

రామచంద్ర అసహనం

ఇక ఆ తర్వాత జానకి విషయంలో రామచంద్ర సంతృప్తితో ఉంటాడు. మీరు చదువుకోవాలి అని సమయాన్ని వృధా చేయకూడదు అని నేను చెప్పినప్పటికీ పట్టించుకోవడంలేదని అనవసరంగా ఇంట్లో బాధ్యతలను నెత్తిన పెట్టుకుంటున్నారు అని రామా అసహనం వ్యక్తం చేస్తాడు. కానీ జానకి మాత్రం రెండు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తేనే బాగుంటుంది అని వివరణ ఇస్తుంది.

అలాగే అఖిల్ జెస్సీ మధ్యలో జరిగిన గొడవ గురించి కూడా చెబుతుంది. మనం కష్టపడి వారికి పెళ్లి చేసింది సంతోషంగా ఉండాలి అని ఇప్పుడు వారు అలా ఉంటే పట్టించుకోకుండా ఉండకపోవడం ఏమాత్రం మంచిది కాదు అని జానకి అర్థమయ్యేలా చెబుతుంది. అందుకు రామచంద్ర కూడా సరే అని ఇప్పుడు అయితే మీరు చదువుకోండి అని అంటాడు. మరి రాబోయే రోజుల్లో మల్లికా ఇంట్లో ఎలాంటి అలజడులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X