For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu October 12th: తాగొచ్చి అందరికి షాక్ ఇచ్చిన అఖిల్.. జానకి మోసం అంటూ ట్విస్ట్

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన ఆంశంతో కొనసాగుతోంది. భర్త రామ సహాయంతో జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. అందుకు అత్త జ్ఞానాంబ ఒప్పుకుంటుంది. ఇక జనకికి ఇంట్లోనే కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. మరి వాటిని దాటి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోనే ప్రధాన అంశం. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 408 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  ఎలాంటి పరిస్థితి ఎదురైనా

  ఎలాంటి పరిస్థితి ఎదురైనా

  అసలైన ఐపీఎస్ పరీక్షలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో జానకి ఏమాత్రం సమయం వృధా చేయకుండా చదువుకోవాలని అనుకుంటుంది. అలాగే రామచంద్ర కూడా ఆమెకు ఎంతో సహాయంగా ఉంటాడు. ఇంట్లో పరిస్థితులు పట్టించుకోకుండా మీరు పూర్తిగా చదువుపై శ్రద్ధ పెట్టాలని కూడా అతను సలహా ఇస్తాడు. కానీ జానకి మాత్రం ఒక వైపు కోడలిగా తన బాధ్యతను కొనసాగిస్తూనే మరొకవైపు చదువును కూడా కొనసాగిస్తుంది. ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా జానకి ముందుండి వాటిని పరిష్కరిస్తుంది. అవసరమైతే కొన్ని పనులను కూడా ఆమె పూర్తి చేస్తుంది. ఇక రామచంద్ర మాత్రం అదేమీ పట్టించుకోవద్దని పదేపదే చెబుతూ ఉంటాడు. ఇక జానకి చదువుకుంటూ ఉంటే మరోవైపు మల్లిక మాత్రం ఆమెను ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని అనుకుంటూ ఉంటుంది.

  మల్లిక ఎత్తులు

  మల్లిక ఎత్తులు

  జానకిని చదువుకోకుండా చేయాలి అని మల్లిక వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే జానకి తన దృష్టి తప్పకుండా చదువు పైనే ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఇక మల్లిక లాభం లేదు అనుకొని జానకి ముందుకు వచ్చి అయ్యో నాకు కాలు నొప్పి ఉంది అంటూ గట్టిగా అరుస్తుంది. ఏదో దెబ్బ తగిలింది అని అక్కడే కూర్చుండిపోతుంది. దీంతో జానకి హఠాత్తుగా లేచి హాస్పిటల్ కి వెళదామని అంటుంది. అయితే మల్లిక మాత్రం మళ్లీ హాస్పిటల్ కి వెళితే తన ప్రెగ్నెన్సీ నాటకం బయటపడుతుంది అని మెల్లగా మళ్లీ ఎలాంటి నొప్పి లేదు అని అంటుంది.

  జానకి కౌంటర్

  జానకి కౌంటర్

  ఇక తర్వాత ఏదైనా కొబ్బరి నూనె రాస్తాను అంటూ జానకి లోపలికి వెళుతూ ఉండడంతో పనిమనిషి చికిత్త అదంతా నాటకం అని జానకికి చెబుతుంది. దీంతో జానకి ఆ తర్వాత ఒక గుండు సూది తీసుకువచ్చి దీనితో గుచ్చితే మొత్తం తగ్గిపోతుంది అని ఇది ఒక విభిన్నమైన ట్రీట్మెంట్ అని చెబుతోంది. దీంతో మల్లిక దెబ్బకు లేచి నిలబడుతుంది. ఇప్పుడు నొప్పి లేదు అని తగ్గిపోయింది అని అంటుంది. ఇక జానకి ఇలా ఎందుకు చేస్తున్నావ్ మల్లిక అంటూ డిస్టర్బ్ చేయాలని అనుకోవద్దు అని అంటుంది. ఇక తర్వాత మల్లిక సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతుంది. జానకి చదువును ఎలా డిస్టర్బ్ చేయాలా అని మల్లిక మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది.

   తాగేసి వచ్చిన అఖిల్

  తాగేసి వచ్చిన అఖిల్

  ఇక అప్పుడే అఖిల్ ఫుల్లుగా తాగేసి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అదే విషయాన్ని మల్లిక ఇంట్లో అందరికీ చెబుతుంది. ఇక అఖిల్ రాగానే తల్లి జ్ఞానాంబ ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది. ఎందుకు తాగావురా అంటూ అడుగుతుంది. నేను తాగలేదు అంటూ అఖిల్ చెబుతాడు. తల్లి జ్ఞానాంబ అఖిల్ పైన చేయి చేసుకుంటుంది. ఆ తర్వాత జెస్సి అఖిల్ ను లోపటికి తీసుకువెళ్లి స్నానం చేయించి అడుగుతుంది. ఎందుకు తాగేసి వచ్చి అందరిని బాధపడుతున్నావు అని అడుగుతుంది. నీ కారణంగానే అంటూ అఖిల్ సీరియస్ అవుతాడు. పెళ్లి చేసుకొని రావడం వలన నాకు ఇంట్లో విలువ లేకుండా పోయింది. మా అమ్మకు నువ్వు దగ్గరవుతూ నన్ను దూరం చేస్తున్నావు అని అఖిల్ అంటాడు.

  జానకి అఖిల్ సీరియస్

  జానకి అఖిల్ సీరియస్


  ఇక తర్వాత జానకి వచ్చి జెస్సి తప్పు లేకపోయినా ఎందుకు అంటున్నావు అని అడుగుతుంది. ఇక ఆ పక్కనే ఉన్న మల్లిక ఒకవైపు జానకిని సపోర్ట్ చేస్తూనే మరొకవైపు అఖిల్ కు కోపం వచ్చేలా చేస్తుంది. దీంతో అఖిల్, జానకి పై మరింత అసహనం వ్యక్తం చేస్తాడు. నువ్వు నీ ఐపిఎస్ చదువు కోసం మా అన్నయ్యను అలాగే అమ్మను మోసం చేశావు. అదేమీ పెద్ద తప్పు కాదు. కానీ నేను చేసింది మాత్రం పెద్ద తప్పు అని అందరి ముందు దోషుల నిలబెట్టారు అని మరింత ఘాటుగా మాట్లాడుతాడు. దీంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అఖిల్ మాటలకు జానకి కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జానకి బాధపడుతూ ఉండడంతో మల్లికా మళ్ళీ సంతోషపడుతుంది. ఈ దెబ్బతో జానికి ఆలోచన మారిపోతుంది అని ఆమె చదువుపై దృష్టి పెట్టదు అని సంతోషపడుతుంది. మరి అఖిల్ మాటలకు రామచంద్ర అలాగే ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial October 12th Episode 408
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X