Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Janaki Kalaganaledu October 6th Episode: భార్య ఇచ్చిన ట్విస్టుకు రామ ఎమోషనల్.. మరో గండంలో జానకి!
జానకి కలగనలేదు సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. చదువుకున్న కోడలు వస్తే చదువుకోలేని కొడుకుతో సరిగ్గా కాపురం చేయడాన్ని అత్త వేసిన ప్లాన్ లో ఎన్నో అబద్ధాలు కోమసాగుతూ ఉంటాయి. ఏకంగా ఐపీఎస్ అవ్వాలని కలలు కనే కోడలు వస్తుంది. కానీ అత్త జ్ఞానాంబకు చదువుకున్న విషయం తెలియకుండా కోడలు జానకి భర్త సహకారంతో చదువును కొనసాగిస్తుంది. ఇక ఆ అబద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందననే అంశం హైలెట్ గా నిలుస్తోంది.
సీనియర్ హీరోయిన్ రాశి జ్ఞానాంబ పాత్రలో సరికొత్తగా రీ ఎంట్రీ ఇవ్వడం కూడా సీరియల్ కు బాగా కలిసొచ్చింది. ఇక రోజురోజుకు రేటింగ్స్ తో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. రాశి తన పాత్రలో చాలా పవర్ఫుల్ గా కనిపిస్తోంది. ఇక ఐపీఎస్ చదువుకోవలనే కలలు కనే జానకి మొత్తానికి భర్త సహాయంతో కోచింగ్ తీసుకుంటూ చదువును పూర్తి చేసేందుకు సిద్దమైంది.
జానకి చదువు విషయంలో మల్లికకు ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. ఆ విషయాన్ని జ్ఞానాంబకు చెప్పాలని అనుకుంటుంది. ఇక నేడు ప్రసారం కాబోయే 141వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

భార్య కోసం అమ్మ ప్రేమను తాకట్టు
తన భార్య జానకి ఐపీఎస్ చదువు కోసం లక్ష రూపాయలు అవసరం పడడంతో రామచంద్ర ఎంతో ప్రేమగా ఇచ్చిన తల్లి బ్రాస్లెట్ ను తాకట్టు పెడతాడు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా జ్ఞానాంబ పడుకున్న తర్వాత దొంగతనంగా బ్రాస్లేట్ తీసుకొని తాకట్టు పెట్టి భార్య కోసం కోచింగ్ సెంటర్ లో ఫీజు కడతాడు. అయితే మల్లిక తన మాస్టర్ ప్లాన్ తో ఆ బ్రాస్లెట్ గురించి అడుగుతుంది. తన భర్తకి ఒకసారి ఇస్తే పెళ్లికి వెళ్లి వస్తామని అంటుంది. ఇక దాని కోసం జ్ఞానాంబ వెళ్లి చూడగా బీరువాలో కనిపింఛదు. అదే విషయాన్ని రామచంద్రను అడగడంతో అతను తెలియదని అంటాడు.

అబద్ధంతో ఒట్టు
రామచంద్ర పై అనుమానాలు వచ్చేలా మరోవైపు మల్లిక తన మాటలతో అత్తమామలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ అందుకు జ్ఞానాంబ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తన కొడుకు భార్య కోసం తన ప్రేమను తాకట్టు పెట్టే వాడు కాదని ఎంత నమ్మకంగా చెబుతోంది. అయితే ఒట్టు వేయమని మల్లిక మరొక కండిషన్ పెడుతుంది. అందుకు రామచంద్ర అబద్ధం చెప్పలేక ఓటు వేయడానికి కూడా సిద్ధం అవుతాడు.

నా కొడుకు అలాంటి వాడు కాదు
ఇక చివరి నిమిషంలో అక్కడికి జానకి ఎంట్రీ ఇస్తుంది బ్రాస్లెట్ ఎక్కడికి పోలేదు తన బెడ్ రూమ్ లోనే ఉందని జానకి వివరణ ఇస్తుంది. ఇక ఆ బ్రాస్లెట్ చూసిన జ్ఞానాంబ ఎంతగానో సంతోషిస్తుంది. తన కొడుకు గురించి మరొకసారి తప్పుగా మాట్లాడితే నిన్ను మీ పుట్టింటికి తరిమేస్తాను అని కూడా మల్లికపై కోపాన్ని చూపిస్తుంది. ఇక ఆ తర్వాత ఆ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో మళ్లీ ఒక్కసారిగా నిరాశ చెందుతుంది.

స్నేహితురాలి సాయం కోరిన జానకి
అయితే ఒంటరిగా కూర్చున్న రామచంద్ర జానకి ఆ గొలుసు ఎలా తెచ్చింది అని కాస్త కన్ఫ్యూజన్ లో పడతాడు. నేను తాకట్టు పెట్టిన విషయం ఎవరికీ చెప్పలేదు. అలాగే జానకి కూడా తెలియదు కదా? మరి డబ్బులు కట్టి గొలుసు ఎలా తీసుకొచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భర్త దగ్గరికి వచ్చిన జానకి అసలు విషయాన్ని చెబుతుంది. రీసెంట్ గా మీ చొక్కాలో తాకట్టు పెట్టిన కాగితాన్ని చూశాను. ఆ తరువాత ఎలాగైనా గొలుసులు విడిపించుకొని రావాలి అని తన స్నేహితురాలు శ్రావణి కుటుంబ సభ్యులను ఆప్పుగా అడిగి లక్ష రూపాయలు తీసుకున్నాను అని జానకి చెబుతుంది.

భార్య ప్రేమకు ఫిదా
ఇక ఆ తర్వాత రామచంద్ర భార్య ప్రేమ చూసి ఎంతగానో సంతోషిస్తాడు శ్రావణి ఇచ్చిన డబ్బులను సాయంత్రం మళ్లీ ఎలాగైనా తిరిగి ఇచ్చేయాలని అనుకుంటాడు. అందుకు జానకి ఏమాత్రం ఒప్పుకోదు. వాళ్లకు కొంత సమయం పడుతుంది అని చెప్పారు అని భరోసా ఇస్తుంది. తర్వాత జ్ఞానాంబ కు జానకి చదువుకుంటున్న డిగ్రీ కాలేజ్ కి నుంచి ఫోన్ కాల్ వస్తుంది.

జానకి కాలేజ్ నుంచి జ్ఞానాంబకు ఫోన్ కాల్
మీతో
ఒకసారి
మాట్లాడాలి
అంటూ
కాలేజ్
ప్రిన్సిపల్
చెప్పడంతో
అందుకు
జ్ఞానాంబ
కాస్త
ఆలోచనలో
పడుతుంది.
అసలు
ఆ
కాలేజ్
నుంచి
తనకు
ఫోన్
కాల్
ఎలా
వస్తుంది
అంటూ
ఈ
విషయం
తెలుసుకోవడానికి
మరుసటి
రోజు
వస్తాను
అని
చెబుతోంది.
ఇక
మరోవైపు
జానకి
పుట్టినరోజు
ఉండడంతో
రామచంద్ర
తనకు
సర్ప్రైజ్
ఇచ్చే
విధంగా
ఇంటి
బయట
ప్రత్యేకంగా
ఏర్పాట్లు
చేస్తాడు
అలాగే
కేక్
కట్
చేయించి
పుట్టినరోజు
శుభాకాంక్షలు
తెలియజేస్తాడు.
Recommended Video

జానకి కాలేజ్ కు జ్ఞానాంబ
అందుకు జానకి కూడా ఎంతగానో సంతోషిస్తుంది. తరువాత ఉదయాన్నే జానకి కోసం కుటుంబసభ్యులంతా వారి గది దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. తమతో నిజం ఎందుకు దాచావని కోడల అడుగుతుంది. దీంతో కోస్తా ఆశ్చర్యపోయిన జానకికి వారు కూడా పుట్టినరోజు సందర్భంగా సప్రైజ్ ఇవ్వబోతున్నట్లు కాస్త సందేహం కలుగుతుంది. అలాగే జ్ఞానాంబ అదే రోజు కాలేజ్ కు కూడా వెళ్లడానికి సిద్ధమవుతోంది. మరి జానకి చదువుకున్న విషయాన్ని కాలేజీ యాజమాన్యం వారి అత్తకు తెలియజేస్తుందో లేదో తెలియాలి అంటే అంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.