Janaki Kalaganaledu October 27th: జానకికి మళ్లీ అవమానం.. జ్ఞానాంబకు ఎదురుదెబ్బ

తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న జానకి కలగనలేదు సీరియల్‌లో తల్లి జ్ఞానాంబ, కొడుకు రామచంద్ర మధ్య ఎడబాటు అంశం ఎమోషనల్‌గా సాగుతూ కనిపించింది. మరో పక్క మల్లిక తన నాటకాలకు మరింత పదును పెట్టింది. జానకిపై జ్ఞానాంబ కోపం మరింత పెరిగేందుకు పొగ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇంటి సభ్యుల మధ్య ప్రేమకు బదులు మౌనం రాజ్యమేలుతున్నది. అక్టోబర్ 27న ప్రసారమైన 158 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

అమ్మకు సేవ చేయకుండా ఉండగలనా?

అమ్మకు సేవ చేయకుండా ఉండగలనా?

తల్లి జ్ఞానాంబ రోజు నిద్రించే సమయంలో కాళ్లు పట్టడం చిన్నతనం నుంచి రామచంద్రకు అలవాటు కావడం తెలిసిందే. అయితే జానకి తనతో అబద్దం ఆడిందనే కోపంతో, తాను చదివింది 5వ తరగతి కాదు డిగ్రీ అనే విషయం తెలియడంతో జ్ఞానాంబ తనకు తాను శిక్ష విధించుకొన్నది. తమతో మాట్లాడకుండా మౌనంగా ఉండటం జానకి, రామచంద్ర బాధలో మునిగిపోయారు. చిన్నతనం నుంచి ప్రతీ రోజు అమ్మకు కాళ్లుపట్టే వాడిని. ఇప్పుడు తన కాళ్లు పట్టకూడదని అమ్మ చెప్పింది. అమ్మకు సేవ చేసుకోకుకుండా నేను ఎలా ఉండగలను అంటూ జానకితో రామచంద్ర చెప్పుకొని బాధపడ్డారు.

జానకిని అవమానించేలా మల్లిక

జానకిని అవమానించేలా మల్లిక

తెల్లవారు జామున జానకి ఇంటి ముందు ముగ్గు వేస్తుండటం చూసి మల్లిక కుమిలిపోయింది. ఇంటి ముందు ముగ్గు వేయకుండా చేయాలని ప్లాన్ వేసింది. అత్త జ్ఞానాంబకు మరింత జానకి, రామచంద్ర దూరం చేయాలని ప్లాన్ వేసింది. ఇలా నువ్వు ఇంటి ముందు ముగ్గు వేస్తే అత్త చూసి సహించలేదు. నిన్ను తిట్టి ఇంటి నుంచి కూడా బయటకు పంపించడానికి వెనుకాడదు. నీవు ముగ్గు వేయకు. నేను వేస్తానంటూ జానకి చేతిలోని ముగ్గు గిన్నెను లాగేసుకొన్నది.

అత్తారిల్లు అంటే జానకికి

అత్తారిల్లు అంటే జానకికి

జానకిని జ్ఞానాంబకు దూరం చేస్తా. అత్త అంటే భరించలేని విధంగా ఫీలింగ్ తెప్పిస్తా. అత్తగారి ఇల్లంటే నరకం అనే విధంగా జానకిని మార్చేస్తా. అలా జ్ఞానాంబకు, జానకికి మధ్య అగాథం ఏర్పడేలా ప్లాన్ చేస్తా అని తన మనసులో మల్లిక అనుకొంటూ ముగ్గు వేస్తూ ఆనందంలో మునిగిపోయింది. ఇక తన అత్తంటే పడని పొరుగింటి ఆవిడకు చాడీలు చెప్పింది. చదువుకోని అమ్మాయిని రామచంద్రకు పెళ్లి చేస్తానని శపథం చేసింది. కానీ ఇప్పుడు జానకి డిగ్రీ చదివిందనే విషయం బయటకు వచ్చింది. నా బిడ్డను రామచంద్రకు ఇవ్వడానికి నిరాకరించింది అనే విషయాన్ని ఆమెతో మల్లిక గుర్తు చేసింది. మా అత్తను నిలదీయండి అంటూ మల్లిక పొగపెట్టింది.

ఇంటి సభ్యులపై గోవిందరాజు ఆగ్రహం

ఇంటి సభ్యులపై గోవిందరాజు ఆగ్రహం

ఇదిలా ఉండగా, ఇంటిలో ఒకరికొకరు మాట్లాడకోకుండా ఉండటంపై గోవిందరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఏం జరుగుతున్నది. ఇప్పటివరకు ఇళ్లంత ప్రేమతో కళగా ఉండేది. ఇప్పుడు ఒక్కొక్కరు ముఖాల్లో ఆనందం కనిపించడం లేదు అంటూ ఆయన కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలో కట్టెలు కొడుతున్న రామచంద్ర చేతికి గాయమై రక్తం కారుతుండటంతో జ్ఞానాంబ పట్టించుకోకపోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. గతంలో దెబ్బ తగిలితే.. విలవిలలాడే జ్ఞానాంబ ప్రస్తుతం తనను పట్టించుకోకపోవడంతో రామచంద్ర మరింత కన్నీరు పెట్టుకొన్నారు.

తాజా ప్రోమోలో ట్విస్టు ఇలా..

తాజా ప్రోమోలో ట్విస్టు ఇలా..

ఇక జ్ఞానాంబను పొరిగింటి ఆవిడ కడిగిపడేసింది. ఊర్లోని మహిళలపై తలదించుకోలేని జ్ఞానాంబ ఆవిడ చెప్పిన విషయాలతో మరింత కుంగిపోయినట్టు కనిపించింది. ఐదో తరగతి చదివిన కోడలను తెస్తానని చెప్పిన జ్ఞానాంబకు.. ఇప్పుడు కోడలు డిగ్రీ చదివిందనే విషయం తెలిసిందా అంటూ తాజా ప్రోమోలో ఆమె దెప్పి పొడవడం కనిపించింది. ఈ విషయం రాబోయ్యే రోజుల్లో సీరియల్‌లో ట్విస్టుగా మారే అవకాశం కనిపిస్తున్నది.

Recommended Video

Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
జానకి కలగనలేదు సీరియల్ రేటింగ్

జానకి కలగనలేదు సీరియల్ రేటింగ్

జానకి కలగనలేదు సీరియల్ మంచి రేటింగ్‌తో సాగుతున్నది. 40వ వారంలో అర్బన్‌ ప్రాంతంలో 7.28 రేటింగ్‌ను, 41వ వారంలో 7.31 రేటింగ్‌ సొంతం చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతంలో 40వ వారంలో 8.12 రేటింగ్, 41వ వారంలో 8.36 రేటింగ్‌ను నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X