twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu October 3rd: రామచంద్రను ప్రేమతో తో టెన్షన్ పెట్టిన జానకి.. మల్లిక మనసులో మరో కుట్ర

    |

    జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణను పెంచుకుంటోంది. జానకి తన భర్త రామ సహాయంతో ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక అందుకు అత్త జ్ఞానాంబ కూడా ఒప్పుకుంటుంది. ఇక జనకికి ఇంట్లోనే కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. మరి వాటిని దాటి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోనే ప్రధాన అంశం. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 401 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

    జానకి చదువు కోసం

    జానకి చదువు కోసం

    ఎలాగైనా తన తల్లిదండ్రుల కోరిక మేరకు ఐపీఎస్ కలను పూర్తి చేయాలి అనుకున్న జానకి అత్తగారింట్లో పూర్తిస్థాయిలో మద్దతులను అందుకుంటుంది. ముఖ్యంగా రామచంద్ర భార్యకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అలాగే మరొకవైపు అత్త జ్ఞానాంబ కూడా జానకి గురించి తెలుసుకుని ఆమెకు ఎలాంటి పనులు కూడా చెప్పదు.

    ఇక పరీక్షలు దగ్గర పడుతూ ఉండడంతో జానకి మరింత బాగా చదువుకోవాలి అని రామచంద్ర కోరుకుంటాడు. సమయం వృధా చేయకూడదు అని మరొక పనిపై దృష్టి పెట్టకూడదు అని కూడా పదేపదే చెబుతూ ఉంటాడు.

    రామచంద్ర ముద్దులు

    రామచంద్ర ముద్దులు

    రామచంద్ర స్వీట్ షాప్ లో తన పని చూసుకుంటూ ఉండగా ఇంట్లో జానకి హ్యాపీగా చదువుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు రామచంద్ర జానకి చదువుకుంటుందో లేదో అని ఆలోచనతో ఆమెకు వీడియో కాల్ చేస్తాడు. జానకి చదువుకుంటూ ఉండడంతో రామచంద్ర సంతోషంగానే ఉంటాడు. మీరు ఏ పనులు చేయకండి అని పూర్తిగా చదువుకోండి అని చెబుతాడు.

    ఇక రామచంద్ర తో కాసేపు సరదాగా జానకి రొమాంటిక్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. మీకు నిన్న శక్తిని ఇచ్చాను కదా ఇప్పుడు నాకు కూడా ఇవ్వండి అంటూ ముద్దు కావాలి అని అడుగుతుంది. అందుకు రామచంద్ర మొదట సిగ్గుపడినప్పటికీ కూడా ఆ తర్వాత ఫోన్లో నుంచి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ ఉంటాడు.

    వెన్నెల కోసం

    వెన్నెల కోసం

    ఇక జానకి చదువుకుంటూ ఉండగా అప్పుడే రామచంద్ర చెల్లెలు వెన్నెల వచ్చి తనకు రేపు పరీక్షలు ఉన్నాయి అని ఈ కష్టమైన సబ్జెక్టులో కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయని వాటిని క్లియర్ చేయాలి అని జానకిని అడుగుతుంది. అందుకు జానకి తనకి కూడా పరీక్షలు ఉన్నాయి అని చెప్పినప్పటికీ కూడా వెన్నెల బ్రతిమాలుతుంది. ఇక జానకి వెన్నెల కోసం ఆలోచించి ఆమెకు సహాయం చేస్తుంది.

    ఇక వెన్నెల కోసం చాలా సమయం వెచ్చించిన జానకి తన చదువును మాత్రం కొంత పక్కన పెడుతుంది. అయినప్పటికీ కూడా మళ్లీ రాత్రి కూర్చొని చదువుకోవాలని అనుకుంటుంది. ఇక రాత్రి నిద్రలేకుండా చదువుకుంటూ ఉండటంతో రామచంద్ర అడుగుతాడు. కానీ జానకి ఇంట్లో పనులు వలన ఆలస్యమైంది అని చెప్పకుండా రేపు పరీక్షల్లో మంచి మార్కులు రావాలి అంటే ఈ ఒక్క రోజు నిద్రపోకూడదు అని చెబుతోంది.

    అమ్మవారికి పూజలు

    అమ్మవారికి పూజలు

    ఇక అందరూ హ్యాపీగా ఉన్న సమయంలో జ్ఞానాంబ కూడా నవరాత్రులు మొదలవుతున్నాయి అని కాబట్టి ఈ తొమ్మిది రోజులు తాను నిష్ఠతో అమ్మవారికి పూజలు చేస్తాను అని చెబుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఎవరూ కూడా ఈ పూజ జరిగే రోజుల్లో మాంసాహారం ముట్టుకోవద్దు అని చాలా పవిత్రంగా ఉండాలి అని ఆదేశాలు జారీ చేస్తుంది. దీంతో జానకి కూడా అందుకు ఒప్పుకుంటుంది.

    అలాగే అత్తగారి పూజ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా చూసుకోవాలని అనుకుంటుంది. కానీ మల్లిక మాత్రం ఎలాగైనా పూజలు చెడగొట్టాలని అలాగే జానకి పరీక్షల్లో ఫెయిల్ అయ్యేలా చేయాలని కూడా అనుకుంటుంది. కానీ పక్కనే ఉన్న భర్త విష్ణు మాత్రం అలా తప్పుగా కోరుకుంటే నీ కోరికలు నెరవేర లేవు అని సెటైర్ వేస్తాడు.

    ఆటపట్టించిన జానకి

    ఆటపట్టించిన జానకి

    ఇక జానకి పరీక్షలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో గోవిందరాజులు కూడా ఆమెను వెళ్ళమని చెబుతాడు. ఇక రామచంద్ర జానకిని పరీక్ష రాయించేందుకు తీసుకువెళ్తాడు. ఇక ఎంతో సంతోషంగానే పరీక్షలు రాసిన జానకి ఆ తర్వాత కాసేపు రామచంద్రను ఆటపట్టించాలి అని ఈ పరీక్షలో ఏమాత్రం సరిగ్గా రాయలేదు అని చెబుతుంది. దీంతో రామ టెన్షన్ పడతాడు. కానీ అప్పుడే జానకి వాళ్ళ ప్రిన్సిపల్ వచ్చి నువ్వు ఈ పరీక్షల్లో చాలా బాగా రాసావు అని ఫుల్ మార్క్స్ వచ్చాయని చెబుతుంది. దీంతో రామచంద్ర ఆశ్చర్యపోతాడు నన్ను ఆటపట్టిస్తారా అంటూ జానకి వెంట పడుతూ ఉంటాడు.

    మల్లిక కోరికలు

    మల్లిక కోరికలు

    ఇక తర్వాత జానికి పట్టుకోగానే చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమెను కాలేజీలోనే పైకి ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు. ఇక తర్వాత జానకి సిగ్గుపడుతూ కిందకు దించండి రామ గారు అని అంటాడు. ఇక ఈ విషయం వెంటనే అమ్మగారికి చెప్పాలి అని ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు మల్లిక మాత్రం ఎలాగైనా జానకి పరీక్షల్లో ఫెయిల్ కావాలి అని ఈసారైనా నేనే గెలవాలి అని అమ్మవారి ముందు ప్రార్థన చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే గోవిందరాజులు వచ్చి ఏదో మంట పెట్టాలని చూస్తున్నావు కదా అది ఎంత మాత్రం నెరవేరదు అని సెటైర్ వేస్తాడు. మరి మల్లిక, జానకి సంతోషం పోయే విధంగా ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 401
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X