Janaki Kalaganaledu October 31st: డబ్బు కోసం తప్పుడు దారిలో అఖిల్.. అత్త ముందు బుక్కైన మల్లిక

జానకి కలగనలేదు కథ మరో కీలక మలుపు తిరిగింది. ఊరందరికి ఎంతో ప్రేరణగా నిలిచే జ్ఞానాంబ కుటుంబంలో ఒక్కసారిగా విబేధాలు వస్తాయి. అయితే కుటుంబం విడిపోయే పరిస్థితికి రావడంతో పెద్ద కోడలు జానకి విడిపోనివ్వకుండా చూసుకుంటుంది. ఇక తన భర్త రామ సహాయంతోనే ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని జానకి అనుకుంటుంది. అందుకు అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక జనకికి ఇంట్లోనే మల్లిక నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. మరి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోని ప్రధాన అంశం. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 421 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

విడిపోకుండా ఉండాలి అని..

విడిపోకుండా ఉండాలి అని..

అందరూ సంతోషంగా ఉండాల్సిన సమయంలోనే జ్ఞానాంబ ఫ్యామిలీలో ఒక్కసారిగా విభేదాలు తలెత్తుతాయి. ఒకవైపు జానకి తన ఐపిఎస్ చదువును కొనసాగిస్తూ ఉండగా మరొకవైపు చిన్న కోడలు గర్భవతిగా ఉండడంతో అందరూ కూడా సంతోషపడతారు. అయితే మల్లిక కూడా ఇంట్లో తన స్థాయి పెరగాలని గర్భం వచ్చినట్లు అబద్ధాలు చెబుతుంది. దీంతో అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు కానీ మల్లిక మాత్రం ప్రత్యేకంగా మరో కాపురం పెట్టాలి అని భర్తను తీసుకుని సిటీకి వెళ్లిపోవాలని అనుకుంటుంది. కానీ కుటుంబం విడిపోకుండా ఉండాలి అనే జానకి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.

అఖిల్ ఖాళీగా ఉండడంతో..

అఖిల్ ఖాళీగా ఉండడంతో..

మరోవైపు జానకి మల్లికకు నిజమైన గర్భం రాలేదు అని ఆమె అబద్ధాలు చెప్పింది అని తెలుసుకుంటుంది. ఇక ఆ కోపంతోనే ఉన్న సమయంలో అఖిల్ పెళ్లి అయినప్పటికీ కూడా అతను ఇంట్లో ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడంతో కొంత అసహనంతో ఉంటుంది. అంతేకాకుండా తెల్లవారే దాకా అతను నిద్రపోతూ ఉండడంతో జానకి అతనికి బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. ఇలా ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవాలి అని ముందు నీ కెరీర్ పై దృష్టి పెట్టు అని కాస్త కోపంగా చెబుతుంది. ఇక పక్కనే ఉన్న అఖిల్ భార్య జెస్సి కూడా అక్క ఏమి చెప్పినా కూడా మన మంచి కోసమే కదా రేపు మనకు పుట్టబోయే బిడ్డ కోసం కూడా ఎదుటి వారిపై ఆధారపడి ఉండడం కరెక్ట్ కాదు కదా అని చెబుతుంది. ఇక వారు అలా చెప్పడంతో అఖిల్ కొంత అసహనంతో ఫీల్ అవుతాడు. అందుకే ఎలాగైనా డబ్బు సంపాదించే మార్గం వెతుక్కోవాలని అనుకుంటాడు.

నిజస్వరూపం తెలుసుకున్న జానకి

నిజస్వరూపం తెలుసుకున్న జానకి

ఇక మరొకవైపు మల్లికా నిజ స్వరూపం తెలుసుకున్న జానకి ఆమెతో మాట్లాడడానికి వెళుతుంది. నువ్వు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది. కానీ మల్లిక అబద్ధాన్ని ఇంకా కప్పిపుచ్చేందుకు ప్రణాళికలు రచిస్తుంది. నీ వల్లే నాకు ఇలా ఇంట్లో సంతోషం లేదు అని సంతోషంగా బయటికి వెళ్లి మరొక కాపురం పెడదాం అనుకుంటే నాకు అడ్డుపడుతున్నావు అని మల్లికా అంటుంది. తప్పకుండా నా ఉసురు అలాగే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉసురు నీకు తగులుతుంది అని కూడా అనడంతో జానకి ఒక్కసారిగా ఆగ్రహంతో మల్లిక చెంపపై కొడుతుంది. దీంతో నన్నే కొడతావా అంటూ ఈ విషయం వెంటనే అత్తయ్య గారికి చెబుతాను అని బయటకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది.

తప్పుడు దారిలో అఖిల్

తప్పుడు దారిలో అఖిల్

ఇక అప్పుడే జానకి నువ్వు ఆ నిజం చెబితే నేను నువ్వు గర్భవతి కాదు అనే నిజం కూడా చెబుతాను అని అంటుంది. నిన్ను కొట్టినట్లు ఎలాంటి ఆధారం లేదు. కానీ డాక్టర్ ని పిలిపిస్తే నీ అసలు విషయం బయటపడుతుంది అని జానకి మల్లికకు వార్నింగ్ ఇస్తుంది. ఇక మరొకవైపు అఖిల్ తప్పుడు దారిలో డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటాడు. అతని స్నేహితుడిని కలవడంతో మాదకద్రవ్యాల్లో సప్లై చేసే పనిని ఒప్పుకుంటాడు. మొదట కాస్త భయపడినప్పటికీ ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే లక్షాధికారి కావచ్చు అని ఈ పని చేయాలి అని స్నేహితుడు తప్పుడు సలహాలు ఇవ్వడంతో అఖిల్ టెంప్ట్ అవుతాడు.

నిజం తెలుసుకున్న జ్ఞానాంబ

నిజం తెలుసుకున్న జ్ఞానాంబ

ఇక మరొకవైపు మల్లిక.. జానకికి అసలు విషయం తెలిసిపోయింది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక నీలావతికి ఏదైనా సలహా ఇస్తుందేమో అని ఫోన్ చేస్తుంది. కానీ ఆమె ఎంత ట్రై చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక తర్వాత జ్ఞానాంబ అసలు విషయం తెలుసుకుని మల్లికను నిలదీసే ప్రయత్నం చేస్తుంది. ఇక మల్లిక గర్భవతి కాదు అని తెలుసుకున్న అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక భర్త విష్ణు అయితే మల్లికను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని హెచ్చరిస్తాడు. వెంటనే మీ ఇంటికి వెళ్లి మీ అమ్మ నాన్నలతో మాట్లాడి మళ్ళీ ఇక్కడికి రా అని విష్ణు చెప్పడంతో మల్లిక ఏడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా మొదట నేను గర్భవతి అని అనిపించింది కానీ ఆ తర్వాత మళ్ళీ కాదు అని తెలిసింది.. అని మల్లిక మరో మాట మాట్లాడుతుంది. మరి మల్లిక చెప్పిన మాటలకు జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X