Janaki Kalaganaledu October 28th: ముదురుతున్న గొడవలు.. మల్లికపై జానకి ఎదురుదాడి!

జానకి కలగనలేదు సీరియల్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు జానకి రామ ఎమోషనల్ లవ్ స్టొరీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఐపీఎస్ అవ్వాలని జానకి భర్త సహకారాన్ని తీసుకుంటుంది. అత్తగారికి తెలియకుండా ఐపీఎస్ అవ్వాలని కలలు కంటుంది. జానకి కేవలం 5వ తరగతి మాత్రమే చదువుకున్నట్లు అనుకున్న జ్ఞానాంబకు ఆమె డిగ్రీ చదివినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతుంది. ఇక జానకి, రామ ఇద్దరు కూడా అబద్దాలు చెప్పారని తెలియగానే వారితో మాట్లాడడం మనేస్తుంది. అంతే కాకుండా జానకి మరొక విడాకుల కండిషన్ పెట్టడంతో కథ సరికొత్త మలుపు తిరుగుతుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ 40వ వారంలో అర్బన్ ప్రాంతంలో 7.56 రేటింగ్ అందుకుంది.. ఇక రూరల్ లో మాత్రం 39వ వారంలో 8.07 రేటింగ్ రాగా 40వ వారంలో 8.73 రేటింగ్ సాధించింది. అత్తగారి భయం వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందని జానకి అర్థం చేసుకుంటుంది. ప్రస్తుతం నిజం తెలియడంతో మరొక ఆసక్తికరమైన అంశంతో ఈ సీరియల్ కొనసాగనుంది. జానకిని బయటకు పంపించాలని అనుకున్న మల్లికకు మరొక షాక్ తగులుతుంది. నేడు ప్రసారం కాబోయే 159వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 మోసం చేశారని తెలియడంతో

మోసం చేశారని తెలియడంతో

తమ్ముడు ఎక్కువగా చదువుకున్న అమ్మాయి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని జ్ఞానాంబ తన కొడుకు విషయంలో అలాంటి పొరపాటు జరగకూడదని జాగ్రత్త పడుతుంది. అందుకే కేవలం 5వ తరగతి మాత్రమే చదువుకున్న జానకిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. కానీ జానకి ఐదో తరగతి చదువుకోలేదని ఆమె డిగ్రీ పూర్తి చేసింది అని తెలియగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా కొడుకు కూడా నిజం తెలిసిన తరువాత తనకు అబద్ధం చెప్పాడు అని ఆమె అతనితో మాట్లాడకుండా ఉంటుంది. ఈ క్రమంలో జానకి ఎంతగానో మనోవేదనకు గురి అవుతుంది.

 కొడుకు కోడలిని దూరం పెట్టిన జ్ఞానాంబ

కొడుకు కోడలిని దూరం పెట్టిన జ్ఞానాంబ

రామచంద్ర ఎంత బతిమాలినా కూడా జ్ఞానాంబ మాత్రం అతనితో మాట్లాడదు. ప్రతి రోజు కూడా తల్లి కాళ్లు పట్టనిదే నిద్రపోని రామ అలాంటిది మరింత దూరం పెడుతుంది. ఈ విషయంలోనూ తనతో మాట్లాడకూడదు అని అమ్మ పిలవకూడదు అని కూడా పొత్తు పెట్టుకుంటుంది. అయినా కూడా రామచంద్ర ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తల్లికి దగ్గరవ్వాలని చూస్తాడు. మరో వైపు జానకి కూడా తల్లి కొడుకులు తన కారణంగా విడిపోయారు అని మనో వేదనకు గురి అవుతుంది. అయితే జానకి బాధను జ్ఞానంభ ఏమాత్రం పట్టించుకోదు.

 స్వీట్ షాప్ పై కన్నేసిన మల్లిక

స్వీట్ షాప్ పై కన్నేసిన మల్లిక

రామ జ్ఞానాంబ మధ్యలో దూరం పెరగడంతో సమయాన్ని చూసి వారి నుంచి స్వీట్ షాప్ ను కూడా తన లాక్కోవలని మల్లిక ప్లాన్ చేసుకుంటుంది. భర్తను అత్త దగ్గరికి తీసుకువెళ్లి మరో ఆలోచనను కలుగజేస్తుంది. ప్రస్తుతం రామచంద్ర స్వీట్ షాప్ సరిగా చూసుకోవడం లేదని మరికొన్ని రోజులు ఇలానే కొనసాగితే మీ పేరుమీద ఉన్న స్వీట్ షాప్ స్థాయి ఒక్కసారిగా పడిపోతుంది అని చెబుతుంది. ఆ భయంతోనే దాని అధికారాన్ని మా వారికి అప్పగిస్తే బాగా చూసుకుంటారు అని సలహా ఇస్తుంది. కానీ మల్లిక వేసిన ప్రణాళికలకు గోవిందరాజులు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తాడు.

అఖిల్ ఫీజు గొడవ

అఖిల్ ఫీజు గొడవ

ఇక అఖిల్ తన కాలేజీ ఫీజు కోసం డబ్బులు అడిగాను అని అనుకుంటాడు. అయితే అంతకంటే ముందు మల్లికా కనిపించడంతో కాలేజీ ఫీజు కట్టాలి అని చెప్తాడు. కానీ మల్లిక మాత్రం డబ్బులు లేవని చెబుతుంది. ఆ తర్వాత రామచంద్ర స్వయంగా వచ్చి తమ్ముడు చేతిలో డబ్బులు పెడతాడు. కానీ జ్ఞానాంబ ఎవరి దగ్గర నా కొడుకు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ రామచంద్రను మరి ఇంత బాధ పెడుతుంది. అంతే కాకుండా అఖిల్ ను ఆ డబ్బు తిరిగి ఇచ్చేయాలని హెచ్చరిస్తుంది. మీ నాన్నగారు వచ్చి కాలేజీలో ఫీజ్ కడతారని చెప్పడంతో అఖిల్ సైలెంట్ గా వెళ్లి రామ చేతిలో డబ్బులు పెట్టేస్తాడు.

కోపంగా వెళ్లిపోయిన జ్ఞానాంబ

కోపంగా వెళ్లిపోయిన జ్ఞానాంబ

అయితే గోవిందరాజులు మధ్యలో కలుగజేసుకొని తన తమ్ముడికి ఎప్పుడూ కూడా రామచంద్ర డబ్బులు ఇస్తాడు కదా, ఇప్పుడు ఎందుకు అలా అడ్డుపడుతున్నవు అని అడిగే ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికి జ్ఞానాంబ ఏమాత్రం ఆలోచించకుండా మోసం చేసిన వారినీ తన దరిదాపుల్లోకి కూడా రానివ్వకండి అంటూ మరింత కఠినంగా మాట్లాడుతుంది. రామచంద్ర మరోసారి తల్లిని బ్రతిమాలి మాట్లాడాలని అనుకుంటాడు. కానీ అందుకు ఆమె ఏమాత్రం ఒప్పుకోదు. అంతేకాకుండా జానకి కూడా జ్ఞానాంబ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా కోపంతో అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

లీలావతి మరో మంట

లీలావతి మరో మంట

ఇక పాత విషయాన్ని మనసులో పెట్టుకొని వచ్చిన లీలావతి జ్ఞానాంబ మరింత రెచ్చగొడుతుంది. గతంలో తన కూతురు పదవ తరగతి చదువుతుంది అని నీ కొడుకుకి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నీ కోడలు చదివింది డిగ్రీ అని తెలిసాక నువ్వు ఎంతగా మోసపోయావో అర్థం అవుతుంది. అంతేకాకుండా నువ్వు చాలా బాధపడుతున్నావు అని కూడా తెలుస్తోంది అని చెప్పడంతో గోవిందరాజులు కలగజేసుకుని అనవసరంగా మా మధ్యలో గొడవలు పెట్టవద్దని హెచ్చరిస్తాడు కానీ లీలావతి మాత్రం తగ్గకుండా ఊర్లో అందరికీ ఈ విషయం తెలుసు నా మాటలను ఆపేయగలవు కానీ మీ భార్యను మనసులో నుంచి ఆ బాధను తీసేయగలవా? తమ్ముడు అని ప్రశ్నిస్తుంది.

Recommended Video

Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
 మల్లికపై ఎదురుదాడి

మల్లికపై ఎదురుదాడి

ఇక మరోవైపు మల్లిక సమయం చూసి జానకితో గొడవ పడాలని అనుకుంటుంది. జానకి కిచెన్ లో ఉండగా తప్పకుండా ఏదో ఒక రోజు నువ్వు నీ భర్తను చదువుతున్న అహంకారంతో అవమనిస్తావని అనిపిస్తుంది. ఆ భయం కారణంగానే కొడుకు జీవితం ఏమవుతుందో అని అత్తగారు కూడా ఆందోళన చెందుతున్నారు అని అంటుంది. ఇక జానకి మల్లిక మాటలకు ఎదురు దాడికి దిగుతుంది. ఇక ఆ సమయంలో జ్ఞానంబ రావడంతో మల్లిక మరొక ప్లాన్ వేయాలని చూస్తుంది. మరి ఈ విషయంపై జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X