Janaki Kalaganaledu October 4th Episode: జానకి ఐపీఎస్ కలపై మరింత ఆశ పుట్టించిన రామ.. మల్లిక మరొక ట్విస్ట్!

జానకి కలగనలేదు ఇటీవల కాలంలో టాప్ రేటింగ్స్ అందుకుంటున్న సీరియల్ గా మంచి క్రేజ్ అందుకుంటోంది. మొదట్లో అంతగా పాజిటివ్ టాక్ ఏమి రాకపోయినప్పటికి 50 ఎపిసోడ్స్ తరువాత సీరియల్ మెల్లగా అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లింది. సీరియల్ ద్వారా సీనియర్ హీరోయిన్ రాశి సరికొత్తగా రీ ఎంట్రీ ఇవ్వడం కూడా సీరియల్ గా బాగా కలిసొచ్చింది. ఇక రోజురోజుకు రేటింగ్స్ తో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. రాశి జ్ఞానాంబ పాత్రలో చాలా పవర్ఫుల్ గా కనిపిస్తోంది.

ఇక ఐపీఎస్ చదువుకోవలనే కలలు కనే జానకి మొత్తానికి భర్త సహాయంతో కోచింగ్ తీసుకుంటూ చదువును పూర్తి చేసేందుకు సిద్దమైంది. భావోద్వేగమైన సీన్స్ తో జానకి రామచంద్ర ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇక జానకి చదువు విషయంలో మల్లికకు ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. ఆ విషయాన్ని జ్ఞానాంబకు చెప్పాలని అనుకుంటుంది. కానీ ఆమె ప్లాన్స్ ప్లాప్ అవుతాయి. ఇక నేడు ప్రసారం కాబోయే 141వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

పొరపాటు వల్ల దొరికిపోయిన మల్లిక

పొరపాటు వల్ల దొరికిపోయిన మల్లిక

పిల్లలను కనకుండా ఉండేందుకు మల్లిక ఎవరికీ తెలియకుండా టాబ్లెట్ వేసుకోవడం జ్ఞానాంబకు తెలుస్తుంది. మొదట తాను టాబ్లెట్ వేసుకోవడం లేదని ఏదో సమస్య వలన పిల్లలు పుట్టడం లేదని అబద్దాలు చెప్పిన మల్లిక ఒక చిన్న పొరపాటు వల్ల దొరికిపోతుంది. మెడికల్ షాప్ దగ్గర టాబ్లెట్స్ తెచ్చుకున్న మల్లిక అనుకోకుండా చిల్లర తీసుకోవడం మర్చిపోతుంది. మెడికల్ షాప్ అబ్బాయి ఇంటికి రాగానే డబ్బులు ఇచ్చే క్రమంలో జ్ఞానాంబ అనుమానిస్తోంది. విషయం అడిగి తెలుసుకోవడంతో మల్లిక గారు ఆ టాబ్లెట్స్ తీసుకున్నట్లు చెబుతాడు.

మల్లికకు బుద్ధి వచ్చేలా చేసిన జ్ఞానాంబ

మల్లికకు బుద్ధి వచ్చేలా చేసిన జ్ఞానాంబ

ఇక మల్లిక తప్పు చేసిందని తెలుసుకున్న జ్ఞానాంబ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని ఆదేశిస్తుంది. ఎప్పటి నుంచో ప్రత్యేకంగా మరో కాపురం పెట్టాలని అనుకుంటున్న మల్లికకు జ్ఞానాంబ కోలుకోలేని దెబ్బ కొడుతుంది. అయితే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోపోనివ్వకుండా మరొక ప్లాన్ కూడా వేస్తుంది. కట్టుబట్టలతో ఇంటి నుంచి వెళ్లిపోవాలని బంగారం వస్తువులు ఏది కూడా తీసుకు వెళ్ళకూడదు అని చెబుతుంది. ఇక మొదట ఎంతగానో సంతోషించిన మల్లిక తరువాత ఆవేదన చెందుతుంది. ఖాళీగా వెళ్తే ఇప్పుడు బయట అడుక్కు తినాల్సి వస్తుంది అని భర్తను తీసుకొని లోపలికి వెళుతుంది.

ఇక ముందుగానే పరిస్థితి అర్థం చేసుకున్న గోవిందరాజులు కూడా జ్ఞానాంబ మాటలకు సపోర్ట్ చేయడంతో మల్లికకు కాస్త బుద్ధి వస్తుంది. మళ్లీ ఇంకోసారి మరో కాపురం పెట్టకుండా చేయాలని రాశి చేసిన ఆలోచన సక్సెస్ అవుతుంది.

పుస్తకాలను కాల్చేసిన జానకి

పుస్తకాలను కాల్చేసిన జానకి

ఇక గొడవ ముగిసిపోవడంతో మరో వైపు జానకి ఎంతగానో ఆందోళన చెందుతుంది. మల్లిక పిల్లల విషయంలో అబద్ధం చెప్పి అత్తగారిని మోసం చేయడం జానకికి ఏ మాత్రం నచ్చదు. ఇక దాదాపు అదే తరహాలోనే చదువు కారణం వల్ల తాను కూడా పిల్లలు పుట్టకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నట్లు బాధ పడుతుంది. నేను కూడా అత్తగారిని ఎంతగానో మోసం చేస్తున్నారని మనోవేదనకు గురి అవుతుంది. జానకి తన ఐపీఎస్ కలలకు ఇంతటితో ముగింపు పలకాలని అనుకుంటుంది. పుస్తకాలను బయటకు తీసుకు వెళ్లిన జానకి వాటిని కాల్చేస్తుంది.

నేను చేసేది కూడా మోసమే

నేను చేసేది కూడా మోసమే

ఇక అప్పుడే నిద్ర లేచిన రామచంద్ర బయటకు వెళ్లి చూడగా పుస్తకాలు కాలిపోతూ ఉంటాయి. ఇక మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో జానకి అడ్డుపడుతుంది. ఇక తనకు చదువుకోవాలని ఉద్దేశం కూడా లేదని కేవలం అత్తగారికి ఒక మంచి కోడలుగా ఉండాలి అనే ఆలోచన మాత్రమే ఉందని భర్తతో అంటుంది. మల్లిక మరో కాపురం కోసం అబద్దమాడినట్లు నేను కూడా చదువు కారణంగా అత్త గారికి వారసులను ఇవ్వకుండా చేస్తున్నాను అని ఇది కూడా ఒక పెద్ద మోసమేనని భర్తతో చెప్పుకుని బాధపడుతుంది.

 మరో రెండేళ్లు ఓపిక పట్టండి

మరో రెండేళ్లు ఓపిక పట్టండి

ఇక మరోసారి రామచంద్ర జానకి ఆలోచనను మార్చే ప్రయత్నం చేస్తాడు పుస్తకాలు కాలిపోతున్నందుకే మీరు ఎంత బాధ పడుతున్నారో అర్థం చేసుకోగలను. అలాంటిది మీ కల నెరవేరకుండా ఉంటే తట్టుకోగలరా అంటూ ప్రశ్నిస్తాడు. జానకి పరవాలేదు అంటూ తనలో తాన్స్ బాధ పడుతూనే ఉంటుంది. కానీ రామచంద్రం అది సరైన నిర్ణయం కాదు అంటూ మరొక రెండేళ్లు కష్టపడితే ఐపీఎస్ సాధించవచ్చు అని ధైర్యం చెబుతాడు.

రెండేళ్లు ఓపిక పడితే మీరు అన్ని అనుకున్నట్లుగానే జరుగుతాయి. అమ్మ కోరికను కూడా నెరవేర్చవచ్చని. ఇక మరో సారి జానకి చెప్పేదేమీ లేక ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది భర్త చెప్పిన మాటలు కూడా సరేనని అప్పటికప్పుడు మళ్ళీ ఒప్పేసుకుంటుంది.

Recommended Video

Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
రామచంద్రను ప్రశ్నించిన జ్ఞానాంబ

రామచంద్రను ప్రశ్నించిన జ్ఞానాంబ

ఇక మరోవైపు మల్లిక తనలోని కోపాన్ని ఏమాత్రం తగ్గించదు. భర్తతో కలిసి బయటకు వెళ్లే క్రమంలో రామచంద్ర గతంలో చేసిన పొరపాటు గురించి అత్తగారికి చెప్పాలని అనుకుంటుంది. తన భర్త విష్ణుకి కూడా చేతికి ఒక బంగారం బ్రాస్లేట్ ఉంటే బాగుంటుంది అని అత్తగారికి చెప్పడంతో గతంలో రామచంద్ర కోసం చేయించిన బ్రాస్లెట్ ను ఇవ్వాలని మల్లిక జ్ఞానాంబ ను అడుగుతుంది. అయితే జానకి చదువు కోసం రామచంద్ర ముందుగానే ఎవరికీ చెప్పకుండా ఆ బంగారం గొలుసును అమ్మేస్తాడు. ఇక ఎవరు తీశారు అని తెలియక జ్ఞానాంబ షాక్ అవుతుంది. అదే విషయాన్ని రామచంద్రను కూడా అడుగుతుంది. మరి తల్లికి అతను ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X