Janaki Kalaganaledu October 20th: సహనం కోల్పోయిన జ్ఞానాంబ.. జానకి అన్నయ్యపై ఆగ్రహం!

జానకి కలగనలేదు రోజురోజుకు రేటింగ్స్ అందుకోవడంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ప్రతీ వారం రేటింగ్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఎలాగైనా కోచింగ్ తీసుకొని ఐపీఎస్ అవ్వాలని కలలు కనే జానకి ఇంట్లో ఎవరికీ తెలియకుండా భర్త సహకారంతో ముందుకు సాగుతూ ఉంటుంది. అయితే జానకి చదువు విషయం జ్ఞానాంబకు తెలియడంతో కథ మరొక కీలక మలుపు తిరిగింది. ఇక 38వ వారంలో ఈ సీరియల్ అర్బన్ ప్రాంతంలో 7.56 రేటింగ్ అందుకుంది.. 39వ వారంలో 8.26 రేటింగ్ నమోదు చేసింది.

ఇక రూరల్ లో మాత్రం 38వ వారంలో 8.07 రేటింగ్ రాగా 39వ వారంలో 8.73 రేటింగ్ సాధించింది. జ్ఞానాంబ భయం వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. ఇటీవల రామచంద్ర ఆ విషయాన్ని తన భార్య జానకికి తెలియజేశాడు. ఇక జానకి అబద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందనే పాయింట్ కు మొత్తానికి ముగింపు కార్డ్ పడింది. ఇక ఇప్పటి నుంచి మరొక ఆసక్తికరమైన అంశంతో సీరియల్ కొనసాగనుంది. నేడు ప్రసారం కాబోయే 153వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

జ్ఞానాంబ మనసులో ఆందోళన

జ్ఞానాంబ మనసులో ఆందోళన

జానకి చదువు విషయంలో జ్ఞానాంబ మొత్తానికి తన సహనాన్ని కోల్పోయింది. జానకి 5వ తరగతి చదువుకోలేదని ఆమె చదువుకుంది డిగ్రీ అని తన భర్త గోవిందరాజులు నిజం చెబుతుంది. మొదట ఆశ్చర్యపోయిన గోవిందరాజులు ఆ తర్వాత జానకికి సంబంధించిన సర్టిఫికెట్లు చూడడంతో నిజమని నమ్ముతుంది.

ఇక జ్ఞానాంబ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదని తన కొడుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టకూడదు అని నిర్ణయం తీసుకుంటుంది. ఒకప్పుడు బాగా చదువుకున్న అమ్మాయి వలన తన తమ్ముడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఇప్పుడు నా కొడుకు విషయంలో కూడా అలా జరగడానికి వీలు లేదు అని జ్ఞానాంబ ఎంతగానో ఆందోళన చెందుతుంది.

జానకి అన్నయ్యతో మాట్లాడాలని..

జానకి అన్నయ్యతో మాట్లాడాలని..

అలా జరగకూడదు అంటే జానకి అన్నయ్యతో మాట్లాడాలని ఆయనను వెంటనే ఇంటికి రమ్మని చెప్పాలని గోవిందరాజులు చెబుతుంది. దీంతో గోవిందరాజులు జానకి అన్నయ్యను ఇంటికి రమ్మని చెబుతాడు. ఇక జానకి కూడా అత్తగారి తీరుతో మొదట ఆందోళన చెందుతుంది. ఇంట్లో ఉన్న ఒక సర్టిఫికేట్ కాగితాన్ని చూసిన జానకి చదువు విషయం అత్తకు తెలిసినట్లు అర్థం చేసుకుంటుంది.

ఇక వెంటనే ఆ విషయాన్ని తన భర్తకు చెప్పాలని షాప్ కు కూడా వెళుతుంది. అయితే అంతకుముందే గోవిందరాజులు రామచంద్ర దగ్గరికి వచ్చి తల్లి ప్రశ్నించిన విషయాన్ని కూడా చెబుతాడు. మీ అమ్మకు జానకి చదువు విషయం గురించి పూర్తిగా తెలిసిపోయింది అని ఇప్పుడు చాలా కోపంగా ఉంది అని కూడా అంటాడు.

ఏదో ఒకటి తేల్చేయాలని..

ఏదో ఒకటి తేల్చేయాలని..

జానకి అన్నయ్యను కూడా ఇంటికి రమ్మని చెప్పి నట్లు చెప్పడంతో రామచంద్ర వెంటనే బైక్ తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళతాడు. ఇక అప్పుడు జానకి రామచంద్రను కలవడానికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్తుంది. ఇక మరోవైపు జానకి విషయంలో ఏదో ఒకటి తేల్చేయాలని మల్లిక కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది.

ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే తనకు ఎంతో సంతోషంగా ఉంటుంది అని పనిమనిషితో చెప్పుకుంటూ ఆనందపడుతుంది. ఇక వెంటనే జానకి వాళ్ళ అన్నయ్య ఇంటికి రావడంతో ఈ రోజు తప్పకుండా జానకిని ఇంటి నుంచి పంపిస్తారని మల్లిక ఎంతగానో సంతోషపడుతుంది.

ఎందుకు అబద్దం చెప్పావు?

ఎందుకు అబద్దం చెప్పావు?

జ్ఞానాంబ జానకి అన్నయ్యను చదువు విషయం గురించి ప్రశ్నిస్తుంది. అసలు నువ్వు ఎందుకు అబద్దం చెప్పావు మా తమ్ముడుకి జరిగిన అన్యాయం గురించి ముందే నీకు చెప్పాను కదా అని అడుగుతుంది. బాగా చదువుకున్న కోడలు వస్తే సరిగ్గా కాపురం చేయదు. చదువుకున్నాను అనే అహంకారంతో ఎంతగానో బాధ పెడతారు. చదువుకో లేని నా కొడుకు విషయంలో కూడా అలా జరగకూడదు అనే నేను ఎంతగానో ఆలోచించి ఈ సంబంధం చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఇలా మమ్మల్ని ఎందుకు మోసం చేసావు అని జ్ఞానాంబ అడుగుతుంది.

బయటకు వెళ్లిపోవాలనుకున్న జానకి

బయటకు వెళ్లిపోవాలనుకున్న జానకి

అయితే తాను అబద్దం చెప్పిన మాట వాస్తవమే కానీ మా చెల్లెలు అలాంటిది కాదు అని అతను చెబుతాడు. జ్ఞానాంబ ఇంట్లోకి నా చెల్లెలు అడుగు పెడితే చాలా సంతోషంగా ఉంటుంది అని అలాగే బంగారం లాంటి బావ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆమెకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉంటుంది అని ఒక అబద్ధం చెప్పి ఈ పెళ్లి చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతాడు.

అయితే నువ్వు చేసిన పనికి ఇప్పుడు ఇంట్లో నా కొడుకు పరిస్థితి సందిగ్ధంలో పడింది దీనికి ఏం చేయమంటావు అని అడుగుతుంది. అయితే ఏప్పుడు కూడా అలాంటి తప్పు జరగదు అని నేను మాట ఇస్తున్నాను అని జానకి అన్నయ్య చెప్పినప్పటికీ. జ్ఞానాంబ మాత్రం ఒప్పుకోదు.

వెంటనే ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అడుగుతుంది. ఇక ఆ తర్వాత జానకి సూట్ కేస్ పట్టుకుని బయటకు వెళ్లి పోవడానికి సిద్ధమవుతుంది. మరి ఈ పరిణామాలు జానకి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X