For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu October 17th: జెస్సి ప్రెగ్నెన్సీలో న్యూ ట్విస్ట్.. జానకి, రామ సీక్రెట్ ప్లాన్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ అసలు కథ మరో కీలక మలుపు తిరుగుతోంది. జానకి తన భర్త రామ సహాయంతో తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఈ క్రమంలో అత్త జ్ఞానాంబ కూడా ఒప్పుకుంటుంది. అయితే జనకికి ఇంట్లోనే మల్లిక నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. వాటిని దాటి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోనే ప్రధాన అంశం. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 411 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  తులసి కోటను కిందపడేసిన మల్లిక

  తులసి కోటను కిందపడేసిన మల్లిక

  జానకి ఐపిఎస్ కావాలి అని తదుపరి పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటుంది. అయితే ఆమె చదువును ఎలాగైనా చెడగొట్టాలి అని జానకి అనుకున్నట్లుగా ఐపిఎస్ పూర్తి కాకూడదు అని కూడా మల్లిక ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే ఆమె చదువును డిస్టర్బ్ చేసే విధంగా ఏదో ఒకటి చేయాలని కూడా మల్లికా ఆలోచిస్తుంది. ఈ క్రమంలో ఆమె ఇంటి ముందు ఉన్న తులసి మొక్కను పీకి పారేస్తుంది. ఇక మల్లిక ఆ పని చేస్తూ ఉంటే కిటికీలోనుంచి రామచంద్ర జానకి ఇద్దరు కూడా చూస్తారు. ఇక తర్వాత మల్లికా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తులసి కోటకు పూజ చేయాలని వచ్చిన జ్ఞానాంబ అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది.

  జానకిపై మల్లిక అబద్ధాలు

  జానకిపై మల్లిక అబద్ధాలు

  ఇంట్లో అందరికీ పిలిచి ఇలాంటి చెడు పని ఎవరు చేశారు అని జ్ఞానాంబ అడుగుతుంది. ఇక మల్లిక తెలివిగా ప్రతిరోజు కూడా ఇక్కడ జానకి శుభ్రం చేస్తుంది అని బహుశా ఆమెనే ఇలా చేసి ఉండవచ్చు అని అనుమానాన్ని కలిగిస్తుంది. ఇక జానకి ఎంత మాత్రం అలాంటి తప్పు చేయదు అని జ్ఞానాంబతో పాటు ఆమె భర్త గోవిందరాజులు కూడా అంటాడు. కానీ మల్లిక మాత్రం జానకి చేయకపోతే జెస్సి చేసి ఉండవచ్చు అని కూడా అంటుంది.

  మల్లిక ప్లాన్ ఫ్లాప్

  మల్లిక ప్లాన్ ఫ్లాప్

  ఇక తర్వాత రామచంద్ర అసలు నిజం చెప్పాలని అనుకుంటాడు. కానీ జానకి అతన్ని ఆపి ఈ తప్పు నేను చేశాను అని పొరపాటు జరిగింది అని అంటుంది. ఇక తులసి మొక్కను మట్టిని తీస్తూ ఉండే సమయంలో అక్కడే ఒక ఉంగరం దొరుకుతుంది. అది ఎప్పుడో జ్ఞానాంబ పోగొట్టుకున్న ఉంగరం అది. పెళ్లినాటిది అని గోవిందరాజులు కూడా గుర్తు చేస్తాడు. దీంతో జ్ఞానాంబ ఒక్కసారిగా సంతోషిస్తుంది. కొంతమంది పొరపాటు చేసిన కూడా మంచే జరుగుతుంది అని కూడా అనడంతో మల్లిక మరోసారి షాక్ అవుతుంది. జానకిపై నిందలు వేయాలని అనుకున్నప్పటికీ కూడా వర్కౌట్ కావడం లేదు అని ఆవేదన చెందుతూ ఉంటుంది.

  హెచ్చరించిన జానకి

  హెచ్చరించిన జానకి

  ఇక తర్వాత జానకి, మల్లికను హెచ్చరిస్తుంది. నువ్వు చేసిన తప్పును ఇప్పుడు ఇంట్లో చెబితే గొడవ అవుతుంది అందుకే చెప్పలేదు అని మరోసారి ఇలాంటి తప్పు చేయకూడదు అని వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత జ్ఞానాంబ తన ఉంగరాన్ని చూస్తూ సంతోషిస్తుంది. ఈ సమయంలో ఆ దేవత నీకు ఇచ్చిన కానుక అంటూ గోవిందరాజులు కూడా చెబుతాడు. ఇక అప్పుడే ఇంటికి జానకి చదువుతున్న కాలేజీ ప్రిన్సిపల్ వస్తుంది. జానకి చాలా చక్కగా చదువుతుంది అని ఆమెకు మరింత సపోర్ట్ చేయడానికి కొన్ని పుస్తకాలు తీసుకువచ్చినట్లుగా ఆమె చెబుతుంది.

  జెస్సికి ఆరోగ్య సమస్యలు

  జెస్సికి ఆరోగ్య సమస్యలు

  ఈ పరీక్షల్లో తప్పకుండా నువ్వు పాస్ అయితే ఐపీఎస్ కలర్ నెరవేరినట్లే అని కూడా ఆమె చెప్పడంతో జ్ఞానాంబ గోవిందరాజులు కూడా సంతోషిస్తారు. ఇక తర్వాత జానకి చదువుకుంటున్న సమయంలో అప్పుడే జెస్సికి కడుపు నొప్పి వస్తుంది. ఆమె బెడ్ రూమ్లో నుంచి హాల్లోకి రాగానే జానకి ఆశ్చర్య పోతుంది. ఆ తర్వాత ఇంట్లో అందరికీ చెబితే టెన్షన్ పడతారు అని జానకి జెస్సిని తీసుకుని హాస్పిటల్ కి వెళుతుంది. అక్కడికి రామచంద్ర కూడా వస్తాడు. అయితే వైద్యులు పరీక్షించిన తర్వాత జెస్సి కడుపులో ఉన్న బిడ్డ పెరగడం లేదు అని కొన్ని సమస్యలు తలెత్తేయని వైద్యులు చెబుతారు. దీంతో జానకి ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది.

  ఎవరికి తెలియకుండా

  ఎవరికి తెలియకుండా

  అయితే భవిష్యత్తులో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ చేయిస్తే సరిపోతుంది అని అందుకోసం డబ్బు కూడా ఖర్చవుతుంది అని వైద్యులు చెబుతారు. ఇక రామచంద్ర మరోసారి ఆలోచనలు పడతాడు. ఈ విషయం ఇంట్లో చెబితే మళ్ళీ అందరూ బాధపడతారు అని అందుకే ఎవరికీ తెలియకుండా మనమే కొంత డబ్బులు ఆదా చేస్తూ ఉండాలి అని జానకి రామచంద్ర కు చెబుతుంది. ఇక రామచంద్ర కూడా అందుకు ఒప్పుకుంటాడు. కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో తెలియకూడదు అని కూడా జానకి రామచంద్ర కు తెలియజేస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్ లోపల నుంచి వచ్చిన జెస్సి ఏం జరిగింది అని అడుగుతుంది. మరి జానకి ఈ విషయంలో జెస్సి కి ఎలాంటి మాటలు చెబుతుందో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 411
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X