Janaki Kalaganaledu October 5th Episode: భార్య కోసం తల్లిపై రామ ఒట్టు.. ట్విస్ట్ ఇచ్చిన జానకి!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మంచి క్రేజ్ అందుకుంటోంది. మొదట్లో పాజిటివ్ టాక్ అయితే అంతగా రాకపోయినప్పటికి కొన్ని వారాలకు అసలు కథలోకి రావడంతో ఎపిసోడ్స్ తరువాత సీరియల్ మెల్లగా అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లింది. సీనియర్ హీరోయిన్ రాశి జ్ఞానాంబ పాత్రలో సరికొత్తగా రీ ఎంట్రీ ఇవ్వడం కూడా సీరియల్ గా బాగా కలిసొచ్చింది. ఇక రోజురోజుకు రేటింగ్స్ తో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

రాశి తన పాత్రలో చాలా పవర్ఫుల్ గా కనిపిస్తోంది. ఇక ఐపీఎస్ చదువుకోవలనే కలలు కనే జానకి మొత్తానికి భర్త సహాయంతో కోచింగ్ తీసుకుంటూ చదువును పూర్తి చేసేందుకు సిద్దమైంది. భావోద్వేగమైన సీన్స్ తో జానకి రామచంద్ర ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇక జానకి చదువు విషయంలో మల్లికకు ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. ఆ విషయాన్ని జ్ఞానాంబకు చెప్పాలని అనుకుంటుంది. కానీ ఆమె ప్లాన్స్ ప్లాప్ అవుతాయి. ఇక నేడు ప్రసారం కాబోయే 141వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

భార్య కోసం బ్రాస్లెట్ ను తాకట్టు పెట్టి..

భార్య కోసం బ్రాస్లెట్ ను తాకట్టు పెట్టి..

జానకి ఐపీఎస్ చదువుకోడానికి కోచింగ్ తీసుకుంటుంది. అయితే కోచింగ్ సెంటర్ కు లక్ష రూపాయలు చెల్లించాలని భర్తను అడుగుతుంది. దీంతో రామచంద్ర ఏమిచేయాలో తెలియక ఎంతో ప్రేమగా ఇచ్చిన తల్లి బ్రాస్లెట్ ను తాకట్టు పెడతాడు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా జ్ఞానాంబ పడుకున్న తర్వాత దొంగతనంగా బ్రాస్లేట్ తీసుకొని తాకట్టు పెడతాడు. అనంతరం లక్ష రూపాయలతో జానకి కోచింగ్ కు సంబంధించిన ఫీజులు కట్టేసి ఆమెకు ఎంతగానో సహాయం చేస్తాడు.

తెలివిగా చెప్పాలని మల్లిక ప్లాన్

తెలివిగా చెప్పాలని మల్లిక ప్లాన్

ఇక రామచంద్ర దొంగతనంగా తీసుకున్న విషయాన్ని జ్ఞానాంబ చిన్న కోడలు మల్లిక పసిగడుతుంది. ఇక వెంటనే ఆ విషయం చెబితే ఎవరూ నమ్మరు అని చాలా తెలివిగా చెప్పాలని సమయం కోసం ఎదురుచూస్తుంది. మల్లిక తన భర్తతో కలిసి వేరే పెళ్లికి వెళ్లాలని అనుకుంటుంది. అయితే ఆ సమయంలో భర్త దగ్గర మెడలో ఉన్న గొలుసును తీసేసి చేతికి బ్రాస్లెట్ ఉంటే బాగుంటుంది అని చెబుతోంది. సైలెంట్ గా ఉండమని భర్తకు చెప్పి జ్ఞానాంబ దగ్గరికి తీసుకు వెళుతుంది. ఇక మరోవైపు వారసులు లేరని జ్ఞానాంబ గోవిందరాజులు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడితో మల్లికా వస్తుంది.

బీరువాలో కనిపించకపోవడంతో

బీరువాలో కనిపించకపోవడంతో

మేము ఇద్దరం పెళ్లి కి వెళ్తున్నాము అంటూ బావగారు వేసుకునే బ్రాస్లెట్ ఒకసారి ఇస్తే మా ఆయన వేసుకుంటారు అని అడుగుతుంది. మళ్ళీ పెళ్లి నుంచి వచ్చిన తర్వాత తప్పకుండా తిరిగి ఇచ్చేస్తామని కూడా చెప్పడంతో జ్ఞానాంబ కూడా ఒప్పుకుంటుంది. ఇక ఆ తర్వాత చిన్న కొడుకు కోసం బ్రాస్లెట్ తీసుకు తీసుకురావడానికి వెళ్లిన జ్ఞానాంబ బ్రాస్లెట్ బీరువాలో కనిపించకపోవడంతో షాక్ అవుతుంది.

ఇక వెంటనే చుట్టుపక్కల కూడా వెతికినా దొరకదు. ఆ తర్వాత ఎవరు తీసుకుంటారు అనే అనుమానాలు కలుగుతాయి.అంతేకాకుండా రామచంద్ర కోసం అది ఎంతో ప్రేమగా చేయించినట్లు కూడా గుర్తు చేసుకుంటుంది.

మరో అబద్ధం చెప్పిన జానకి..

మరో అబద్ధం చెప్పిన జానకి..

అయితే గోవిందరాజులు కంగారు పడవద్దు అని చెప్పి రామచంద్రకు ఫోన్ చేస్తాడు. బ్రాస్లెట్ ఏమైనా తీసుకుని వెళ్ళావా అని రామచంద్రను అడుగుతాడు రామచంద్ర కంగారుపడుతూ నేను ఏమి తీయలేదు నాన్నగారు అని చెప్తాడు. అయితే తెలియకుండా మీ గదిలో ఏమైనా పెట్టుకున్నావేమో ఒకసారి ఇంటికి వచ్చి చూడు అని తల్లి చెప్పడంతో రామచంద్ర కంగారు పడుతు సరేనని ఇంటికి వస్తానని చెబుతాడు.

బ్రాస్లెట్ బాధలో జ్ఞానాంబ

బ్రాస్లెట్ బాధలో జ్ఞానాంబ

ఇక మరోవైపు మల్లిక చేస్తున్న మోసం గురించి తన భర్త విష్ణు తెలుసుకున్నప్పటికీ ఏమీ అనలేక పోయాడు. ఆ తర్వాత రామచంద్ర కంగారుగానే ఇంట్లోకి అడుగు పెడతాడు. ఇప్పటికే ఈ విషయంలో ఎన్నో సార్లు అబద్ధాలు చెప్పాను ఇక ఇప్పుడు మరో సారి బ్రాస్లెట్ తాకట్టు పెట్టిన విషయం గురించి కూడా అబద్ధం చెప్పాల్సి వస్తోంది అని తన మనసులో తనే బాధపడుతూ ఉంటాడు.

ఇక మెల్లగా ఇంట్లోకి రాగానే మల్లిక అత్తయ్య గారు బావగారు వచ్చారు అని గట్టిగా అరుస్తుంది. జ్ఞానాంబ కొడుకును చూసి బాధతోనే బ్రాస్లెట్ కనిపించడం లేదు అని మరోసారి చెబుతుంది. నువ్వు ఏమైనా తెలియకుండా ఎక్కడైనా డాచావా అని అడగడంతో అందుకు రామచంద్ర తనకు ఏమీ తెలియదని అబద్ధం చెబుతాడు.

తాకట్టు పెట్టే అవకాశం ఉంది

తాకట్టు పెట్టే అవకాశం ఉంది

ఇక నిజం తెలియని జ్ఞానాంబ బ్రాస్లెట్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొని బాధపడుతుంది. అది కేవలం ఒక బంగారపు గొలుసు మాత్రమే కాదని నా కొడుకుకు నాకు ఒక ప్రత్యేకమైన జ్ఞాపకం అని చెబుతుంది. ఇక అందుకు రామచంద్ర కూడా ఎంతగానో మనోవేదనకు గురవుతారు. మరోవైపు మల్లిక మరోసారి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది.

జానకి రామచంద్ర ఇద్దరు కూడా బయటకు వెళుతున్నారు కదా.. బహుశా తన కోసం బావగారు ఏదైనా కొనడానికి ఆ బ్రాస్లెట్ ను తాకట్టు పెట్టే అవకాశం ఉంది అని అనుమానం వ్యక్తం చేస్తుంది. దీంతో పక్కనే ఉన్న గోవిందరాజులు మల్లిక పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అవకాశం దొరికినప్పుడు నిప్పు పెట్టడానికి ప్రయత్నిస్తావని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయితే తన అనుమానమే ఒకవేళ అబద్ధమైతే బావగారిని ఓట్టుపెట్టి చెప్పమని అంటుంది కూడా.

Recommended Video

Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
ట్విస్ట్ ఇచ్చిన జానకి

ట్విస్ట్ ఇచ్చిన జానకి

దీంతో జ్ఞానాంబ కూడా మల్లిక నోరు మూయించాలని కొడుకును ఒట్టు వేయమని చెబుతుంది. ఇంకా అందుకు రామచంద్రా కాస్త ఆలోచించినప్పటికీ ఒట్టు వేయడానికి సిద్ధం అవుతాడు. ఇక అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన జానకి బ్రాస్లెట్ ఎక్కడికి పోలేదు అని అయినా బెడ్ రూమ్ లోనే తెలియకుండా ఒక చోట పెట్టారు అని చెబుతోంది. దీంతో జ్ఞానాంబ ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేస్తుంది. మరొక సారి తన కొడుకు పైన నిందలు వేస్తే మామూలుగా ఉండదు అంటూ మల్లికకు చీవాట్లు పెడుతుంది. ఒక భార్య చేసిన సహాయంతో రామచంద్ర ఎంతగానో సంతోషిస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X