Janaki Kalaganaledu October 29th: తల్లి కోసం రామచంద్ర ఆవేదన.. కఠినంగా మారుతున్న జ్ఞానాంబ

జానకి కలగనలేదు సీరియల్ లో జానకి రామ లవ్ స్టొరీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. రెగ్యులర్ కథల తరహాలో కాకుండా కాస్త భిన్నమైన ఎమోషన్ ను హైలెట్ చేస్తున్నారు. భర్త సహకారంతో ఐపీఎస్ అవ్వాలని అనుకున్న జానకి తన కలను ఏ విధంగా నెరవేర్చుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇంట్లో అత్తగారికి తెలియకుండా ఐపీఎస్ అవ్వాలని కలలు కంటుంది. కానీ జానకి 5వ తరగతి మాత్రమే చదువుకున్నట్లు అనుకున్న జ్ఞానాంబకు ఆమె డిగ్రీ చదివినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతుంది. ఇక జానకి, రామ ఇద్దరు కూడా మోసం చేసినట్లు తెలియగానే వారితో మాట్లాడడం మనేస్తుంది.

అంతే కాకుండా జానకి మరొక విడాకుల కండిషన్ పెట్టడంతో కథ సరికొత్త మలుపు తిరుగుతుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ 40వ వారంలో అర్బన్ ప్రాంతంలో 7.56 రేటింగ్ అందుకుంది.. ఇక రూరల్ లో మాత్రం 39వ వారంలో 8.07 రేటింగ్ రాగా 40వ వారంలో 8.73 రేటింగ్ సాధించింది. అత్తగారి భయం వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందని జానకి అర్థం చేసుకుంటుంది.

ప్రస్తుతం నిజం తెలియడంతో మరొక ఆసక్తికరమైన అంశంతో ఈ సీరియల్ కొనసాగనుంది. జానకిని బయటకు పంపించాలని అనుకున్న మల్లికకు మరొక షాక్ తగులుతుంది. నేడు ప్రసారం కాబోయే 160వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

తల్లి కొడుకు దూరం కావడంతో..

తల్లి కొడుకు దూరం కావడంతో..

ప్రాణానికి ప్రాణమైన కొడుకు అంటే జ్ఞానాంబ అంటే మాకు ఎంతో ఇష్టం. అలాంటిది అతని భార్య చదువు విషయంలో అబద్ధం చెప్పాడని ఒక్కసారిగా బాధపడుతుంది. ఇక వెంటనే అతనితో మాట్లాడేందుకు నిరాకరిస్తోంది. తల్లీ కొడుకులు మాట్లాడకపోవడం తో జానకి కూడా చాలా బాధపడుతుంది. వారిద్దరినీ కలిపేందుకు ఎంతగానో ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం దక్కదు. రామచంద్ర ఇంట్లో జోక్యం చేసుకోకూడదు అని జ్ఞానాంబ ఆదేశాలను జారీ చేస్తుంది.

అఖిల్ ఫీజు గొడవ

అఖిల్ ఫీజు గొడవ

ప్రతీ సారి కూడా తన తమ్ముడు అఖిల్ కోసం కాలేజ్ ఫీజు కట్టే రామచంద్ర మరొకసారి డబ్బులు ఇవ్వాలని అనుకుంటాడు. అయితే అందుకు జ్ఞానాంబ అడ్డుపడుతూ తన చిన్న కొడుకు కోసం ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో అందరు షాక్ అవుతారు మధ్యలో జ్ఞానాంబ భర్త గోవింద రాజులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఏమాత్రం అంగీకరించదు దీంతో రామచంద్ర ఒక్కసారిగా బాధకు లోనవుతాడు.

చిచ్చు పెట్టిన లీలావతి

చిచ్చు పెట్టిన లీలావతి

అయితే జ్ఞానాంబ బయటకు వెళ్లి కూర్చోవడంతో అప్పుడే లీలావతి ఇంటికి వస్తుంది. జున్ను తీసుకు వచ్చాను అంటూ ఆమె కోడలు చేసిన మోసం గురించి పదే పదే గుర్తు చెస్తుంది. గతంలో నీ కొడుకుకి నా కూతురిని ఇచ్చి పెళ్ళి చేయమని అడిగితే తను పదవ తరగతి చదువుకుందని ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు నువ్వు ఏకంగా డిగ్రీ చదువుకున్న కోడలి చేతిలో మోసపోవాల్సి వచ్చింది నిజంగా ఇది చాలా బాధాకరం అని చెప్పడంతో గోవిందరాజులు ఆమెకు అడ్డుపడే ప్రయత్నం చేశారు.

మధ్యలో వచ్చిన మల్లిక

మధ్యలో వచ్చిన మల్లిక

లీలావతి మాట్లాడుతున్న సమయంలోనే మధ్యలో కలుగజేసుకున్న మల్లిక మనసులో బాధ పోవాలంటే ఇప్పుడు జానకి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవాలని మీరు అంటున్నారా? అని సరికొత్త ఆలోచనతో గొడవ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇక గోవిందరాజులు ఆమె మాటలకు అసంతృప్తి వ్యక్తం చేస్తాడు. సందు దొరికింది కదా అని నీ తోడికోడలిపై పగ తీర్చుకోవాలని అనుకుంటున్నావు కదా.. అని గట్టిగా ప్రశ్నించడంతో అందుకు మల్లిక మరొక విధంగా స్పందిస్తుంది. తనకు జానకి సోదరి లాంటిది అంటూ జానకి బయటకు వెళ్లిపోవాలని అనుకుంతున్నట్లు మాయమాటలు చెబుతుంది.

ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు

ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు

ఒక వైపు మల్లిక మాటలు మరొకవైపు లీలావతి ప్రశ్నలతో జ్ఞానాంబ సందిగ్దంలో పడుతుంది. చివరికి లీలావతి చెప్పిన మాటలకు.. నా కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు అని జ్ఞానాంబ ఆమెను అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక ఆ తర్వాత రామచంద్ర తల్లి విషయంలో బాధపడుతూ స్వీట్ షాప్ దగ్గరే దూరంగా కూర్చుని ఉంటాడు. గిరాకీ వచ్చినా కూడా అతను పెద్దగా పట్టించుకోడు ఇక ఇంటికి వచ్చి బాధగా కూర్చున్న సమయంలో జానకి భోజనం చేయమని చెప్పినా కూడా రామచంద్ర పరధ్యానంలో ఉంటాడు.

నా వల్లే జరిగింది

నా వల్లే జరిగింది

ఇదంతా నా వల్లే జరిగింది అంటూ జానకి బాధపడుతున్న సమయంలో రామ తప్పు నీది కాదు అని ఆ విషయం అమ్మ అర్థం చేసుకోవడం లేదని జానకికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. వారు మాట్లాడుకుంటున్న మాటలను జ్ఞానాంబ కిటికీ దగ్గర్నుంచి వింటుంది. ఇక మరుసటి రోజు స్వీట్ షాప్ కు వెళ్లిన రామచంద్రకు కన్నబాబు ఎదురావుతాడు.

అతను షాప్ కు వచ్చే స్వీటు అడిగితే రామ మరొక స్వీటు ఇస్తాడు. ఇలా చేస్తున్నావు ఏమిటి అని కన్నబాబు రామచంద్ర పై కోపానికి గురి అవుతాడు. ఆ తర్వాత అతను అసంతృప్తితో బయటకు వెళ్ళిపోతాడు. అయితే ఆ విషయాన్ని పెద్దమ్మకు చెబుతాను అంటూ రామచంద్ర చిన్న తమ్ముడు పరిగెత్తుకుంటూ ఇంటికి పయనమవుతాడు.

Recommended Video

Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
మల్లికతో జానకి వివాదం

మల్లికతో జానకి వివాదం

ఇంట్లో మల్లిక వంట చేస్తూ ఉండగా జానకి అక్కడికి వస్తుంది. మల్లిక సమయం చూసి జానకితో గొడవ పడాలని అనుకుంటుంది. జానకి కిచెన్ లో ఉండగా తప్పకుండా ఏదో ఒక రోజు నువ్వు నీ భర్తను చదువుకున్న అహంకారంతో అవమనిస్తావని తెలుసు అని మరోసారి గొడవ పెట్టుకోవడంతో జ్ఞానాంబ కూడా కిచెన్ దగ్గర ఉండే మాటలు వింటుంది. మరి ఈ పరిణామాలను జానకి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X