Janaki Kalaganaledu October 1st: ఐపీఎస్ పై ఆశలు వదులుకున్న జానకి.. వాటిని కాల్చేసి బిగ్ ట్విస్ట్!
జానకి కలగనలేదు రేటింగ్స్ అందుకోవడంలో కూడా ఇటీవల సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం టాప్ లిస్ట్ లో ఉన్న తెలుగు సీరియల్స్ లలో జానకి కలగనలేదు కూడా తన స్థాయిని అంతకంతకు పెంచుకుంటూనే ఉంది. ఇక సీనియర్ నటి అందాల రాశి కూడా మొదటిసారి ఒక విభిన్నమైన పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం ఈ సీరియల్ కు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. రాశి జ్ఞానాంబ పాత్రలో చాలా పవర్ఫుల్ గా కనిపిస్తోంది. ఐపీఎస్ చదువుకోవలనే కలలు కనే జానకి మొత్తానికి భర్త సహాయంతో కోచింగ్ తీసుకుంటూ చదువును పూర్తి చేసేందుకు సిద్దమైంది.
భావోద్వేగమైన సీన్స్ తో జానకి రామచంద్ర ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇక జానకి చదువు విషయంలో మల్లికకు అనుమానాలు వస్తాయి. ఆ విషయాన్ని జ్ఞానాంబకు చెప్పాలని అనుకుంటుంది. కానీ ఆమె ప్లాన్స్ డిజాస్టర్ అవుతుంటాయి. ఇక నేడు ప్రసారం కాబోయే 140వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

అత్త మీద కోపంతో
ఒక వైపు జ్ఞానాంబ ఎలాగైనా తన కోడళ్లకు పిల్లలు కలగాలని హోమాలు పూజలు వ్రతాలు చేస్తూ ఉంటుంది. కానీ చిన్న కోడలు మల్లిక మాత్రం అత్త మీద కోపం తో వారసులను ఇవ్వకూడదు అని అనుకుంటుంది. రేపు నా పిల్లలను కూడా తన ఆధీనంలోనే ఉంచుకుంటుంది అని అనుమానంతో పిల్లలు పుట్టకుండా మందులు కూడా వాడుతూ ఉంటుంది. అయితే రీసెంట్ గా జ్ఞానాంబకు మల్లిక అసలు విషయం తెలుస్తుంది. మొదట మల్లిక జానకిని ఇరికించాలని అనుకున్నప్పటికీ అనుకోకుండా తాను తీసిన గోతిలో తనే పడుతుంది.

జానకి గదిలో టాబ్లెట్స్
మెడికల్ షాప్ నుంచి వచ్చిన మల్లిక టాబ్లెట్స్ ఇంట్లో పడేసుకోవడంతో అవి జ్ఞానాంబ కంట పడతాయి. అసలు నిజం తెలుసుకునేందుకు జానకిపై అనుమానం వ్యక్తం చేస్తుంది. అంతే కాకుండా ఇద్దరి బెడ్ రూమ్ లో కూడా వెతికిస్తుంది. కానీ అంతకుముందే మల్లిక జానకి గదిలో కొన్ని టాబ్లెట్స్ ఉంచడంతో జ్ఞానాంబ జానకిని కూడా అనుమానిస్తుంది. నేను తప్పు చేయలేదని జానకి ఎంత చెప్పినా కూడా ఆమె వినలేదు. ఇక చివరికి మెడికల్ షాప్ వ్యక్తి ఇంటికి రావడంతో అసలు నిజం తెలుస్తుంది.

మల్లిక గుట్టు తెలుసుకున్న జ్ఞానాంబ
మల్లిక పొరపాటున మెడికల్ షాపు వద్ద 500 రూపాయలు పడిపోయి ఉండడంతో వాటిని తీసుకోవడానికి వెళ్లి రావలసిన యాభై రూపాయల గురించి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అయితే ఆ వ్యక్తి ఇంటికి వచ్చి గోవిందరాజులకు టాబ్లెట్స్ ఇచ్చి వెళ్తాడు. ఇక మల్లికపై మరొక అనుమానంతో జ్ఞానాంబ ఆ వ్యక్తిని వెనక్కి పిలిచి మల్లిక తీసుకున్న టాబ్లెట్ల గురించి ఆరా తీస్తుంది. అతను నిజమేనని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. గోవిందరాజులు కూడా మల్లికపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

జానకికి శిక్ష వేసి ఉంటే..
మల్లిక భయంతో భర్త చాటు కి వెళ్లి దాక్కొని ఉంటుంది. అనవసరంగా ఇంకా పెద్దది చేసుకోకుండా వెళ్లి అమ్మ కాళ్ళ మీద పడు అని విష్ణు కూడా సలహా ఇవ్వడంతో భయపడుతూనే మల్లిక జ్ఞానాంబ కాళ్ళు పట్టుకుంటుంది. ఏదో తెలియక చేశాను అంటూ ఈ ఒక్కసారికి క్షమించాలని ఏడుస్తుంది. కానీ అందుకు గోవింద రాజులు మాత్రం ఒప్పుకోడు. నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. ఇది నిజం అనుకొని మీ అత్త జానకి పై ఎంతో కోపాన్ని తెచ్చుకుంది. అంతేకాకుండా తనకు ఏదైనా శిక్ష విధించి ఉంటే ఎంత ఘోరం జరిగి ఉండేది అని అంటాడు.

అందుకే ఈ మోసం చేశాను
అయితే తాను ఈ పని కావాలని చేయలేదు అంటూ మరొక అబద్ధం చెబుతోంది. నేను బక్కగా ఉన్నాను కాబట్టి పిల్లలను ఇప్పుడే కనలేను అని కొంతకాలం తర్వాత బరువు పెరిగిన తర్వాత పిల్లల గురించి ఆలోచించాలని అనుకున్నట్లు మల్లిక కొత్త కథను చెబుతుంది. అయితే జానకిపై ఎందుకు నింద వేశావు అని అడగడంతో మల్లిక మరొక అబద్ధం చెబుతుంది. నేను కావాలని ఏమి చెప్పలేదు అని.. ఎందుకంటే నేను ఏదైనా తప్పు చేస్తే వెంటనే శిక్షిస్తారు. అదే జానకి చేస్తే ఏమీ అనకుండా క్షమిస్తారు కాబట్టి అందుకే నన్ను కాపాడు కోవడానికి ఆమెపై నింద వేసినట్లు చెబుతుంది.

ఐపీఎస్ కలను మంటల్లో పడేసిన జానకి
ఇక ఏ శిక్ష వేసినా కూడా నేను సిద్ధమే అంటూ మల్లిక ఏడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా జానకి కాళ్లు పట్టుకోవడానికి కూడా వెళ్తుంది. ఇక అప్పుడు జ్ఞానాంబ.. ఇంత పెద్ద ఎలా మోసం చేశావు అని మల్లికకు చెప్పుకుంటూ జ్ఞానాంబ బాధపడుతుంది. అయితే అప్పుడు కూడా జానకి కూడా తన అబద్ధాన్ని గుర్తుచేసుకొని ఎంతగానో బాధపడుతుంది. చదువుకుంటున్న విషయం అత్త గారికి తెలిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అని బాధపడుతుంది.
ఇక ఆ తర్వాత జ్ఞానాంబ మళ్లీ ఇలాంటి తప్పు జరగకుండా ఉండాలి అంటే విష్ణు మల్లిక ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోయి కొత్త కాపురం పెట్టుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు జ్ఞానాంబ సమాధానం ఇస్తుంది. ఇక ఆ తర్వాత జానకి కూడా తను రహస్యంగా చదువుకుంటున్న విషయం తెలిస్తే అత్త బాధ పడతారు అని ఐఏఎస్ చదువుకోవడం కోసం తెచ్చుకున్న పుస్తకాలను కూడా అర్ధరాత్రి మంటల్లో పడేస్తుంది. ఇక అది చూసిన రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి జానకి మళ్లీ తన చదువును కొనసాగిస్తుందా లేదా అనేది తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











