For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu October 20th: జ్ఞానాంబ కుటుంబంలో చీలికలు.. మల్లిక దారుణమైన ప్లాన్!

  |

  జానకి కలగనలేదు కథ మరో కీలక మలుపు తిరిగింది. భర్త రామ సహాయంతో ఎలాగైనా ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని జానకి అనుకుంటుంది. ఈ క్రమంలో అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ జనకికి ఇంట్లోనే మల్లిక నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. వాటిని దాటి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోనే ప్రధాన అంశం. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 414 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  జెస్సి గురించి ఆలోచించి

  జెస్సి గురించి ఆలోచించి

  జానకి రామచంద్ర ఇద్దరు కూడా జెస్సి ఆరోగ్యం గురించి ఆలోచించి ఆమెకు పుట్టబోయే బిడ్డ కోసం కొంత డబ్బును ఆదా చేయాలని అనుకుంటారు. ముందుగానే డబ్బు కూడబెడితే ఆ తర్వాత జెస్సి బిడ్డ కు మంచి ట్రీట్మెంట్ చేయించే అవకాశం ఉంటుంది అని జానకి ఇచ్చిన సలహాతో రామచంద్ర కూడా సరైనదే అని అనుకుంటాడు.

  ఇక తర్వాత ఆ విషయాన్ని ఎవరికీ ఇంట్లో చెప్పకూడదని లేదంటే అందరూ టెన్షన్ పడతారు అని కూడా జానకి చెబుతుంది. ఇక తర్వాత రామచంద్ర జెస్సి కి అలాగే మల్లికకు ఇద్దరికి కూడా పిల్లలు పుట్టబోతున్నారు కాబట్టి ముందుగానే వారి భవిష్యత్తు కోసం మనం ఇప్పటి నుంచే కొంత డబ్బును ఆధా చేయాలి అని తన తల్లి జ్ఞానంబకు చెబుతాడు. అందుకు జ్ఞానంబ కూడా ఒప్పుకుంటుంది.

  మల్లిక తీసిన వీడియో

  మల్లిక తీసిన వీడియో

  అయితే రామచంద్ర స్వీట్ షాప్ లో వచ్చిన నెల మొత్తం ఆదాయాన్ని కూడా తన భార్య చేతికిచ్చి వాటిని బీరువాలో పెట్టమని అంటాడు. ఆ డబ్బును ఉదయాన్నే వెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేయాలి అని కూడా చెబుతాడు. అయితే అప్పుడే మల్లిక తలుపు చాటు నుంచి వాళ్లు డబ్బు ఆదా చేస్తున్నారు అని అనుమానిస్తుంది. అలాగే రామచంద్ర జానకికి డబ్బు ఇవ్వడాన్ని తన మొబైల్ లో షూట్ చేస్తుంది. ఇక తర్వాత తన భర్త విష్ణు కి కూడా ఆ వీడియోలు చూపించి ఇన్నాళ్లు మనం మోసపోయాము అని అంటుంది.

  ఇక తర్వాత మల్లిక విష్ణు ఇద్దరు కూడా రామచంద్ర జానకిని బాధపెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు. మరోవైపు అఖిల్ కూడా వచ్చే నిజంగా మీరు చేస్తే తప్పు కాదు మేము ఏదైనా చిన్న తప్పు చేస్తే మాత్రం అది పెద్ద దానిలా కనిపిస్తుంది అని అంటూ మరింత బాధ పెడతాడు.

  వేరే కాపురం పెట్టాల్సిందే

  వేరే కాపురం పెట్టాల్సిందే

  ఇక అప్పుడే జ్ఞానంబ అసలు విషయాన్ని చెప్పాలని అనుకుంటుంది. కానీ అప్పటికే రామచంద్ర మనసు విరిగిపోతుంది. ఈ సమయంలో వారికి ఎంత చెప్పినా అర్థం కాదు అని ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయండి అని కూడా రామచంద్ర బాధపడుతూ చెప్తాడు. ఆ తర్వాత మల్లిక ఊహించని విధంగా వేరే కాపురం పెట్టాల్సిందే అని అంటుంది. ఆమె మాటలకు భర్త విష్ణు కూడా అవుననే అంటాడు. దీంతో జ్ఞానంబ పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా మరింత షాక్ కి గురవుతారు.

  అలా ఎన్నటికీ మాట్లాడకురా అంటూ రామచంద్ర అలాగే జానకి ఇద్దరు కూడా బ్రతిమాలుతా ఉంటారు. మరోవైపు అఖిల్ కూడా నేను కూడా ఎదగాలి కాబట్టి ఇంట్లో ఉంటే ఎదగలేను అని అందుకే నేను కూడా విడిపోదామని అనుకుంటున్నట్లు చెప్పడంతో రామచంద్ర మరింత భావోద్వేగానికి గురి అవుతాడు.

  ఆస్తులు మూడు వాటాలుగా

  ఆస్తులు మూడు వాటాలుగా

  ఉమ్మడి కుటుంబంలో ఉండే ఆనందం వేరు అని ఎంత నచ్చజెప్పినా కూడా వాళ్ళు వినరు. ఇక తర్వాత జ్ఞానంబ కూడా విడిపోవడమే వారికి నచ్చితే అదే చేద్దామని ముగ్గురికి మూడు వాటాలుగా ఆస్తులు పంపించడానికి ఆమె ఒప్పుకుంటుంది. ఇక తర్వాత మల్లిక తన ఆలోచనలతో అఖిల్ ను మరింత మార్చాలని అనుకుంటుంది.

  మళ్లీ అఖిల్ ఎక్కడ కలిసి ఉందాము అని అనుకుంటాడేమో అని అతని మనసును మార్చాలని అనుకుంటుంది. నువ్వు విడిపోవడమే కరెక్ట్.. అలా జరిగితే నువ్వు చదువుకొని ఆ తర్వాత మంచి జాబ్ చేసుకోవచ్చు లేదంటే వచ్చిన ఆస్తితో ఏదైనా వ్యాపారం కూడా చేసుకోవచ్చు.. అని మల్లిక సలహా ఇస్తుంది.

  అఖిల్, విష్ణు అదే నిర్ణయం

  అఖిల్, విష్ణు అదే నిర్ణయం

  ఇక మల్లిక అలా మాట్లాడుతుంటే జానకి మరింత సీరియస్ అవుతుంది. జానకి అఖిల్ కు కూడా నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అతను విడిపోవడమే కరెక్ట్ అని అంటాడు. ఇక తర్వాత విష్ణు కూడా అనవసరంగా అన్నయ్య వదినల గురించి తప్పుగా మాట్లాడాను అని అనుకుంటాడు.

  ఇక అప్పుడు రామచంద్ర వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. మరో కాపురం పెట్టడం ఎంత మాత్రం మంచిది కాదు అని మీకు నేను సపోర్ట్ గా ఉంటాను అని అంటాడు. కానీ ఆ మాటలకు పక్కనుంచి మల్లిక అవసరం లేదు అని చెబుతోంది. విష్ణు కూడా విడిపోవడమే కరెక్ట్ అని మరోసారి బలంగా చెబుతాడు.

  వారికి నచ్చినట్లుగానే

  ఇక జానకి రామచంద్ర చేసేది ఏమీ లేక మరోసారి వెళ్లి జ్ఞానంబతో మాట్లాడతారు. వాళ్లు ఏదో తెలియక అలా మాట్లాడుతున్నారు మనం అలా జరగనివ్వకూడదు అని రామచంద్ర చెబుతాడు. కానీ జ్ఞానంబ మాత్రం వాళ్లు తెలిసే మాట్లాడుతున్నారని వారికి నచ్చినట్లుగానే చేయాలి అని చెప్పడంతో రామచంద్ర గోవిందరాజులు జానకి మరింత బాధపడుతూ ఉంటారు. మరోవైపు వెన్నెల కూడా కుటుంబం విడిపోతుంది అని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతుంది. మరి ఈ తరహా మార్పులతో ఎవరు ఎటువైపు వెళతారో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 414
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X