For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu October 24th: మల్లిక విబేధాలు.. ఫ్యామిలీని మళ్ళీ ఏకం చేసేందుకు జానకి ప్రయత్నం

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరో కీలక మలుపు తిరిగింది సరికొత్త ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి కుటుంబం లో రామ సహాయంతోనే ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని పెద్ద కోడలు జానకి అనుకుంటుంది. అందుకు జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక జనకికి ఇంట్లోనే మల్లిక నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. ఇక జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోనే ప్రధాన అంశం. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 416 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

   జ్ఞానాంబ ఫ్యామిలీలో విబేధాలు

  జ్ఞానాంబ ఫ్యామిలీలో విబేధాలు

  ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నా మల్లిక ప్రత్యేకంగా తన భర్తతో మరో కాపురం పెట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అందుకు సరైన సమయం రావడంతో ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంటుంది. అంతేకాకుండా జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ కూడా ఇంట్లో అందరూ తనపై కోపంగా ఉండడంతో బయటకు వెళ్లిపోవాలని అనుకుంటాడు. ఇక కుటుంబం విడిపోతుంది అని బాధపడుతూ జ్ఞానంభకు ఏం చేయాలో అర్థం కాదు. గోవిందరాజులు కూడా ఎంతగానో బాధపడుతుంటాడు. కానీ దానికి మాత్రం మళ్లీ కుటుంబాన్ని ఏకం చేయాలని ఆలోచిస్తుంది.

   గుడిలో కూడా

  గుడిలో కూడా

  దసరా పండుగ సందర్భంగా అందరూ కూడా కలిసి గుడికి వెళ్లాలని జానకి కోరుకుంటుంది. కానీ మల్లిక మాత్రం తన భర్త విష్ణుని తీసుకొని ప్రత్యేకంగా ఆటోలో వెళుతుంది. అలాగే అఖిల్ కూడా జెస్సితో గుడికి వెళ్ళిపోతాడు. ఆ విషయంలో కూడా జ్ఞానాంబ బాధపడుతుంది. ఇక గుడికి వెళ్ళగానే మల్లిక అక్కడ కూడా విభేదాలు చూపిస్తుంది మా ఇద్దరికీ మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయాలని పంతులుకి చెబుతుంది. దీంతో పంతులు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మల్లికా విషయం చెప్పక ముందే జానకి కలగజేసుకుని తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా ప్రత్యేకంగా పూజలు చేయాలి అనే ఆలోచనతో అలా మాట్లాడింది అని జానకి మరొక విధంగా చెబుతుంది.

   ఉమ్మడి కుటుంబం

  ఉమ్మడి కుటుంబం

  ఇక తర్వాత మల్లిక మరోసారి పంతులు గారికి తమ కుటుంబం విడిపోవాలని అనుకుంటుంది అనే విషయాన్ని చెప్పాలని అనుకున్నప్పటికీ కూడా జానకి చెప్పనివ్వదు. అదే పనిగా గంట కొడుతూ ఉంటుంది. పంతులు గారికి ఏమి వినిపించదు. పూజ ముగిసిన తర్వాత అందరూ గుడి బయటకు వెళుతుండగా ఒక కుటుంబం వారికి ఎదురు పడుతుంది. ఈ ఊరిలో మంచి ఉమ్మడి కుటుంబం అంటే మీదే అని మిమ్మల్ని చూసే మేము కూడా ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండాలని అనుకున్నాము అని వారు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా వారింట్లోని పిల్లలను కూడా జ్ఞానాంబ చేత ఆశీర్వాదం తీసుకోమని అంటారు.

  విడిపోతే జరిగే నష్టాలు

  విడిపోతే జరిగే నష్టాలు

  ఉమ్మడి కుటుంబం విడిపోతే జరిగే నష్టాల గురించి ఒకసారి చెప్పండి అని జానకి వారిని అడుగుతుంది. అంతేకాకుండా తోడికోడలు అత్తగారి మధ్యలో ఉండే ఈర్షణ వలన కలిగే నష్టాల గురించి కూడా చెప్పాలని జానకి కోరుతుంది. విడిపోతే ఎవరు కూడా మన దగ్గరికి కూడా రారు అని కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చే మనిషి పక్కన ఉండడు అని అలాగే మన పిల్లలు కూడా ప్రేమ అనురాగాల మధ్యలో పెరగరు అని ఒక విధంగా అందరూ ఉన్నా కూడా లేనట్లే అని అనిపిస్తుంది అని వాళ్ళు చెప్పడంతో జానకి సంతోషిస్తుంది. ఆ విధంగా అయినా మల్లికా అఖిల్ ఇద్దరు కూడా మారిపోయి మళ్ళీ కుటుంబంలో కలిసి ఉండాలి అని ఆలోచనకు రావాలి అని కోరుకుంటుంది.

  జానకి కోరుకున్నట్లు

  జానకి కోరుకున్నట్లు


  ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా కలిసి మాట్లాడాలని అనుకుంటారు. ముఖ్యంగా జానకి అయితే మల్లిక గురించి మాట్లాడుతుంది. మరోసారి నువ్వు విడిపోవాలని ఆలోచనకు రాకు. ఉమ్మడి కుటుంబం అంటే ఎంతో సంతోషంగా ఉంటుంది అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. అలాగే అఖిల్ కూడా ప్రేమానురాగాలకు దూరం కావొద్దు అని జానకి చెబుతుంది. ఈ విషయంలో పెద్దవారు అయినా మామయ్య గారు అందరితో ఒకసారి మాట్లాడాలి అని జానకి కోరుతుంది. అలాగే అత్తగారిని కూడా అదే విధంగా కోరుతున్నట్లు జానకి చెబుతోంది. మరి జానకి కోరిక మేరకు అత్త మామ గారు కుటుంబ సభ్యులను మళ్లీ ఏకం చేస్తారో లేదో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial October 24th Episode 416
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X