Janaki Kalaganaledu October 18th: జ్ఞానాంబ మనసులో అణుబాంబు లాంటి నిర్ణయం.. కన్ఫ్యూజన్‌లో మల్లిక

జానకి కలగనలేదు ప్రస్తుతం తెలుగులో టాప్ రేటింగ్స్ అందుకుంటున్న సీరియల్ గా మంచి క్రేజ్ అందుకుంటోంది. 38వ వారంలో ఈ సీరియల్ అర్బన్ ప్రాంతంలో 7.56 రేటింగ్ అందుకున్న ఈ సీరియల్.. 39వ వారంలో 8.26 రేటింగ్ నమోదు చేసింది. ఇక రూరల్ లో మాత్రం 38వ వారంలో 8.07 రేటింగ్ రాగా 39వ వారంలో 8.73 రేటింగ్ సాధించింది. ఫైనల్ గా జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు ప్రేక్షకుల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూనే ఉంది. ఇక సీరియల్ లో అసలు ట్విస్ట్ కు మొదలయ్యింది.

చదువుకున్న కోడలు వస్తే కొడుకుతో సరిగ్గా కాపురం చేయదని ఆ తరువాత అతని ప్రాణాలకు కూడా హాని కలిగే అవకాశం ఉంటుందని అనుమానంతో ఉన్న జ్ఞానాంబ అసలు నిజం బయటపెట్టాలని అనుకజ్నతుంది. జ్ఞానాంబ భయం వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. ఇటీవల రామచంద్ర ఆ విషయాన్ని తన భార్య జానకికి తెలియజేశాడు.

ఇక జానకి అబద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందనే పాయింట్ కు మొత్తానికి ముగింపు కార్డ్ పడింది. ఇక ఇప్పటి నుంచి మరొక ఆసక్తికరమైన అంశంతో సీరియల్ కొనసాగనుంది. నేడు ప్రసారం కాబోయే 151వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

జానకి విషయంలో చాలా కఠినంగా..

జానకి విషయంలో చాలా కఠినంగా..

చదువుకున్న అమ్మాయి కోడలిగా రాకూడదని జ్ఞానాంబ ఒక నిర్ణయం తీసుకుంటుంది. తన ఇద్దరు కొడుకులు చదువుకోలేదు అని చదువుకోలేని కొడళ్లను చూస్తుంది. గతంలో తన తమ్ముడికి జరిగిన అన్యాయం మళ్ళీ తన కొడుకు కూడా జరిగే అవకాశం ఉంటుంది అని అనుమానంతో జానకి విషయంలో చాలా కఠినంగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుంది. దానికితోడు చిన్నకోడలు కూడా అత్త కోపానికి మరింత అగ్గి రాజేసింది. దీంతో జానకి కలగనలేదు సీరియల్ మరొక కీలక మలుపు తిరిగపోతున్నట్లు తెలుస్తోంది.

ధైర్యం చేయలేకపోయిన జ్ఞానాంబ

ధైర్యం చేయలేకపోయిన జ్ఞానాంబ

మొత్తానికి మల్లిక జానకికి సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్ లను కూడా చూపిస్తుంది. దీంతో జ్ఞానాంబ.. జానకి నిజంగానే డిగ్రీ పూర్తి చేసిందని ఆలోచనలో పడుతుంది. ఈ విషయంలో ఆమెను గట్టిగానే ప్రశ్నించాలని అనుకుంటుంది. కానీ పరిస్థితుల ప్రభావం వలన ఆమె ధైర్యంగా అడగలేక పోతుంది. ఎందుకంటే జానకిని ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా నమ్మకంతో చూసుకుని మళ్ళీ గొడవలు పెట్టుకోవడం అంతగా ఇష్టం ఉండదు. కానీ ఎలాగైనా సరే కొడుకు ప్రాణాలను పణంగా పెట్టడం మంచిది కాదు అని ఆ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుంది.

కిచెన్ లో జానకి, రామ రొమాన్స్

కిచెన్ లో జానకి, రామ రొమాన్స్

జానకిని బయటకు పంపించాలని జ్ఞానాంబ ఆలోచిస్తూ ఉండగా మరో వైపు జానకి రామచంద్ర ఇద్దరు కూడా ఒకరిని విడిచి మరొకరు ఉండని విధంగా కనిపిస్తారు. వంట రూమ్ లో ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఉండగా మధ్యలో మల్లిక వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. ఇక అందరూ బయట కూర్చుని ఉండగా జానకి ప్రత్యేకంగా కాఫీలు ఇస్తుంది. అదే సమయంలో చిన్న కుమారుడు విష్ణు కూడా షాప్ కి బయలుదేరుతుండగా గోవిందరాజులు అతని పిలిచే కాఫీ తాగి వెళ్లమని చెబుతాడు. కానీ మల్లిక అవసరం లేదు వెళ్ళిపో అని చెప్పగానే అతను అక్కడి నుంచి జారుకుంటాడు. తర్వాత చిన్న కొడుకు కాలేజీకి వెళుతూ ఉండగా జానకిని బాగా చదువుకోవాలని అతనికి చెబుతుంది.

జానకి మంచి మాటలు

జానకి మంచి మాటలు

ఇక మరోవైపు మల్లిక మాత్రం అసలు నిజం తెలిసిన తర్వాత కూడా అత్తగారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని కన్ఫ్యూజన్ గురి అవుతుంది. తప్పకుండా అణుబాంబు పెళుతుందేమో అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటే ఈ సెంటిమెంట్ డైలాగ్స్ తట్టుకోలేకపోతున్నాను అంటూ తనను తానే మల్లిక ఆలోచిస్తుంది.

జానకి మాత్రం అందరితో కలిసి మెలిసి మంచి మాటలు చెబుతూ అత్తగారికి గొప్ప పేరు తేవాలని తన మరిధికి కూడా చెబుతుంది. జానకి మాటలకు మామ గోవిందరాజులు కూడా ఎంతగానో సంతోషిస్తాడు. నువ్వు ఇంటిని మొత్తం చాలా చక్కగా చూసుకుంటున్నావు. పొరపాటున కూడా అబద్ధం చెప్పకుండా నిజాయితీ గా ఉంటున్నారు అని చెప్పగానే జ్ఞానంబ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది.

Recommended Video

Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
జ్ఞానాంబ మరో కీలక నిర్ణయం

జ్ఞానాంబ మరో కీలక నిర్ణయం

జానకి అత్త గారికి కూడా కాఫీ ఇవ్వాలని అనుకుంతుంది. కానీ అప్పుడు ఆమె మౌనంగానే ఉంటూ అవసరంలేదు అని సైగలతోనే చెప్పడంతో జానకి భయంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఇక జ్ఞానాంబ తనలో తానే జానకి గురించి ఎంతగానో ఆలోచిస్తుంది. ఒకవైపు జానకి రామచంద్ర విడిపోకూడదు అని అనుకుంటుంది.

మరోవైపు తన తమ్ముడికి జరిగిన అన్యాయమే రేపు కొడుకు విషయంలో కూడా జరగవచ్చు అనే అనుమానంతో కూడా కంగారు పడుతుంది. ఈ విషయంపై ఏదో ఒకటి ఆలోచించాలి అని జ్ఞానాంబ తన భర్తతో ఒక విషయాన్ని చెబుతుంది. జానకి చదువుకున్నది 5 తరగతి కాదు డిగ్రీ చదివింది అని చెనుతుంది.

దీంతో గోవిందరాజులు ఆశ్చర్యానికి గురవుతాడు. అసలు ఎందుకు అబద్ధం చెప్పారు అనే విషయాన్ని అడగాలని అందుకోసం జానకి అన్నయ్యను కూడా పిలిపించాలి అని అనుకుంటారు. మరి జానకి అన్నయ్య జ్ఞానాంబకు ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X