Janaki Kalaganaledu October 5th: పూజ చెడగొట్టేందుకు మల్లిక ప్లాన్.. చిన్నారి రాకతో మరో షాక్!

జానకి కలగనలేదు రోజురోజుకు సరికొత్త ఎమోషన్స్ తో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. జానకి తన భర్త రామ సహాయంతో ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. అత్త జ్ఞానాంబ కూడా జానకి చదువుకోవడానికి ఒప్పుకుంటుంది. అయితే జనకికి ఇంట్లోనే కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి.

మరి వాటిని దాటి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోనే ప్రధాన అంశం. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 403 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

బొమ్మల కొలువు కోసం..

బొమ్మల కొలువు కోసం..

జరిగిన పరిస్థితుల కారణంగా ఇంట్లో జ్ఞానాంబ అలాగే గోవిందరాజులు ఇద్దరు కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉంటారు. అయితే ఇంట్లో అందరూ కూడా బాగుండాలి అని నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా జ్ఞానాంబ ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటుంది. అయితే పూజలు కొనసాగుతున్నాయి కానీ బొమ్మల కొలువు ఎందుకు జరపడం లేదు అని ఆమె భర్త గోవిందరాజులు అడుగుతాడు.

చివరి సారి మన ఇంట్లో వ్రతం జరిపించినప్పుడు వచ్చిన అతిథులు అందరూ కూడా వయనం తీసుకోకుండానే వెళ్ళిపోయారు జరిగిన పొరపాట్లు కూడా మనకు ఇప్పుడు శాపంగా మారాయి. మళ్లీ వాళ్లు వచ్చిన తర్వాత ఏదో ఒకటి అంటూ ఉంటారు. అందుకే ఈసారి బొమ్మల కొలువు ఏమీ వద్దు అని జ్ఞానాంబ అంటుంది.

ప్రతిసారి అలా జరగదు

ప్రతిసారి అలా జరగదు

ఇక అప్పుడే జానకి వచ్చి ప్రతిసారి అలా జరగదు అత్తయ్య గారు అని ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని తప్పకుండా బొమ్మల కొలువు జరిపించాలి అని కూడా చెబుతుంది. ఎందుకంటే మరోవైపు మన ఇంట్లోకి ఇద్దరు వారసులు రాబోతున్నారు కాబట్టి ఈ సమయంలో బొమ్మల కొలువు జరిపిస్తే మన ఇంటికి కూడా చాలా మంచిది అని జానకి చెబుతుంది. ఇక జానకి మాటలకు జ్ఞానాంబ కొంత ఆలోచించినప్పటికీ ఆ తర్వాత ఆమె ఒప్పుకుంటుంది. ఇక అన్ని బాధ్యతలు కూడా నువ్వే చూసుకోవాలి అని కూడా జ్ఞానాంబ అంటుంది. ఇక అందుకు తగ్గట్టుగా జానకి ఇంట్లో పూజకు సంబంధించిన ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉంటుంది.

పూజ తరువాత చదువు

పూజ తరువాత చదువు

అయితే రామచంద్రం మాత్రం జానకి చదువుపై దృష్టి పెట్టే విధంగా ఉండాలి అని అనుకుంటాడు. మీ ఐపీఎస్ అసలు పరీక్షలకు ఇంకా కొద్దిరోజుల సమయం ఉంది కాబట్టే ఈ సమయంలో మీరు సమయం వృధా చేయకుండా పరీక్షలకు సిద్ధమవ్వాలి అని అంటాడు. ఈ పూజకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా నేను చూసుకుంటాను అని కూడా చెబుతాడు. కానీ జానకి మాత్రం ఒక వైపు కోడలిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే మరోవైపు బాధ్యతగా చదువుకుంటాను అని కూడా చెబుతుంది. ఈ పూజ అయిపోయిన తర్వాత పూర్తిస్థాయిలో మీరు చెప్పినట్లు చేస్తాను అని కూడా మాట ఇస్తుంది. ఇక రామచంద్ర అందుకు సరే ఉంటాడు.

ఆలోచనలో పడిన జ్ఞానాంబ

ఆలోచనలో పడిన జ్ఞానాంబ

ఆ తర్వాత జ్ఞానాంబ ఇంట్లో రామచంద్ర కష్టపడే విధానం చూసి ఆలోచనలో పడుతుంది. మరోవైపు మల్లిక కూర్చుని తింటూ ఉంటుంది. చిన్న కొడుకు విష్ణు మల్లికకు సంబంధించిన చీరలకు ఇస్త్రీ చేస్తూ కనిపిస్తాడు. ఎవరు కూడా ఇంట్లో పనులను పట్టించుకోవడంలేదని కేవలం రామ మాత్రమే కష్టపడుతున్నాడు అని ఆమె ఆలోచిస్తుంది. ఇక తర్వాత జ్ఞానాంబ రామచంద్ర కు సహాయం చేయాలని అనుకుంటుంది. కానీ అప్పుడే జానకి వచ్చి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అత్తయ్య గారు అంటుంది. ఆ తర్వాత మల్లికా బెడ్ రూమ్ లో నుంచి బయటికి వచ్చి తొంగి చూస్తుంది. ఇంట్లో అందరూ కూడా చాలా పనులు చేస్తున్నారు అని ఇప్పుడు నేను కూడా కనిపిస్తే ఏదో ఒక పని చెబుతారేమో అని మళ్ళీ వెనక్కి రూమ్ లోకి వెళుతుంది. ఆ విషయాన్ని జ్ఞానాంబ కూడా పసిగడుతుంది.

జానకి నీలావతి ప్లాన్

జానకి నీలావతి ప్లాన్

ఇక తర్వాత బొమ్మల కొలువుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమైనప్పటికీ పిల్లలు ఎవరు కూడా రాకపోవడంతో మళ్లీ జ్ఞానాంబ ఆలోచనలు పడుతుంది. తప్పకుండా వస్తారు అని జానకి అంటుంది. ఇక మల్లిక వెంటనే నీలావతి కి ఫోన్ చేస్తుంది. ఇంట్లో పూజకు పిల్లలు ఎవరిని కూడా రానివ్వవద్దు అని చెప్పాను కదా నేను చెప్పినట్లు చేశావా అని అనడంతో... నీలావతి కూడా నేను చుట్టుపక్కల వాళ్లందరి కి అదే చెప్పాను అని వాళ్ళ ఇంటికి పూజకు వెళ్లొద్దు అని మీకే మంచిది కాదు అని కూడా చెప్పినట్లుగా ఆమె మల్లికకు తెలియజేసింది. ఇక తర్వాత మల్లిక ఏమి తెలియనట్లు ఇంట్లోకి వచ్చి తన మాటలతో బడపెడుతూ మరోసారి అవమానం జరిగింది అని ఏమీ తెలియనట్లుగా ఇంట్లో మాట్లాడుతుంది.

జానకి కోసం చిన్నారి

జానకి కోసం చిన్నారి

కానీ అప్పుడే జానకి చుట్టుపక్కల వారి ఇంటికి ఫోన్ చేస్తుంది. పిల్లలు ఇంకా రాలేదు అని అడగడంతో మీ ఇంట్లో పూజలు ఆచారాలు పద్ధతులు లేకుండా జరుగుతున్నాయని అందుకే మా పిల్లలను పంపించాలని అనుకోవడం లేదని అంటారు. ఇక ఆ మాటలకు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే జానకి గతంలో కాపాడిన ఒక చిన్నారి పూజకు వస్తుంది. ఇక ఆ అమ్మాయి చేత బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. మరి తర్వాత మల్లికా ఎలాంటి ప్లాన్ వేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X