For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu October 22nd: జ్ఞానాంబ ఇచ్చిన మరొక కొత్త షాక్.. విడాకులకు సిద్దమైన జానకి!

  |

  జానకి కలగనలేదు సీరియల్ ప్రతిరోజూ అభిమానుల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూనే ఉంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కొనసాగుతున్న జానకి కథ అన్ని వర్గాల వారికి కనెక్ట్ అవుతోంది. ఎలాగైనా ఐపీఎస్ అవ్వాలని కలలు కనే ఒక కోడలు అత్తగారిని ఎలా దాటుకుంటూ వచ్చింది అనేది అసలు పాయింట్. భర్త సహకారంతో ముందుకు సాగుతూ ఉండగా జ్ఞానాంబకు అసలు నిజం తెలుస్తుంది. 39వ వారంలో ఈ సీరియల్ అర్బన్ ప్రాంతంలో 7.56 రేటింగ్ అందుకుంది.. 40వ వారంలో 8.26 రేటింగ్ నమోదు చేసింది.

  ఇక రూరల్ లో మాత్రం 38వ వారంలో 8.07 రేటింగ్ రాగా 39వ వారంలో 8.73 రేటింగ్ సాధించింది. అత్తగారి బాధ వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందని తెలుసుకున్న జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. జానకి అబద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందనే పాయింట్ కు మొత్తానికి ముగింపు కార్డ్ పడింది. ఇక ఇప్పటి నుంచి మరొక ఆసక్తికరమైన అంశంతో సీరియల్ కొనసాగనుంది. జానకిని బయటకు పంపించాలని అనుకున్న మల్లికకు మరొక షాక్ తగులుతుంది. నేడు ప్రసారం కాబోయే 155వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  అబద్ధంతో పెళ్లి చేసిన జానకి అన్నయ్య

  అబద్ధంతో పెళ్లి చేసిన జానకి అన్నయ్య

  జానకి తన చదువు కోసం అత్తగారింట్లో అన్నయ్య చెప్పిన అబద్ధాలు కొనసాగిస్తూ ఉండడం వలన జ్ఞానాంబకు అది ఏ మాత్రం నచ్చదు. జానకి అన్నయ్య తన చెల్లి ఏమాత్రం చదువుకోలేదని కేవలం ఐదవ తరగతి మాత్రమే చదువుకుంది అని అబద్ధం చెప్పి పెళ్లికి ఒప్పిస్తాడు.

  అయితే చదువు కోలేని కొడుకు కోసం ఎక్కువ చదువుకున్న అమ్మాయి వస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఆలోచించిన జ్ఞానాంబ జానకితో పెళ్లి చేయడానికి ఒప్పుకుంటుంది. కానీ చివరికి ఆమె చదివింది ఐదో తరగతి మాత్రమే కాదు డిగ్రీ పూర్తిచేసినట్లు తెలియగానే జ్ఞానాంబ ఒక్క సారిగా షాక్ అవుతుంది. అందరూ కలిసి మోసం చేశారని ఆమె బాధపడుతుంది.

  మరో నిజాన్ని చెప్పిన రామచంద్ర

  మరో నిజాన్ని చెప్పిన రామచంద్ర

  జానకి విషయంలో జ్ఞానాంబ ఎవరూ ఊహించని విధంగా నిర్ణయం తీసుకుంటుంది. ఆమెను ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు పంపించాలని అని కూడా అనుకుంటుంది. అయితే అదే సమయంలో జానకి భర్త రామచంద్ర తల్లికి మరొక నిజాన్ని చెబుతాడు అసలు జానకి చదువుకున్న విషయాన్ని మీతో ఎప్పుడూ చెప్పాలని అనుకున్నారని, కానీ అలా చెబితే నా మీద ఒట్టు వేయించుకున్నాను అని తల్లికి రామచంద్ర మరొక నిజాన్ని చెబుతాడు.

  రామచంద్ర చివరికి భార్యకు మద్దతుగా మాట్లాడతాడు. ఇక జ్ఞానాంబ కొడుకు చెప్పిన మాటలకు ఒక్కసారిగా షాక్ అవుతుంది. తన వెనకాల ఇంత మోసం జరుగుతుందా అని ఆశ్చర్యపోవడమే కాకుండా మనోవేదనకు గురవుతుంది.

  కొడుకు చేసిన మోసం

  కొడుకు చేసిన మోసం

  అంటే జానకి చదువు విషయంలో కొడుకు కూడా అబద్ధం తనను మోసం చేసినట్లు రాసి ఎంతగానో ఆవేదన చెందుతుంది. గతంలో చదువుకున్న అమ్మాయి కారణంగా తన తమ్ముడి జీవితం మంటల్లో బూడిదైన విషయాన్ని జ్ఞానాంబ గుర్తు చేసుకుంటుంది. చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేయడం వలన ఆమె అతి తెలివి వలన తమ్ముడు చనిపోయిన విషయాన్ని అందరికీ చాలా క్లారిటీగా చెబుతుంది.

  ఇక మళ్లీ అదే తప్పు కొడుకు విషయంలో జరగకూడదు అని జ్ఞానాంబ వివరణ ఇస్తుంది. ఆ విషయంలో నేను ఎప్పటికి తప్పు చేయను అని జానకి చెప్పినప్పటికీ కూడా జ్ఞానాంబ ఏమాత్రం నమ్మదు. భవిష్యత్తులో మనుషులు మారతారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది.

  భార్య కోసం తల్లికి అబద్ధం

  భార్య కోసం తల్లికి అబద్ధం

  ఇక జానకి ఈ విషయంలో కొడుకు చెప్పిన అబద్దంపై కూడా తీవ్ర ఆవేదనకు గురవుతుంది. ఇన్నేళ్ల జీవితంలో నాతో ఎప్పుడు అబద్ధం చెప్పని నా కొడుకు తన భార్య కోసం అబద్ధం చెప్పడం ఏమాత్రం నచ్చలేదు అంటూ అందరికీ ఒక షాక్ ఇస్తుంది.

  ఇక జీవితంలో మళ్ళీ మరొకసారి రామచంద్ర తనని అమ్మ అని పిలువకూడదా అనే జ్ఞానాంబ తన పై ఒట్టు వేసుకుంటుంది. మళ్లీ ఇంకో సారి తనతో మాట్లాడితే చచ్చినంత ఒట్టు అని చెప్పడంతో రామచంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోయాతాడు. తల్లి వేసిన శిక్ష కు అతను ఎంతగానో మనోవేదనకు గురవుతారు.

  Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
  విడాకుల కోసం వెళ్లిన జానకి

  విడాకుల కోసం వెళ్లిన జానకి

  దీంతో జానకి తన భర్తకు వేసిన శిక్ష పై జ్ఞానాంబ బ్రతిమాలు క్షమర్శించమని అంటుంది. ఆయన ఊపిరి పీల్చుకోకుండా ఉంటారేమో గానీ అమ్మ అనే పదం అనకుండా ఉండలేరు అని జ్ఞానాంబ ఎంతగానో బాదాపడుతుంది. మీరు నా కారణంగా రామచంద్ర గారికి శిక్ష వేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అంటూ జానకి అత్తను ప్రశ్నిస్తుంది. ఆమె ఎంత బతిమాలినా కూడా జ్ఞానాంబ మాట్లాడేందుకు ఒప్పుకోదు.

  అందరూ బయటకు వెళ్లిపోవాలని ఒక గదిలోకి వెళ్లిపోతుంది. ఇక జానకి ఈ సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఒక కఠిన నిర్ణయం తీసుకునేందుకు కూడా సిద్ధమవుతోంది.

  తన భర్తతో విడాకులు తీసుకోవాలని అనుకుంటుంది. ఎలాగైనా మళ్లీ రామచంద్ర ఇద్దరు కూడా తల్లి కొడుకులుగా మంచిగా మాట్లాడుకోవాలని జానకి ఆలోచిస్తుంది. ఇక జానకి విడాకుల విషయం గురించి అందరికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 155
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X