Janaki Kalaganaledu October 27th: తెలివిగా మల్లిక నిజస్వరూపం తెలుసుకున్న జానకి.. షాకింగ్ ట్విస్ట్
జానకి కలగనలేదు సీరియల్ ఊహించని కథనంలో ఎంతో ఆసక్తికరంగా మారింది. అందరికి ఎంతో ప్రేరణగా నిలిచే జ్ఞానాంబ కుటుంబంలో ఒక్కసారిగా విబేధాలు వస్తాయి. ఇక కుటుంబం విడివైపోయే పరిస్థితికి వస్తుంది. భర్త రామ సహాయంతోనే ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని పెద్ద కోడలు జానకి అనుకుంటుంది. అందుకు అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక జనకికి ఇంట్లోనే మల్లిక నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. మరి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోని ప్రధాన అంశం. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 420 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని
జానకి పడుతున్న తాపత్రయం చూసి జ్ఞానాంబ ఎంతగానో సంతోషపడుతుంది. అయితే మల్లికా మాత్రం ఎలాగైనా మరో అవకాశం దొరికితే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని ఆలోచిస్తుంది. అయితే మల్లికా గర్భవతి అని చెప్పింది కానీ అది నిజమో కాదో అనే జానకి అనుమానిస్తుంది. కావాలని అబద్ధం చెప్పిందా అని తెలుసుకోవడానికి జానకి ఎంతగానో ఆలోచిస్తుంది. అయితే మరోవైపు జ్ఞానాంబ మాత్రం మల్లిక తల్లి కాబోతోంది అని ఎంతో సంతోషంగా ఉంటుంది. వారి కోసం ప్రత్యేకంగా వంటకాలు కూడా రెడీ చేస్తుంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అని జ్ఞానాంబ వారి కోసం కూడా ప్రత్యేకంగా సున్నుండలు రెడీ చేస్తుంది.

జెస్సి సంతోషం
అయితే ఇక జానకి సున్నుండలు ఇచ్చే క్రమంలో జెస్సీ దగ్గరికి వెళుతుంది. అప్పుడు జెస్సి తన ఫోన్లో చిన్న పిల్లల ఫోటోలు చూస్తూ ఎంతో సంతోషంగా ఉంటుంది. అప్పుడు జానకి ఆమెను చూసి కొంత జాలి పడుతుంది. ఎందుకంటే జెస్సి కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఎదుగుదల సరిగ్గా లేదు అని డాక్టర్లు చెబుతారు. కానీ ఆ విషయాన్ని జానకి ఎవరికీ చెప్పదు. మళ్లీ అందరు టెన్షన్ పడతారు అని భవిష్యత్తులో మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని అనుకుంటుంది.

మల్లిక ప్రెగ్నెన్సీ పై డౌట్స్
ఇక మరోవైపు మల్లిక దగ్గరకు వెళ్లే క్రమంలో జానకి ఆమెది అసలు నిజమైన ప్రెగ్నెన్సీనా కాదా అనే విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటుంది. అందుకోసం ఒక టాబ్లెట్ తీసుకువెళ్తుంది. ఈ టాబ్లెట్ వేసుకుంటే పుట్టబోయే బిడ్డకు చాలా మంచిది అని జానకి కావాలని అబద్ధం చెప్తుంది. కానీ మల్లికా మాత్రం ఆ టాబ్లెట్ వేసుకోవడానికి వెనుకడుగు వేస్తుంది. తర్వాత వేసుకుంటాను అని చెప్పి దాన్ని పక్కన పడేస్తుంది. అది గమనించిన జానకి మళ్ళీ అనుమానం వ్యక్తం చేస్తుంది.

ఆమె నుంచి నిజం తెలుసుకోవాలని..
ఆ తర్వాత చదువుకుంటూనే మల్లిక గురించి ఆలోచిస్తుంది. ఎలాగైనా ఆ విషయాన్ని ఆధారంతో తెలుసుకోవాలా అని అనుకుంటుంది. అందుకోసం రామచంద్ర కూడా ఆమెకు ఒక సలహా వచ్చేలా చేస్తాడు. జానకి మాత్రం మల్లిక గర్భం గురించి రామచంద్ర ఏమి చెప్పదు. ఆ తర్వాత జానకి మల్లిక ప్రవర్తించిన తీరును గురించి ఆలోచిస్తుంది. మొదటినుంచి ఆమె ఎలా ప్రవర్తించింది అనే విషయం కూడా ఆలోచిస్తుంది. అయితే మొదట మల్లిక గర్భవతి అని చెప్పింది ఇంటి పక్కనే ఉన్న నీలావతి అని తెలియడంతో ముందు ఆమె ద్వారా నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక ఉదయాన్నే లీలావతికి ఫోన్ చేసిన జానకి వెంటనే మా ఇంటికి రావాలి అని జానకి చెబుతుంది.

మల్లిక చెంపపై కొట్టిన జానకి
ఇక జానకి అలా అనడంతో నీలావతి కొంత టెన్షన్ పడుతుంది. ఎందుకు జానకి ఇంత ఉదయాన్నే ఫోన్ చేసింది అని ఆశ్చర్య పోతుంది. బహుశా నేను మల్లిక గర్భవతి అనే అబద్ధం చెప్పిన విషయం ఆమెకు తెలిసిపోయిందా అని అంటుంది. అసలే అమెది పోలీస్ బుర్ర ఏమైనా తేడా వస్తే నేను పోలీస్ స్టేషన్లో పడతానేమో అని డైరెక్ట్ గా జానకితో నిజం చెప్పాలని అనుకుంటుంది. ఇదంతా మల్లికే చేసింది అని చెప్పాలని కూడా ఆలోచిస్తుంది. కానీ మల్లికా వెంటనే ఆమెకు అడ్డుపడుతుంది. ఇక తర్వాత ఏదో ఒకటి సర్ది చెప్పి మల్లిక నీలావతిని ఇంటి నుంచి పంపించేస్తుంది. కానీ జానకి మాత్రం నిజం తెలుసుకొని మల్లికా చెంప పగలగొడుతుంది. మరి ఈ పరిణామాల తరువాత మల్లిక అబద్దాలను జానకి ఇంట్లో ఎలా నిరూపిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











