For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu October 27th: చెట్టు ఎక్కి ఇబ్బందుల్లో పడిన మల్లిక.. ప్రెగ్నెన్సీ పై జానకి అనుమానం!

  |

  జానకి కలగనలేదు సీరియల్ సరికొత్త ట్విస్ట్ లతో మరింత ఆసక్తికరంగా మారింది. అందరికి ఎంతో ప్రేరణగా నిలిచే జ్ఞానాంబ కుటుంబంలో ఒక్కసారిగా విబేధాలు వస్తాయి. ఇక కుటుంబం విడివైపోయే పరిస్థితికి వస్తుంది. భర్త రామ సహాయంతోనే ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని పెద్ద కోడలు జానకి అనుకుంటుంది. అందుకు అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక జనకికి ఇంట్లోనే మల్లిక నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. మరి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోని ప్రధాన అంశం. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 419 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  తప్పించుకోవాలని మల్లిక ప్లాన్

  తప్పించుకోవాలని మల్లిక ప్లాన్

  హఠాత్తుగా జ్ఞానాంబ చిన్న కోడలు కళ్ళు తిరిగి కిందపడిపోవడంతో ఇంట్లో అందరూ కూడా భయపడిపోతారు. అసలే ఆమె ప్రేగ్నెన్సీ తో ఉండడంతో ఎందుకు ఇలా జరిగింది అని ఆందోళనలో ఉండగా జానకి డాక్టర్ కు ఫోన్ చేస్తుంది. అయితే డాక్టర్ వస్తే తన దొంగ ప్రెగ్నెన్సీ బయటపడుతుందేమో అని మరోవైపు మల్లిక అక్కడి నుంచి బయటపడాలని అనుకుంటుంది. డాక్టర్ వెళ్లిపోయే వరకు వేరే కంట కనిపించకుండా ఉండాలి అని అనుకుంటూ మల్లిక బయటకు వెళుతూ ఉంటుంది. అయితే బయటకు వెళ్లే క్రమంలో అప్పుడే రామచంద్ర డాక్టర్ ను తీసుకొని వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు మల్లిక కానీ అడగడంతో ఆమె డాక్టర్ కోసం ఎదురుచూస్తున్నాను అని చెబుతుంది.

   పొరబడిన డాక్టర్

  పొరబడిన డాక్టర్

  ఇక తర్వాత డాక్టర్ ఇంట్లోకి వచ్చి జెస్సిని పరీక్షిస్తుంది. మొన్ననే కదా ఆమె ఆరోగ్యం పరిస్థితి బాగోలేదని జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పాను అని జానకికి చెబుతుంది. అయితే జానకి గతంలో జెస్సిని హాస్పిటల్ కు తీసుకువెళ్లిన విషయాన్ని ఇంట్లో చెప్పదు. జెస్సికి పుట్టబోయే బిడ్డకు కొత్త ప్రమాదం ఉంది అని.. అందుకే ఆ విషయాన్ని ఇంట్లో చెప్పకూడదు అని జానకి అనుకుంటుంది. ఇక డాక్టర్ ని కూడా మా అత్తగారికి చెప్పకూడదు అని ముందే మాట తీసుకుంటుంది. అయితే తొందరపాటులో డాక్టర్ మొన్ననే చెప్పారు కదా అని అనడంతో మల్లికా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇక మళ్ళీ వెంటనే డాక్టర్ జానకి పరిస్థితిని అర్థం చేసుకొని మరొక పేషెంట్ పేరు కూడా జెస్సీ కావడంతో పొరపాటు పడ్డాను అని సమాధానం చెబుతుంది.

  అందుకే జెస్సికి ఇలా జరిగింది

  అందుకే జెస్సికి ఇలా జరిగింది

  ఇక తర్వాత మల్లిక మళ్ళీ తన ప్రెగ్నెన్సీ గురించి అడగకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని బయటికి వెళ్లి ఒక చెట్టు ఎక్కి కూర్చుంటుంది. ఇక్కడ అయితే ఎవరూ రారు అని డాక్టర్ వెళ్లిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్లాలి అని డిసైడ్ అవుతుంది. ఇక డాక్టర్ జెస్సిని పరీక్షించిన తర్వాత ఆమె సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లనే ఇలా జరిగింది అని ఇప్పటినుంచి ఆమెకు పండ్ల రసాలు అలాగే మంచి పోషక పదార్థాలను ఇవ్వాలి అని కుటుంబ సభ్యులకు తెలియజేస్తుంది.

  చెట్టు ఎక్కి కూర్చున్న మల్లిక

  చెట్టు ఎక్కి కూర్చున్న మల్లిక

  ఇక తర్వాత జానకి మా ఇంట్లో మరొకరు కూడా ప్రెగ్నెన్సీ తో ఉన్నారు అని తనకు కూడా చెక్ చేయాలని అడుగుతుంది. ఇక మల్లికా కోసం అందరూ పక్కకు చూస్తూ ఉండగా ఆమె కనిపించదు. ఇక ఎక్కడికి వెళ్ళింది అని అందరూ అడుగుతూ ఉంటారు. వెంటనే వెళ్లి చూడాలి అని భర్త విష్ణుకి అలాగే పనిమనిషి చికితకు జ్ఞానాంబ చెబుతుంది. కానీ మల్లిక చెట్టు ఎక్కి కూర్చోవడంతో ఎవరు కూడా ఆమెను గమనించరు. ఇక ఆ తర్వాత మల్లిక కిందకు దిగాలి అని అనుకుంటుంది. కానీ అప్పుడే బయటకు వచ్చిన గోవిందరాజులు చెట్టు దగ్గర ఎవరో నిచ్చన పెట్టారు అని దాన్ని అక్కడి నుంచి తీసేసి మరొకచోట పెడతాడు.

  చప్పుడు చేయకుండా

  చప్పుడు చేయకుండా


  ఇక తర్వాత మల్లిక చప్పుడు చేయకుండా చెట్టుమీద దాక్కుని ఉంటుంది. కానీ కిందకు ఎలా దిగాలో అర్థం కాదు. ఇక అప్పుడే కాస్త దూరంలో కూర్చుని ఉన్న జానకినీ మల్లిక గమనిస్తుంది. మళ్ళీ తనను ఎక్కడ చూస్తారో అని మెల్లగా చెట్టు దిగాలని అనుకుంటుంది. ఇక ఆ క్రమంలో కిందకు దిగబోయే సమయంలో మల్లిక గట్టిగా అరుస్తుంది. ఇక అరుపులను గమనించిన జానకి వెంటనే పక్కనే ఉన్న నిచ్చనను తీసుకొచ్చి మల్లికా చెట్టు దిగేలా చేస్తుంది.

   మల్లిక గుట్టు బయటపెట్టాలని..

  మల్లిక గుట్టు బయటపెట్టాలని..

  ఇక తర్వాత చెట్టు ఎందుకు ఎక్కవు అని జానకి అడుగుతుంది. కానీ మల్లిక మాత్రం సరైన సమాధానం చెప్పకుండా వేపాకు జ్యూస్ కోసం ఆకులు తెంపడానికి వెళ్లాను అని ఉంటుంది నీకు వేపాకు జ్యూస్ అంటే ఇష్టం ఉండదు కదా అయినా ఎవరికో ఒకరికి చెప్పాల్సి ఉండేది. అలాంటిది నువ్వు ఎందుకు చెట్టు ఎక్కావు అని జానకి ప్రశ్నిస్తుంది. ఇక జానకి తరచుగా ప్రశ్నలు అడుగుతూ ఉండడంతో సమాధానం చెప్పలేక నాకు దాహంగా ఉంది వెళ్లి నీళ్లు తాగి వస్తాను అని మల్లికా అంటుంది. అసలు నిజంగా మల్లికా గర్భవతి అయ్యిందా లేదంటే కావాలని నాటకం ఆడుతుందా అని జానకి అనుమానిస్తుంది. అందుకోసం జానకి, నీలావతినీ రంగంలోకి తెస్తుంది. మరి జానకి ప్లాన్ తో మల్లికా గుట్టు బయట పడుతుందో లేదో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial October 27th Episode 418
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X