Janaki Kalaganaledu October 4th: జానకి చదువు కోసం ప్రేమతో రామచంద్ర జాగ్రత్తలు.. మల్లిక కన్నింగ్ ప్లాన్!

జానకి కలగనలేదు సీరియల్ మొదట్లో కొంచెం నీరసంగా మొదలైనప్పటికి ఇప్పుడు ఆసక్తికరమైన ట్రాక్ లోకి వచ్చేసింది. జానకి తన భర్త రామ సహాయంతో ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. అందుకు అత్త జ్ఞానాంబ కూడా ఒప్పుకుంటుంది. అయితే జనకికి ఇంట్లోనే కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. మరి వాటిని దాటి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోనే ప్రధాన అంశం. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 402 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఐపీఎస్ పరీక్షల కోసం

ఐపీఎస్ పరీక్షల కోసం

జానకి ఇంట్లో పరిస్థితుల కారణంగా మొదట్లో తన ఐపీఎస్ పరీక్షల విషయంలో అంత సీరియస్ గా ఉండదు. అయితే ఆమె చదువు విషయంలో కాలేజీ ప్రిన్సిపల్ రామచంద్ర తో మాట్లాడుతుంది. జానకి మంచి అమ్మాయి బాగా చదువుతుంది అందుకే మరింత సపోర్ట్ అందితే ఐపిఎస్ కలను నెరవేర్చుకోవచ్చు అని చెప్పడంతో రామచంద్ర అందుకు తగ్గట్టుగా జానకికి మద్దతుగా ఉండాలి అని అనుకుంటాడు. ఇక ఆమె అనుకున్నట్లే ఒక పరీక్షలో పాస్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఆ విషయాన్ని ఇంట్లో చెప్పిన రామచంద్ర ఎంతగానో సంతోషపడతాడు. తన తల్లిదండ్రులకు చెప్పి జానకి పూర్తిస్థాయిలో మార్కులు తెచ్చుకుని బాగా చదువుకుంటుంది అని సంతోషంగా చెబుతాడు. ఇక అందుకు జ్ఞానాంబ గోవిందరాజులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు.

జానకిని పొగిడిన జ్ఞానాంబ

జానకిని పొగిడిన జ్ఞానాంబ

ఇక తర్వాత జ్ఞానాంబ ప్రత్యేకంగా జానకిని అభినందిస్తుంది. ఒకవైపు ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ జానకి చాలా తెలివిగా వాటిని పరిష్కరిస్తూ మరోవైపు తన చదువును కూడా చాలా బాగా కొనసాగిస్తుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా చాకచక్యంగా ప్రవర్తిస్తూ జానకి చాలా తెలివిగా నడుచుకుంటుంది అని తప్పకుండా తన అనుకున్న లక్ష్యాన్ని చేదిస్తుంది అని నమ్మకంతో చెబుతుంది. అయితే ఒకవైపు జానకి పొగుడుతూనే మరోవైపు జ్ఞానాంబ తన చిన్న కొడుకు చేసిన తప్పు గురించి ఎత్తిపొడుస్తుంది. కొందరు ఉంటారు వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకుండా అనవసరంగా ఆడపిల్లలకు అన్యాయం చేయాలని అనుకుంటారని జెస్సికి మోసం చేసిన విషయం గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇక తల్లి మాటలకు చిన్న కొడుకు అఖిల్ ఏమీ మాట్లాడడో తెలియక అక్కడి నుంచి అలిగి వెళ్లిపోతాడు.

జెస్సి పై అఖిల్ అప్సెట్

జెస్సి పై అఖిల్ అప్సెట్

ఇక తల్లి మాటలకు అఖిల్ బయటకు వెళ్లిపోవడంతో రామచంద్ర జానకి కూడా కాస్త ఫీలవుతారు. ఇక జెస్సి అయితే అఖిల్ అత్తయ్య గారి మాటలకు బాధపడుతున్నాడు అనుకుని అతన్ని ఓదార్చేందుకు బయటకు వెళుతుంది. అఖిల్ ఒక దగ్గర కూర్చుని ఉండగా అత్తయ్య గారిది కోపం కాదు బాధ అని త్వరలోనే అన్ని సర్దుకుంటాయని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ అఖిల్ మాత్రం ఈ సమస్య వచ్చింది నీ వల్లే అని, ఆరోజు నేను చెప్పినట్టు అబార్షన్ చేసుకొని ఉంటే నేను ఇంట్లో రాజకుమారుడులా ఉండేవాణ్ణి అని అంటాడు. ఇక జెస్సి అతనికి అర్థం అయ్యేలా చెప్పేందుకు ప్రయత్నం చేస్తుంది కానీ అఖిల్ మాత్రం అవన్నీ పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

జానకి కోసం రామ ప్లాన్

జానకి కోసం రామ ప్లాన్

మరోవైపు జానకి నిద్రపోయే సమయంలో రామచంద్ర కనిపించకపోవడంతో అతని గురించి వెతుకుతుంది. అయితే బయట కూర్చున్న రామచంద్ర జానకి కోసం ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే జానకికి రాబోయే రోజుల్లో అసలైన పరీక్షలు మొదలవుతాయి కాబట్టి ఆ సమయంలో ఆమెకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలి అని అలాగే ఇంట్లో పనులు కూడా తానే చూసుకోవాలి అని రామచంద్ర అనుకుంటాడు. ఇక అందుకు జానకి అంత శ్రమ అవసరం లేదు అని నేను అన్నీ చూసుకుంటాను అని చెప్పినప్పటికీ కూడా రామచంద్ర ఏ మాత్రం రిస్క్ తీసుకోవద్దు అని అంటాడు. మీరు పరీక్షల్లో పాస్ కావాలి అంటే ముందు సమయానికి తగ్గట్టుగా నిద్రపోవాలి అని ముందు వెళ్లి నిద్రపోండి అని రామచంద్ర అంటాడు. ఇక జానకి వెల్లకపోవడంతో ఆమెను ఎత్తుకొని మరి బెడ్ పైన పడుకోబెడతాడు.

బొమ్మల కొలువు

బొమ్మల కొలువు

ఉదయం జ్ఞానాంబ గోవిందరావు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నవరాత్రి ఉత్సవాలలో బాగానే పూజలు జరిపిస్తున్నాము కానీ అసలైన బొమ్మల కొలువు వేడుకలు మాత్రం నిర్వహించడంలేదు అని గోవిందరాజు అడుగుతాడు. ఆ విషయం నాకు కూడా తెలుసు అంటూ జ్ఞానాంబ ఒక విషయాన్ని చెబుతుంది. మన ఇంటికి ఎవరినైనా పిలిస్తే మళ్ళీ వారు మన ఇంటి పరిస్థితుల గురించి ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. మల్లి ఆ మాటలను విని నేను ఆ బాధను తట్టుకోలేను అని చాలా బాధగా ఉంటుంది అని జ్ఞానాంబ చెబుతోంది.

 మల్లిక మరో ప్లాన్

మల్లిక మరో ప్లాన్

ఇక అప్పుడే వచ్చిన జానకి అత్తగారితో మాట్లాడుతుంది. ఈసారి ఎలాంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను అని మన ఇంట్లో ఎప్పటిలాగే బొమ్మలు కొలువు జరిపిద్దామని అంటుంది. ఎందుకంటే మన ఇంట్లోకి ఇద్దరు వారసులు రాబోతున్నారు కాబట్టి ఈ సమయంలో తప్పకుండా జరుపుకోవాలి అని కూడా జానకి చెబుతుంది. దీంతో జానకి మాటలకు జ్ఞానాంబ ఒప్పుకుంటుంది. అయితే మరోవైపు మల్లిక మాత్రం ఇదే ఆసరాగా చేసుకుని జానకిపై పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. మరి ఈ వేడుకలో మల్లిక ఎలాంటి ప్లాన్ వేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X