Janaki Kalaganaledu October 26th: విడాకులతో కండిషన్ పెట్టిన జానకి.. కథలో మరో షాకింగ్ ట్విస్ట్!

జానకి కలగనలేదు సీరియల్ ఇటీవల కాలంలో మంచి రేటింగ్స్ అందుకుంటున్న టాప్ సీరియల్స్ లో ఒకటిగా నిలుస్తోంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కొనసాగుతున్న జానకి కథ అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యేలా కొనసాగిస్తున్నారు. ఐపీఎస్ అవ్వాలని కలలు కనే ఒక కోడలు అత్తగారి భయాన్ని ఎలా దాటుకుంటూ వచ్చింది అనేది అసలు పాయింట్. తన భర్త సహకారంతోనే ఐపీఎస్ అవ్వాలని అనుకుంటుంది. ఇక సీరియల్ 40వ వారంలో ఈ సీరియల్ అర్బన్ ప్రాంతంలో 7.56 రేటింగ్ అందుకుంది..

ఇక రూరల్ లో మాత్రం 39వ వారంలో 8.07 రేటింగ్ రాగా 40వ వారంలో 8.73 రేటింగ్ సాధించింది. అత్తగారి భయం వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందని జానకి అర్థం చేసుకుంటుంది. ప్రస్తుతం నిజం తెలియడంతో మరొక ఆసక్తికరమైన అంశంతో ఈ సీరియల్ కొనసాగనుంది. జానకిని బయటకు పంపించాలని అనుకున్న మల్లికకు మరొక షాక్ తగులుతుంది. నేడు ప్రసారం కాబోయే 156వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మళ్ళీ అలాంటి తప్పు జరగకూడదని..

మళ్ళీ అలాంటి తప్పు జరగకూడదని..

చదువుకున్న కోడలు వస్తే అహంకారంతో కాపురం సరిగ్గా చేయలేదేమో అని ఆ తర్వాత ఆమె కారణంగా కొడుకు ప్రాణాలు కోల్పోతాడేమోనని జ్ఞానాంబ ఎంతగానో ఆందోళన చెందుతుంది. ఎందుకంటే గతంలో కూడా చదువుకున్న అమ్మాయిని తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడం వలన ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. చదువుకులేని తన తమ్ముడిని అవమానించినందుకు గాను భార్య కారణంగా అతడు ఆత్మహత్య చేసుకోవడంతో మళ్లీ అలాంటి తప్పు కొడుకు విషయంలో జరగకూడదని అనుకుంటుంది. అందుకే జానకి చదువుకున్న విషయం తెలియగానే ఒక్కసారిగా సీరియస్ అవుతుంది.

అమ్మా అంటే.. ఒట్టే..

అమ్మా అంటే.. ఒట్టే..

అయితే జానకి చదువుకున్న విషయం రామచంద్ర కూడా ముందే తెలుసు అని చెప్పడంతో తల్లి దగ్గర అబద్ధం చెప్తావా? అని జ్ఞానాంబ మరింత బాధపడుతుంది. అంతేకాకుండా రామచంద్రను మొదటిసారి ఆమె దూరం పెడుతుంది. భార్య కోసం నా కొడుకు మొదటి సారి అబద్ధం చెప్పాడు అంటూ జానకిని నిందిస్తుంది. మళ్ళీ భవిష్యత్తులో అబద్ధం చెప్తాడు అని గ్యారెంటీ ఏమిటి అని ఆవేదన చెందుతుంది. ఇక రామచంద్ర నాతో ఎప్పుడూ కూడా మాట్లాడ వద్దు అని అమ్మ అని పిలిస్తే ఒట్టు అని జ్ఞానాంబ చెబుతుంది. దీంతో రామచంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

కంగారుపడిన రామ..

కంగారుపడిన రామ..

ఇక తన కారణంగా ఇంట్లో గొడవలు రావడంతో జానకి మరొక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుందిమ్ ఎలాగైనా రామచంద్ర జ్ఞానాంబ ఇద్దరూ కూడా మాట్లాడుకోవాలి అని భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. అందులో ఆమె ఒక కండిషన్ కూడా పెడుతుంది. ఇంట్లో గొడవ జరిగిన తర్వాత జానకి బయటకు వెళ్లి పోతుంది అని తమ్ముడు వచ్చి చెప్పడంతో రామచంద్ర కంగారుపడుతూ జానకి అన్నయ్యకు ఫోన్ చేస్తాడు. అయితే మా ఇంటికి రాలేదు అని చెప్పడంతో రామచంద్ర ఆమెను వెతికేందుకు ఎందుకు బయటకి వెళ్తాడు.

లాయర్ వద్దకు జానకి..

లాయర్ వద్దకు జానకి..

అయితే జానకి మాత్రం లాయర్ దగ్గరికి వెళ్లి విడాకులకు నోటీసు ఇవ్వాలి అని చెబుతుంది. అయితే ఒకసారి ఆలోచించుకుని లాయర్ చెప్పినప్పటికీ కూడా జానకి తన పరిస్థితి గురించి పూర్తిగా వివరణ ఇస్తుంది. ఆమె మాటలకు పాజిటివ్ గా స్పందించి లాయర్ నోటీసులు ఇస్తాడు. ఇక నోటీసుపై సంతకం పెట్టడం కన్నీళ్లు పెట్టుకున్న జానకి వెంటనే ఇంటికి వెళ్లే అత్త ముందు ఆ పేపర్లను ఉంచుతుంది.

నా భర్త అంటే నాకు కూడా ఇష్టమే

నా భర్త అంటే నాకు కూడా ఇష్టమే

జానకి విడాకులకు సిద్ధమైనట్లు తెలియగానే గోవిందరాజులు కూడా షాక్ అవుతాడు. కాపురంలో ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. దానికి ఈ తరహా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. వెంటనే ఆ విడాకుల పేపర్లను చించేసి చెత్తకుప్పలో పడేయాలని గట్టిగా చెప్పడంతో జానకి ఒక్క నిమిషం అంటూ.. అత్త ముందు ఒక కండిషన్ కూడా పెడుతుంది.

ఈ పని చేస్తున్నందుకు నన్ను క్షమించండి అంటూ.. నా చదువు కారణంగా భవిష్యత్తులో అహం పెరుగుతుందని ఆ కారణంగా మీ అబ్బాయి గారు భవిష్యత్తు అంధకారంలో పడుతుందని భయపడుతున్నారు. అందుకు మీ తమ్ముడు గారి గతం కూడా ఒక కారణం.. అయితే మీరు మీ కొడుకుని ఎంతగా ప్రేమిస్తారో నా భర్త అంటే కూడా నాకు కూడా అంత ఇష్టం అని జానకి చెబుతుంది.

Recommended Video

Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
కండిషన్ పెట్టిన జానకి

కండిషన్ పెట్టిన జానకి

అయితే భవిష్యత్తులో తన భర్త పై ఎప్పటికీ అలాంటి ఆహారాన్ని చూపించను అని నమ్మించడానికి నాకు ఇంతకంటే మరొక దారి కనిపించడం లేదు అంటూ.. ఊరి శిక్ష వేసే వ్యక్తికి కూడా ఒక చివరి కోరిక ఉంటుంది అదే తరహాలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు మంచి కోడలిగా నా భర్తకు తగిన భార్య గా గుర్తింపును అందుకుంటాను. భవిష్యత్తులో నేను ఎప్పుడైనా సరే నా భర్తను కాదని అహం చూపించినా, అవమానించినట్లు తెలిసిన ఈ విడాకుల అంగీకరించి నా భర్త దగ్గర నుంచి ఇంట్లో నుంచి నన్ను పంపించేయండి అంటూ జానకి జ్ఞానాంబకు కండిషన్ పెడుతోంది.

అయితే జానకి అలా ఎందుకు చేసింది అర్థం కాక మల్లిక ఎంతగానో కన్ఫ్యూజ్ అవుతుంది. జానకి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలి అనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చారు ఏమిటి అని తల బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది. ఇక జానకి కండిషన్ అనంతరం ఇంట్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X