Janaki Kalaganaledu October 21st: భార్య కోసం అమ్మను మోసం చేస్తావా.. బద్దలైన జ్ఞానాంబ మనసు!

జానకి కలగనలేదు రేటింగ్స్ అందుకోవడంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ప్రతిరోజూ సీరియల్ అభిమానుల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూనే ఉంది. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కొనసాగుతున్న జానకి కథ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతోంది. ఐపీఎస్ అవ్వాలని కలలు కనే ఒక కోడలు అత్తగారిని ఎలా దాటుకుంటూ వచ్చింది అనేది అసలు పాయింట్. భర్త సహకారంతో ముందుకు సాగుతూ ఉండగా జ్ఞానాంబకు అసలు నిజం తెలుస్తుంది. మొత్తానికి కథ మరొక కీలక మలుపు తిరిగింది. ఇక 38వ వారంలో ఈ సీరియల్ అర్బన్ ప్రాంతంలో 7.56 రేటింగ్ అందుకుంది.. 39వ వారంలో 8.26 రేటింగ్ నమోదు చేసింది. ఇక రూరల్ లో మాత్రం 38వ వారంలో 8.07 రేటింగ్ రాగా 39వ వారంలో 8.73 రేటింగ్ సాధించింది. అత్తగారి బాధ వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందని తెలుసుకున్న జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. జానకి అబద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందనే పాయింట్ కు మొత్తానికి ముగింపు కార్డ్ పడింది. ఇక ఇప్పటి నుంచి మరొక ఆసక్తికరమైన అంశంతో సీరియల్ కొనసాగనుంది. నేడు ప్రసారం కాబోయే 154వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

Recommended Video

Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
ఆ అబద్ధం కారణంగా..

ఆ అబద్ధం కారణంగా..

చదువుకోలేని కొడుకు కోసం చదువుకున్న అమ్మాయిని తీసుకురావాద్దని అనుకున్నా జ్ఞానాంబ, జానకి విషయంలో మోసపోయినట్లు తెలుసుకుంటుంది. జానకి 5వ తరగతి చదివినట్లు అబద్ధం చెబుతారు. జానకి ఇంట్లో వారు రామచంద్ర పై నమ్మకంతో డిగ్రీ చదివిన జానకిని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తారు. జానకి అన్నయ్య తన స్వార్థం కోసం అబద్ధం చెప్పి పెళ్లి చేయడంతో చివరికి జానకి జీవితం ఇరకాటంలో పడుతుంది. ఇక ఫైనల్ గా ఈ విషయం పై జ్ఞానాంబ ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. ఇన్ని రోజుల్లో తనను మోసం చేయడమే కాకుండా తన కొడుకు జీవితాన్ని కూడా ఇబ్బందుల్లో పడేశారు అని ఆమె బాధ పడుతుంది. జానకి అన్నయ్యను ఇంటికి పిలిపించి మాట్లాడుతుంది.

ముందే చెప్పినా.. మోసం చేశారు

ముందే చెప్పినా.. మోసం చేశారు

నేను పెళ్లి జరిగే ముందే ఒక నిజాన్ని చెప్పాను. నా తమ్ముడు ఎక్కువ చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అతన్ని తక్కువ చూపు చూసి ఆ అమ్మాయి చేసిన మోసం వలన నా తమ్ముడు అనవసరంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం నాకు జీవితాన్ని మొత్తం ఎంతో బాధకు గురి చేస్తూ ఉంటుంది. అప్పుడు చేసిన పొరపాటు మళ్ళీ నా కొడుకు జీవితంలో ఏ మాత్రం చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. ఆ విషయం నీతో కూడా ముందే చెప్పాను. అయినప్పటికీ జానకి డిగ్రీ చదివిన విషయాన్ని మా దగ్గర దాచిపెట్టి మోసం చేశారు అని జ్ఞానాంబ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

జానకి అలంటి తప్పు చేయదు..

జానకి అలంటి తప్పు చేయదు..


అయితే జానకి ఎన్నటికీ తప్పు చేయదు అని ఆమ్స్ అన్నయ్య చెబుతాడు. ఇన్ని రోజులలో ఏ రోజు కూడా జానకి చదువుకున్న అహంకారాన్ని మీ ముందు చూపెట్టిందా? అని ప్రశ్నిస్తాడు. అయినప్పటికీ భవిష్యత్తులో మారదు అని గ్యారెంటీ ఏమిటి అని కూడా జ్ఞానాంబ కౌంటర్ ఇస్తుంది. జానకి భర్త రామచంద్ర కూడా మధ్యలోకి వచ్చి తల్లికి అదే విషయాన్ని చెబుతాడు. నిజంగా జానకి అలాంటి తప్పు ఎన్నటికీ చేయదు. ఎందుకంటే ఆమె మీరు ఎన్ని శిక్షలు వేసిన భరించింది. తన తప్పు లేకపోయినా కూడా ఏ రోజు కూడా మీకు ఎదురు సమాధానం చెప్పలేదు. జానకి మిమ్మల్ని తల్లి తో సమానంగా ఆరాధిస్తుంది అని రామచంద్ర జ్ఞానాంబకు తెలియజేస్తాడు.

కొడుకు విషయంలో వెనక్కి తగ్గని జ్ఞానాంబ

కొడుకు విషయంలో వెనక్కి తగ్గని జ్ఞానాంబ

జానకి తప్పు చేయకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో ఆమె మారదు అని గ్యారంటీ ఇవ్వగలవా అని జ్ఞానాంబ కొడుకుని ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా నా కొడుకు ఈరోజు నా తల్లి కడుపుకోతను ఏ మాత్రం అర్థం చేసుకోవడం లేదు. అతను తన భార్య వైపు నుంచి ఆలోచిస్తున్నాడు గాని ఈ తల్లి ఎందుకు బాధ పడుతుందో అర్థం చేసుకోవడం లేదు అని జ్ఞానాంబ చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక తల్లి మాటలకు రామచంద్ర కూడా ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నాడు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను కానీ జానకి తప్పు చేయదు అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. కొడుకు విషయంలో నేను మరొకసారి తప్పు చేయలేను అంటూ జానకి నిజంగా నిజాయితీపరులు అయితే ఇంట్లో వారు అబద్ధం చెప్పినప్పటికీ నా దగ్గర తను ఎందుకు అబద్ధం చెప్పింది అని ప్రశ్నిస్తుంది.

గుండె పట్టుకున్న జ్ఞానాంబ

గుండె పట్టుకున్న జ్ఞానాంబ


ఇక వెంటనే జానకి కలుగజేసుకుని.. మిమ్మల్ని మరింత బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు. నేను నిజంగా చేసింది తప్పే. మా ఇంట్లో వాళ్ళు తప్పు చేసినప్పటికీ నేను మీ దగ్గర నిజం దాచడం కూడా తప్పు చేసినట్లే. కానీ నా జీవితంలో ఎప్పటికీ కూడా మిమ్మల్ని మోసం చేయలేదు అంటూ జానకి పెట్టి తీసుకుని బయటకు వెళ్లి పోవడానికి సిద్ధమవుతుంది. అదేసమయంలో రామచంద్ర తల్లి ముందు కూలబడి నీతో నిజం చెప్పాలని జానకి సిద్ధమైంది కానీ నేనే వద్దు అని ఒట్టు కూడా పెట్టుకున్నట్లు రామచంద్ర నిజాన్ని చెబుతాడు. ఆ నిజం తెలియడంతో జ్ఞానాంబ కూడా మరింత షాక్ అవుతుంది. నా కొడుకు నా దగ్గర అబద్ధం చెప్పాడని ఆమె ఒక్కసారిగా గుండె పట్టుకుంటుంది. ఇక ఈ పరిణామాలు జానకి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X