For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu October 13th: రామచంద్ర మాటలకు మల్లిక రచ్చ.. అఖిల్ కారణంగా ఇబ్బందులు

  |

  జానకి కలగనలేదు సీరియల్ కథ ఆసక్తిగా కొనసాగుతోంది. రామ సహాయంతో జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. అందుకు అత్త జ్ఞానాంబ ఒప్పుకుంటుంది. ఇక జనకికి ఇంట్లోనే కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. మరి వాటిని దాటి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోనే ప్రధాన అంశం. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 409 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  అఖిల్ గొడవ

  అఖిల్ గొడవ

  ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా జానకి తన చదువుపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. అలాగని ఇంట్లో పరిస్థితులను కూడా ఏమాత్రం పక్కనపెట్టదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా కోడలిగా తన బాధ్యతను నిర్వర్తిస్తుంది. అయితే ఈ క్రమంలో అఖిల్ ఒకరోజు ఫుల్లుగా తాగేసి ఇంటికి వస్తాడు. అతను తన భార్యను కూడా నిందిస్తాడు.

  నీ కారణంగానే మీ ఇంట్లో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని మా అమ్మ కూడా నాతో మాట్లాడడం లేదు అని జెస్సిపై ఎంతగానో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడే వచ్చిన జానకి ఎందుకు అనవసరంగా జెస్సిని తిడుతున్నావు అని అడుగుతుంది. దీంతో అదే సమయంలో వచ్చిన మల్లికా కూడా ఎలాగైనా ఈ సమయంలో జానకిపై అఖిల్ కోప్పడేలా చేయాలి అని అనుకుంటుంది.

  అఖిల్ మాటలకు బాధలో

  అఖిల్ మాటలకు బాధలో

  ఇంకా అందుకు ఆమె ఒకవైపు జానకిని సపోర్ట్ చేస్తూనే మరొకవైపు అఖిల్ ను రెచ్చగొడుతుంది. అఖిల్ కూడా ఒక్కసారిగా జానకి పై ఆగ్రహంతో ఊగిపోతాడు. ఇంతకు ముందు నువ్వు కూడా తప్పు చేశావు వదినా అంటూ గతాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు.

  నువ్వు నీ ఐపీఎస్ డ్రీం కోసం ఇంట్లో అమ్మను మోసం చేశావు అలాగే మా అన్నయ్యను ఆసరాగా చేసుకొని నీ అవసరానికి వాడుకున్నావు అని అఖిల్ తప్పుగా మాట్లాడడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత జానకి సైలెంట్ గా మళ్లీ తన గదిలోకి వచ్చి చదువుకోవాలని అనుకుంటుంది. అయినాప్పటికీ కూడా ఆమె అఖిల్ మాటలను గుర్తుకు రావడంతో బాధపడుతుంది.

   నిజం తెలుసుకున్న రామ

  నిజం తెలుసుకున్న రామ

  జానకి అలాగే మంచం దగ్గర నిద్రపోతూ ఉండడంతో రామచంద్ర వస్తాడు. నిద్రలేపి చదువుకోకుండా పడుకున్నారు ఏమిటి అని అడుగుతాడు. ఇక ఆమె ఆరోగ్యం బాగోలేదు అని చెప్పడంతో వెంటనే మంచినీళ్లు తీసుకువస్తాడు.

  అలాగే కాఫీ కూడా పెడతాను అని వంట గదిలోకి వెళ్తాడు. ఇక అప్పుడే పని మనిషి చికిత్త వచ్చి ఇంట్లో జరిగిన విషయాల గురించి చెబుతుంది. అంతే కాకుండా దీనికి కారణం మల్లిక గారు అని కూడా చెప్పడంతో రామచంద్ర వెంటనే ఆమెతో మాట్లాడడానికి వెళ్తాడు. ఇక మల్లికకు మంచి బుద్ధి చెప్పాలి అని రామచంద్రా ఆలోచిస్తాడు.

  కోపాన్ని పెంచుకున్న మల్లిక

  కోపాన్ని పెంచుకున్న మల్లిక

  నువ్వు ఎలా ఉన్నా కూడా జానకి గారు ఎప్పుడు నిన్ను సొంత చెల్లెలి లాగే చూసారు. ఎన్నోసార్లు అమ్మ కోప్పడకూడదు అని ఎన్నో సమస్యల నుంచి నిన్ను కాపాడారు. అయినప్పటికీ నువ్వు ఆమె చదువుకు భంగం కలిగించాలని అనుకుంటున్నాను.

  ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని ఇలా మరోసారి ఇలా జరగకూడదు అని అంతేకాకుండా జానకి తన తల్లిదండ్రుల కోరుకున్నట్లుగానే కల కోసం తాపత్రయపడుతుంది అని చెబుతాడు. ఇక ఆ మాటలకు మల్లికా ఏమాత్రం కరగకుండా మరింత కోపాన్ని పెంచుకుంటుంది. అంతే కాకుండా అందరిని పిలిచి గొడవ చేయాలని అనుకుంటుంది.

  మల్లిక ప్లాన్ ఫెయిల్

  మల్లిక ప్లాన్ ఫెయిల్

  మీరు జానకి కారణంగానే నన్ను ఇక్కడికి నిలదీయడానికి వచ్చారు కదా అని హాల్లోకి వచ్చిన మల్లిక.. జానకి అంటూ గట్టిగా అరుస్తుంది. అలా ఎందుకు అరుస్తున్నావు అంటూ అత్త జ్ఞానాంబ మామ గోవిందరాజులు అడుగుతారు. ఇక జానకి అసలు విషయం బయట పడకూడదు అని అప్పుడు తెలివిగా జ్యూస్ కావాలని మల్లిక అడుగుతోంది అని అబద్ధం చెబుతుంది.

  ఇక అసలు విషయం మల్లిక చెప్పుదాము అనుకునే లోపే జ్ఞానాంబ అలాగే గోవిందరాజులు ఇద్దరు కూడా జానకి చదువుకుంటుంది కదా ఆమెను డిస్టర్బ్ చేయకు ఏదైనా అవసరం ఉంటే పనిమనిషిని అడుగు అని చెబుతారు.

  భర్తను రెచ్చగొడుతున్న మల్లిక

  భర్తను రెచ్చగొడుతున్న మల్లిక

  ఇక మల్లిక ఆ విషయం చెప్పాలనుకునే లోపు అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇక తర్వాత తన గదిలోకి వచ్చిన మల్లిక తన భర్తకు జరిగిన విషయం గురించి చెబుతుంది. ఎలాగైనా ఇప్పుడే వెళ్లి మీరు మీ అన్నయ్య గారిని నిలదీయండి అని అంటుంది. కానీ అన్నయ్య కారణం లేకుండా ఏమీ అనడు అని అతను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ మల్లిక అందుకు ససిమేరా అంటుంది.

  అఖిల్ గురించి ఆలోచనలో జ్ఞానాంబ

  అఖిల్ గురించి ఆలోచనలో జ్ఞానాంబ

  తర్వాత జ్ఞానాంబ గోవిందరాజులు హాల్లో ఉండి అఖిల్ విషయం గురించి బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన జానకి రామచంద్ర అఖిల్ ఇలా కావడానికి మీరు మాట్లాడకపోవడమే కారణం అని జ్ఞానాంబకు చెబుతారు. నువ్వు ఉంటే వాడికి ఎంతో ఇష్టం కదమ్మా అందుకే వాడు నువ్వు మాట్లాడకపోతే అయితే ఇలా అయ్యాడు అనిపిస్తుంది అని రామా చెప్పడంతో జ్ఞానాంబ ఆలోచనలో పడుతుంది. మరి కొడుకు మీద ఉన్న కోపాన్ని జ్ఞానాంబ కూడా తగ్గించుకుంటుందో లేదో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 409
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X