For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu October 19th:.మళ్ళీ ఇరికించిన మల్లిక.. అత్త నుంచి భయంకర నిజం తెలుసుకున్న జానకి!

  |

  జానకి కలగనలేదు ఇటీవల కాలంలో మంచి రేటింగ్స్ అందుకుంటున్న సీరియల్ గా క్రేజ్ అందుకుంటోంది. ప్రతీ వారం రేటింగ్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఐపీఎస్ అవ్వాలని కలలు కనే జానకి ఇంట్లో ఎవరికీ తెలియకుండా భర్త సహకారంతో తన కలను సాకారం చేసుకోవాలని అనుకుంటుంది. ఆ నిజం జ్ఞానాంబకు తెలియడంతో కథ మరొక కీలక మలుపు తిరుగుతుంది. ఇక 38వ వారంలో ఈ సీరియల్ అర్బన్ ప్రాంతంలో 7.56 రేటింగ్ అందుకున్న ఈ సీరియల్.. 39వ వారంలో 8.26 రేటింగ్ నమోదు చేసింది. ఇక రూరల్ లో మాత్రం 38వ వారంలో 8.07 రేటింగ్ రాగా 39వ వారంలో 8.73 రేటింగ్ సాధించింది.

  మొత్తానికి జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు ప్రేక్షకుల సంఖ్యను పెంచుకుంటూనే ఉంది. జ్ఞానాంబ భయం వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. ఇటీవల రామచంద్ర ఆ విషయాన్ని తన భార్య జానకికి తెలియజేశాడు. ఇక జానకి అబద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందనే పాయింట్ కు మొత్తానికి ముగింపు కార్డ్ పడింది. ఇక ఇప్పటి నుంచి మరొక ఆసక్తికరమైన అంశంతో సీరియల్ కొనసాగనుంది. నేడు ప్రసారం కాబోయే 151వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  అయోమయంలో జ్ఞానాంబ

  అయోమయంలో జ్ఞానాంబ

  మొత్తానికి జ్ఞానాంబకు జానకి చదువుకున్న విషయం తెలియడంతో కథ ఒక్కసారిగా మలుపు తిరగబోతున్నట్లు అర్థమవుతుంది. ఒకప్పుడు చదువుకున్న అమ్మాయితో తన తమ్ముడికి పెళ్లి చేయడం వలన ఆమె సరిగా కాపురం చేయకపోవడంతో సూసైడ్ చేసుకున్నాడు అని జ్ఞానాంబ ఎంతగానో ఆందోళన చెందుతుంది.

  అదే పరిస్థితి తన కొడుకు రాకూడదు అని జ్ఞానాంబ ఎంతగానో ఆలోచించి చదువుకోలేని అమ్మాయిని కోడలిగా తేవాలని అనుకుంటుంది. కానీ జానకి 5వ తరగతి వరకే చదువుకుందని వాళ్ల అన్నయ్య అబద్ధం చెప్పి పెళ్లి చేస్తాడు. ఆ విషయం అబద్ధం అని, జానకి డిగ్రీ చదివిందని నిజం తెలియడంతో జ్ఞానాంబ అయోమయంలో ఉంటుంది.

  అన్యోన్యంగా రొమాన్స్

  అన్యోన్యంగా రొమాన్స్

  మరో వైపు జానకి శ్రీ రామచంద్ర ఇద్దరు కూడా అన్యోన్యంగా రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. జానకి పసుపును దంచుతూ ఉండగా అక్కడికి వచ్చిన రామచంద్ర ఆమెతో సరదాగా గడిపేందుకు ఇష్టపడతారు. ఇద్దరు కలిసి ఉండగా వెనకాల నుంచి మల్లిక సడన్ గా వస్తుంది. వాళ్ళను చూసి మల్లికా ఒక్కసారిగా షాక్ అవుతుంది. గొడవలు జరగాల్సిన ఇంట్లో ఇలా రొమాన్స్ లో ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు అని జానకిని మళ్లీ ఇరికించాలని అనుకుంటుంది. జ్ఞానాంబ పిలవకపోయినప్పటికీ నిన్ను అత్త గారు పిలుస్తున్నారు అంటూ జానకిని చెబుతుంది.

  నిజం తెలిసిందని అర్థం చేసుకున్న జానకి

  నిజం తెలిసిందని అర్థం చేసుకున్న జానకి

  దీంతో పరుగుపరుగున తన అత్తగారి వద్దకు వెళ్లిన జానకి పిలిచారా అని అడుగుతుంది. అందుకు జ్ఞానాంబ నన్ను విసిగించకు ఇక్కడినుంచి వెళ్ళు అని చెప్పడంతో జానకి కొంత ఆశ్చర్యపోతుంది. మీరు పిలిచారు అని మల్లికా చెప్పిందని అనడంతో మళ్లీ కోపానికి లోనవుతుంది. మల్లికను గట్టిగా పిలిచినప్పటికీ ఆమె దగ్గరికి రాదు.

  అయితే ఇంతలో జానకి మీరు నాతో గత కొన్ని రోజులుగా ఎందుకో కోపంగా ఉన్నట్లు మౌనంగా ఉన్నట్లు అర్థమవుతోంది. మీ మౌనాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. నావల్ల ఏమైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి. ఆ తప్పును సరిదిద్దుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తాను అంటూ జానకి చెబుతుంది. అయితే ఇంతలో జ్ఞానాంబ కోపం గురించి తెలుసుకోవాలని అనుకున్న జానకి హటాత్తుగా తను చదువుకు సంబంధించిన ఒక సర్టిఫికేట్ ని చూస్తుంది. ఆమెకు నిజం తెలిసింది అని జానకి అనుకుంటుంది. మరి ఈ పరిణామాలు జానకి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తాయో చూడాలి.

  జానకి అన్నయ్య ఎందుకు అబద్ధం చెప్పాడు?

  జానకి అన్నయ్య ఎందుకు అబద్ధం చెప్పాడు?

  మొత్తానికి జానకి చదువుకున్న విషయాన్ని తన భర్త గోవింద రాజుకు కూడా జ్ఞానాంబ తెలియజేస్తుంది. జానకి అన్నయ్య కు ముందుగానే తన తమ్ముడికి జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పినప్పటికీ ఎందుకు అబద్ధం చెప్పాడో అర్థం కావడం లేదు అని జ్ఞానాంబ తన భర్తతో చెబుతుంది. అయితే గోవిందరాజులు కూడా ఇది నిజమేనా అని మరొకసారి అనుమానంగా చూస్తాడు. అయితే కాలేజ్ లో జానకి ఫోటో కూడా చూశాను అని చెప్పడంతో అది నిజమని నమ్ముతాడు. ఇక ఫైనల్ గా జానకి అన్నయ్యను ఇండియాకు పిలిపించి అసలు నిజం తెలుసుకోవాలని అనుకుంటారు.

  జానకిని ఇరికించే ప్రయత్నం

  జానకిని ఇరికించే ప్రయత్నం

  మరో వైపు జానకి శ్రీ రామచంద్ర ఇద్దరు కూడా అన్యోన్యంగా రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. జానకి పసుపును దంచుతూ ఉండగా అక్కడికి వచ్చిన రామచంద్ర ఆమెతో సరదాగా గడిపేందుకు ఇష్టపడతారు. ఇద్దరు కలిసి ఉండగా వెనకాల నుంచి మల్లిక సడన్ గా వస్తుంది. వాళ్ళను చూసి మల్లికా ఒక్కసారిగా షాక్ అవుతుంది. గొడవలు జరగాల్సిన ఇంట్లో ఇలా రొమాన్స్ లో ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు అని జానకిని మళ్లీ ఇరికించాలని అనుకుంటుంది. జ్ఞానాంబ పిలవకపోయినప్పటికీ నిన్ను అత్త గారు పిలుస్తున్నారు అంటూ జానకిని చెబుతుంది.

  నిజం తెలిసిందని అర్థం చేసుకున్న జానకి

  నిజం తెలిసిందని అర్థం చేసుకున్న జానకి

  దీంతో పరుగుపరుగున తన అత్తగారి వద్దకు వెళ్లిన జానకి పిలిచారా అని అడుగుతుంది. అందుకు జ్ఞానాంబ నన్ను విసిగించకు ఇక్కడినుంచి వెళ్ళు అని చెప్పడంతో జానకి కొంత ఆశ్చర్యపోతుంది. మీరు పిలిచారు అని మల్లికా చెప్పిందని అనడంతో మళ్లీ కోపానికి లోనవుతుంది. మల్లికను గట్టిగా పిలిచినప్పటికీ ఆమె దగ్గరికి రాదు. అయితే ఇంతలో జానకి మీరు నాతో గత కొన్ని రోజులుగా ఎందుకో కోపంగా ఉన్నట్లు మౌనంగా ఉన్నట్లు అర్థమవుతోంది. మీ మౌనాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. నావల్ల ఏమైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి. ఆ తప్పును సరిదిద్దుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తాను అంటూ జానకి చెబుతుంది. అయితే ఇంతలో జ్ఞానాంబ కోపం గురించి తెలుసుకోవాలని అనుకున్న జానకి హటాత్తుగా తను చదువుకు సంబంధించిన ఒక సర్టిఫికేట్ ని చూస్తుంది. ఆమెకు నిజం తెలిసింది అని జానకి అనుకుంటుంది. మరి ఈ పరిణామాలు జానకి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తాయో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 152
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X