Janaki Kalaganaledu October 12th: కొడుకు ప్రాణాల కోసం జ్ఞానాంబ కఠిన నిర్ణయం.. జానకి అవుట్!

జానకి కలగనలేదు ప్రస్తుతం ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సీరియల్ గా టాప్ రేటింగ్స్ అందుకుంటోంది. గత నెలలో కంటే ఈసారి రేటింగ్స్ సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. 38వ వారంలో అర్బన్ ప్రాంతంలో 7.56 రేటింగ్ అందుకున్న ఈ సీరియల్.. 39వ వారంలో 8.26 రేటింగ్ నమోదు చేసింది. ఇక రూరల్ లో మాత్రం 38వ వారంలో 8.07 రేటింగ్ రాగా 39వ వారంలో 8.73 రేటింగ్ సాధించింది. ఫైనల్ గా జానకి కలగనలేదు సీరియల్ లోని అసలు ట్విస్ట్ తో సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. చదువుకున్న కోడలు వస్తే కొడుకుతో సరిగ్గా కాపురం చేయదని ఆ తరువాత అతని ప్రాణాలకు కూడా హాని కలిగే అవకాశం ఉంటుందని ఒక అనుమానం భయంతో కొట్టు మిట్టాడుతూ ఉంటుంది. ఆ భయం వెనుక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. ఇటీవల రామచంద్ర ఆ విషయాన్ని తన భార్య జానకికి తెలియజేశాడు. ఇక జానకి అబద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందననే పాయింట్ కు మొత్తానికి ముగింపు కార్డ్ పడింది. ఇక ఇప్పటి నుంచి మరొక ఆసక్తికరమైన అంశంతో సీరియల్ కొనసాగనుంది. నేడు ప్రసారం కాబోయే 147వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

చదువుకున్న అమ్మాయి కోడలిగా వస్తే..

చదువుకున్న అమ్మాయి కోడలిగా వస్తే..

చదువుకున్న అమ్మాయి కోడలిగా వస్తే చాలా ప్రమాదం పొంచి ఉంటుంది అని జ్ఞానాంబ ఎంతగానో భయపడుతుంది. గతంలో తన తమ్ముడికి జరిగిన అన్యాయం మళ్ళీ తన కొడుకు కూడా జరిగే అవకాశం ఉంటుంది అని అనుమానంతో జానకి విషయంలో చాలా కఠినంగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుంది. దానికితోడు చిన్నకోడలు కూడా అత్త కోపానికి మరింత అగ్గి రాజేసింది. దీంతో జానకి కలగనలేదు సీరియల్ మరొక కీలక మలుపు తిరిగపోతున్నట్లు తెలుస్తోంది.

 జానకి మదిలో సందేహం

జానకి మదిలో సందేహం

జానకి పుట్టినరోజు సందర్భంగా తన భర్తరామచంద్రతో కలిసి బయటకు వెళుతుంది. ఇంట్లో అత్తమామల ఆశీర్వాదం తీసుకొని సరదాగా గడుపుతూ ఉంటారు. అంతేకాకుండా జానకి తన భర్తను ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకు వెళుతుంది. తనకు ఎంతో ఇష్టమైన హోటల్లో ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. ఆ తర్వాత రామచంద్ర వారి తోటకి తీసుకువెళ్లి తన తల్లి వెనుక ఉన్న ఒక విషాద విషయాన్ని చెబుతాడు. చదువుకున్న అమ్మాయిలకు ఎంతగానో సహాయ పడే అత్తయ్యగారు చదువుకున్న కోడలు మాత్రం వద్దని ఎందుకు అనుకుంటున్నారు అనే సందేహం తలెత్తుతుంది.

జ్ఞానాంబ భయం వెనుక విషాదం

జ్ఞానాంబ భయం వెనుక విషాదం

అయితే గతంలో మా అమ్మ తమ్ముడు ఒక చదువుకున్న అమ్మాయి ని పెళ్లి చేసుకోవడంతో అతని జీవితమే మారిపోయింది. మామయ్యకు ఎక్కువ చదువుకోకపోవడం తో అత్తయ్య సరిగ్గా కాపురం చేయలేక పోయింది. వేరే వాళ్ళతో వెళ్లిపోవడంతో అతను ఆ అవమానాన్ని తట్టుకోలేక నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషాదం తోనే అమ్మ మా అన్నదమ్ములిద్దరికి కూడా చదువుకోని అమ్మాయిలను తీసుకురావాలని అనుకుంది. దీంతో ఆ విషయంలో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అబద్ధం చెప్పాను అని తెలిస్తే తప్పకుండా నన్ను ఇంట్లో నుంచి పంపిస్తారని అనుకుంటుంది. అందుకు రామచంద్ర ఎట్టిపరిస్థితిలోనూ మీ చేయి విడువను అని మరోసారి భరోసా ఇస్తాడు.

మోసం చేశారు

మోసం చేశారు

ఇక జానకి రామ చంద్ర ఇంటికి రాగానే జ్ఞానాంబ జానకికి సంబంధించిన పెట్టెను బయటపడేస్తుంది. జానకి ఇంట్లోకి రావడానికి ఏమాత్రం వీల్లేదని.. ఇక ఇంటితో తనకు సంబంధం తెగిపోయింది అని కూడా చెబుతుంది. ఇక ఎందుకు అని రామచంద్ర తండ్రి గోవిందరాజులు ప్రశ్నించగా అందుకు జ్ఞానాంబ, జానకి డిగ్రీ సర్టిఫికెట్ లను చూపిస్తుంది. జానకి చదివింది 5వ తరగతి మాత్రమే కాదు అంటూ తను డిగ్రీ చదివి మనల్ని మోసం చేశారు అని ఆవేదన చెందుతుంది. మళ్ళీ తన తమ్ముడికి జరిగిన అన్యాయం నా కొడుకు విషయంలో జరగడానికి వీల్లేదని అంటుంది.

మరోసారి మల్లిక ఆగ్రహం

మరోసారి మల్లిక ఆగ్రహం

అయితే గోవిందరాజులు ఆ విషయంలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని మరొకసారి జానకికి మద్దతు పలికేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇక మరోవైపు చిన్న కోడలు మల్లిక తన ఆవేశాన్ని చూపిస్తుంది. నేను తప్పు చేస్తే ఇంట్లో నుంచి బయటకు నెట్టి వేస్తారు.. అలాంటిది పెద్ద కోడలు ఇంత పెద్ద అబద్ధం దాచినా కూడా పట్టించుకోకపోతే నన్ను తక్కువగా చూసినట్లు అని ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా మల్లిక జానకిని అక్కడ నుంచి వీలైనంత త్వరగా పంపించాలని అనుకుంటుంది.

Recommended Video

SSMB 28 : Mahesh Babu, Trivikram నుంచి 11 ఏళ్ల తర్వాత.. హీరోయిన్ ఆమెనా? || Filmibeat Telugu
కొడుకు ప్రాణాల కోసం జ్ఞానాంబ ఆరాటం

కొడుకు ప్రాణాల కోసం జ్ఞానాంబ ఆరాటం

జానకి అత్తగారిని బ్రతిమాలుతూ ఉన్నప్పటికీ మల్లిక మధ్యలోకి వచ్చి నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ సమయంలో జానకి కింద పడి పోతూ ఉంటే రామచంద్ర చేయి పట్టుకుంటాడు. ఆ తర్వాత కూడా మరోవైపు రామచంద్ర చేయిని జ్ఞానాంబ పట్టుకొని ఉంటుంది. ఇక జ్ఞానాంబ చివరికి కొడుకు ప్రాణాలను పణంగా పెట్టలేను అంటూ ఇంట్లోకి తీసుకువెళుతుంది. మల్లిక జానకి బయట ఉండగానే గుమ్మం తలుపులు వేస్తుంది. కోడలు ఇంట్లో నుంచి పంపించేసినప్పటికీ జ్ఞానాంబ ఎంతగానో బాధ పడుతుంది. తన తమ్ముడి తరహాలోనే కొడుకు ప్రాణాలు కోల్పోవడం నేను తట్టుకోలేను అని బాధపడుతుంది. మరి జానకి విషయంలో భరోసా ఇచ్చినటువంటి రామచంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X