For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu October 21st: మల్లిక నిర్ణయానికి కుప్పకూలిపోయిన జ్ఞానాంబ.. అఖిల్ కూడా..

  |

  జానకి కలగనలేదు కథలో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఎలాగైనా రామ సహాయంతోనే ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని పెద్ద కోడలు జానకి అనుకుంటుంది. అందుకు జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక జనకికి ఇంట్లోనే మల్లిక నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. వాటిని దాటి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోనే ప్రధాన అంశం. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 415 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  కుటుంబంలో విబేధాలు

  కుటుంబంలో విబేధాలు

  జ్ఞానాంబ ఇంట్లో ఒక్కసారిగా చీలికలు ఏర్పడతాయి. చిన్న కోడలు మల్లికా చేసిన రాద్ధాంతం కారణంగా అందరూ కూడా విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జెస్సీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యం గురించి ముందస్తు జాగ్రత్తగా రామచంద్ర డబ్బులు ఆదా చేయాలని అనుకుంటాడు.

  అయితే ఆ విషయాన్ని ఇంట్లో చెబితే కంగారు పడతారు అని ఎవరికి చెప్పకుండా రామ జానకి ఇద్దరు కూడా సీక్రెట్ గా ఉంచుతారు. అయితే మల్లిక మాత్రం వాళ్ళు సొంతంగా డబ్బు దాచుకుంటున్నారు అని ఉమ్మడి కుటుంబంలో వాళ్లు స్వార్థంగా ఆలోచిస్తున్నారు అని లేనిపోని నిందలు వేస్తుంది. ఇక నిజం చెప్పలేక రామచంద్ర బాధపడతాడు.

  అఖిల్ ను మార్చేసిన మల్లిక

  అఖిల్ ను మార్చేసిన మల్లిక

  ఆ తర్వాత విడిపోవడమే కరెక్ట్ అని మల్లిక చెప్పడంతో చిన్న కుమారుడు అఖిల్ కూడా అందుకు సరే అని ఒప్పుకుంటాడు. ఇక తర్వాత అఖిల్ ఆలోచనలో పడినప్పటికీ మల్లికా అతన్ని మారుస్తుంది. నువ్వు సొంతంగా బిజినెస్ పెట్టుకుని నీకంటూ ఒక లైఫ్ ని క్రియేట్ చేసుకోవచ్చు అని కూడా తనకి సజెస్ట్ చేస్తుంది. ఇక మల్లికా అనుకున్నట్లుగానే వేరు కాపురాలు పెట్టడానికి జ్ఞానాంబ కూడా బాధతోనే ఒప్పుకుంటుంది.

  దసరా పండుగ సందర్భంగా

  దసరా పండుగ సందర్భంగా

  ఇక తర్వాత దసరా పండుగ సందర్భంగా మరుసటి రోజు అందరూ గుడికి వెళ్లాల్సింది వస్తుంది. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా గుడికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేకంగా పొంగలి తయారు చేసే నైవేద్యంగా పెట్టాలి అని అనుకుంటారు. గుడికి వెళ్లడానికి అందరూ సిద్ధమవుతున్నప్పటికీ కలిసి వెళ్లడానికి మాత్రం మల్లిక ఒప్పుకోదు.

  ఇప్పటినుంచి వేరుగా ఉంటేనే మంచిది అని ప్రత్యేకంగా సామాగ్రిని కూడా గుడికి తీసుకు వెళుతుంది. ఇక ఆటోలో వెళ్దామని భర్త విష్ణుతో చెబుతుంది. జానకి రామచంద్ర ఎంత చెప్పినప్పటికీ మల్లిక పట్టించుకోదు. ఆ తర్వాత చిన్న కుమారుడు అఖిల్ కూడా అదే తరహాలో ఆలోచిస్తాడు. కనీసం నాకు బైక్ కూడా లేదు అని అసంతృప్తితో తన భార్య జెస్సిని తీసుకుని వెళ్ళిపోతాడు.

  కృంగిపోయిన జ్ఞానాంబ

  కృంగిపోయిన జ్ఞానాంబ

  మల్లిక విష్ణు, అఖిల్ జెస్సి.. ఇద్దరూ కొడుకు కోడళ్ళు అలా వెళ్ళిపోయేసరికి జ్ఞానాంబ ఒక్కసారిగా కృంగిపోతుంది. వాళ్లు కలిస్తే బాగుంటుంది అని.. మనం ఎంతో ఆలోచించము. కానీ వాళ్ళు ఎంత స్వార్ధంగా ఆలోచించారో చూసావా అంటూ పెద్ద కొడుకు రామచంద్ర తో పెద్ద కోడలు జానకితో జ్ఞానాంబ ఏడుస్తూ మాట్లాడుతుంది. అలాగే జ్ఞానాంబ భర్త గోవిందరాజులు కూడా ఆ విషయంలో చాలా బాధపడతాడు. మొన్నటి వరకు వాళ్లు కలుస్తారేమో అని అనుకునేవాడిని కానీ ఇప్పుడు ఆశ లేకుండా పోయింది అని గోవిందరాజులు మనోవేదనకు గురి అవుతాడు.

  మరో ప్లాన్ వేసిన మల్లిక

  మరో ప్లాన్ వేసిన మల్లిక

  ఇక ఆ తర్వాత గుడికి వెళ్ళిన మల్లిక అక్కడ నీలావతి పెద్దమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమెను పిలిచి మళ్లీ ఏదో ఒక గొడవ క్రియేట్ చేయాలని అనుకుంటుంది. కానీ ఆమె రాకుండా మరొక మహిళను పంపిస్తుంది. నీలావతి ముందే చెప్పింది అని నువ్వు ఏం చేయాలో చెబితే అది చేస్తాను అని ఆమె అంటుంది. మల్లిక తన ప్లాన్ మొత్తం కూడా ఆమెతో చెబుతుంది. ఇక మల్లిక ప్రత్యేకంగా పొంగలి తయారు చేస్తున్నప్పుడు ఇప్పుడే జ్ఞానాంబతో పాటు గోవిందరాజులు మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా వస్తూ ఉంటారు. ఇక అప్పుడే మల్లికా నీలావతి పంపించిన మహిళను పిలిచి తాను చెప్పినట్లుగా చేయాలి అని అంటుంది.

  జానకి చెప్పినట్లు చెయ్యాలి

  ఇక ఆమె ఎందుకు విడిపోయారు ఏమైనా సమస్య వచ్చిందా అంటూ ఇంట్లో ఉన్న గొడవలు గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక మల్లిక ఆ విషయాన్ని చెప్పబోతుంటే జానకి అడ్డుపడి ప్రత్యేకంగా పూజ జరిగే వరకూ అయినా కాస్త ప్రశాంతంగా ఉండలేవా అని అంటుంది. అంతేకాకుండా ఆ విషయాలు అయినా మీకెందుకు అంటూ ఆ మహిళతో జానకి గట్టిగా మాట్లాడుతుంది.

  అలాగే జ్ఞానాంబ కూడా ఆ మహిళపై కోపగించుకుంటుంటే ఆ తర్వాత ఆమె సైలెంట్ గా వెనక్కి వెళ్లిపోవడంతో మల్లికా అప్సెట్ అవుతుంది. ఇక అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి తమతో కలిసి రావాలి అని జానకి చెబుతుంది. కానీ మల్లిక నేను రాను అని అనడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ జానకి చెప్పినట్లు చెయ్యాలి అని ఉంటుంది.

  ఇక మల్లికా ఏమీ అనలేక సరే అని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత మల్లిక జానకి చెప్పినట్లుగానే అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యంతో గుడిలోకి వెళతారు. మరి ఈ పూజ తరువాత తదుపరి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 415
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X