For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu October 26th: జానకిపై రామ ముద్దుల వర్షం.. మరోసారి రిస్క్ లో పడిన మల్లిక

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారింది. ఊరందరికి ప్రేరణగా నిలిచే జ్ఞానాంబ కుటుంబంలో ఒక్కసారిగా విబేధాలయ్యాయి. ఇక రామ సహాయంతోనే ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని పెద్ద కోడలు జానకి అనుకుంటుంది. అందుకు అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక జనకికి ఇంట్లోనే మల్లిక నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి.

  మరి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోని ప్రధాన అంశం. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 418 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  ఏమాత్రం ఇష్టం లేదు

  ఏమాత్రం ఇష్టం లేదు

  జ్ఞానాంబ రెండవ కోడలు మల్లిక ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయి వేరే కాపురం పెట్టాలని అనుకుంటుంది. సిటీలో ఉంటూ అక్కడే హ్యాపీగా బ్రతకాలి అని కూడా భర్తకు ఎన్నోసార్లు చెబుతుంది. భర్త విష్ణు కొన్నిసార్లు ఒప్పుకోకపోయినప్పటికీ ఇటీవల ఇంట్లో జరిగిన పరిస్థితుల కారణంగా అతను కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. జానకి రామచంద్ర ఇద్దరు కూడా ప్రత్యేకంగా బ్యాంకులో డబ్బు ఆదా చేసుకుంటున్నారని చెప్పిన మల్లిక మేము మాత్రం ఇంట్లో ఎలా ఉండాలి అని ఉండడానికి ఏమాత్రం ఇష్టం లేదు అని మల్లిక బయటకు వెళ్లి పోవాలని అనుకుంటుంది. అలాగే జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ కూడా బయటకు వెళ్లిపోవాలని అనుకుంటాడు.

  తప్పు తెలుసుకున్న అఖిల్

  తప్పు తెలుసుకున్న అఖిల్

  అయితే హఠాత్తుగా ఒకరోజు అఖిల్ కు కడుపులో నొప్పి వస్తుంది. ఇక ఏం చేయాలో తెలియక జెస్సి జానకి రామచంద్ర గదికి వెళ్లి వాళ్లకు చెబుతుంది. ఇక జానకి అఖిల్ పరిస్థితి గురించి తెలుసుకొని అతనికి ధైర్యం చెప్పి జీలకర్ర మజ్జిగ కలిపి ఇస్తుంది. దాంతో అఖిల్ కు అప్పుడే కడుపు నొప్పి తగ్గుతుంది. నలుగురు ఉంటే ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటుంది అని ఉమ్మడి కుటుంబంలో సంతోషం మాత్రమే కాకుండా ఎంతో ధైర్యం కూడా ఉంటుంది అని అఖిల్ భార్య జెస్సి కూడా చెబుతుంది. అఖిల్ తన తప్పులు తెలుసుకొని మళ్లీ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటాడు. కానీ రామచంద్ర మాత్రం మళ్లీ కలిసే ఆలోచనలో ఉండకపోవచ్చు అని అంటాడు.

   వారి స్వార్థం కోసం

  వారి స్వార్థం కోసం

  ఇక జ్ఞానాంబ అందరిని కూడా ఒకసారి హాల్లోకి రమ్మని చెబుతారు. అందరితోనూ ప్రత్యేకంగా మాట్లాడాలని కూడా ఆమె అనుకుంటారు. కొందరు వారి స్వార్థం కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. అయినా ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ విడిపోతే కొన్ని నష్టాలు కూడా ఎదురవుతాయి. ఆ తర్వాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు కూడా కడుపుతో ఉన్నారు కాబట్టి వారి భవిష్యత్తు కోసం జానకి ఇచ్చిన సలహా మేరకు కొన్ని రోజులు సమయం ఇవ్వబోతున్నట్లుగా జ్ఞానాంబ మాట్లాడుతుంది.

  మార్పులు రాకపోతే..

  మార్పులు రాకపోతే..

  జానకి చెప్పిన గడువులోగా ఈ ఇంట్లో ఎవరిలో కూడా మార్పులు రాకపోతే ఆ తర్వాత వారి ఇష్టపూర్వకంగానే ఆస్తిలో వాటాలు తీసుకుని వెళ్లిపోవచ్చు అని జ్ఞానాంబ చెబుతోంది. ఇప్పుడైతే అందరూ కలిసి ఉండాలి అని జ్ఞానాంబ చెప్పడంతో సంతోషిస్తారు. ముఖ్యంగా జానకి రామచంద్ర ఎంతగానో ఆనందపడతారు. కానీ మరోవైపు మల్లిక మాత్రం చేతి వరకు వచ్చిన అవకాశం చేజారిపోయింది అని బాధపడుతూ ఉంటుంది.

  ఇన్ని రోజులు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకున్న ఆలోచన ఒక్కసారిగా రివర్స్ కావడంతో మల్లిక ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఇక తర్వాత మల్లిక పరిస్థితిని చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. మల్లిక కోపం తెప్పించేలా పాటలు కూడా పాడుతూ ఉంటారు.

  జానకి పై రామ ముద్దుల వర్షం

  జానకి పై రామ ముద్దుల వర్షం

  ఇక కుటుంబం మొత్తం కూడా కలుస్తుంది అనే ఆనందంలో రామచంద్ర ఎంతగానో సంతోషిస్తాడు. దీనికి కారణం జానకి అని ఆమెను ఎంతగానో పొగుడుతాడు. అంతేకాకుండా ప్రత్యేకంగా జానకికి ఒక ముద్దు కూడా పెట్టాలని అనుకుంటాడు. ఆ తర్వాత రామచంద్ర ముద్దు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారిగా సిగ్గుతో వెనుకడుగు వేస్తాడు.

   మల్లిక ప్రెగ్నెన్సీపై అనుమానం

  మల్లిక ప్రెగ్నెన్సీపై అనుమానం

  ఇక అప్పుడే పనిమనిషి చికిత్త వచ్చి జెస్సి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా చెబుతుంది. దీంతో వెంటనే జానకి వెళ్లే జెస్సి పరిస్థితిని గమనిస్తుంది. ఇక తర్వాత డాక్టర్ కు కూడా ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే కడుపుతో ఉంది కాబట్టి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కొద్దిసేపటి తర్వాత జెస్సి మళ్లీ కొలుకుంటుంది. అయితే అదే సమయంలో డాక్టర్ వచ్చినప్పుడు తనను కూడా చెక్ చేస్తే దొంగ ప్రెగ్నెన్సీ విషయం బయటపడుతుందేమో అని మల్లిక భయపడుతుంది. ఇక తర్వాత డాక్టర్ రాకముందే అక్కడ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. ఇక డాక్టర్ రాగానే మల్లికా ఒక చెట్టు ఎక్కి కూర్చుంటుంది. కానీ జానకి మల్లిక పరిస్థితిని చూసి అనుమానిస్తుంది. మరి మల్లిక దొంగ ప్రెగ్నెన్సీ విషయం బయటపడుతుందో లేదో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 418
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X