For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu October 6th: జెస్సి తల్లిదండ్రులను మళ్ళీ గోడవలోకి దించిన మల్లిక.. న్యూ ప్లాన్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మొదట్లో కొంత నీరసంగా కొనసాగినప్పటికి ఇప్పుడు మాత్రం ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటోంది. జానకి భర్త రామ సహాయంతో ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. అత్త జ్ఞానాంబ కూడా జానకి చదువుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇక జనకికి ఇంట్లోనే కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. మరి వాటిని దాటి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోనే ప్రధాన అంశం. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 404 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  పిల్లలను కూడా పూజకు రమ్మని..

  పిల్లలను కూడా పూజకు రమ్మని..


  దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జ్ఞానాంబ ఇంట్లో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటుంది. అయితే ఆ పూజలను ఎలాగైనా ఆటంకం కలిగించాలని కూడా రెండవ కోడలు మల్లిక ప్రణాళికలు రచిస్తుంది. ఏదైనా తప్పు జరిగేలా చేసి జానకి పై నింద వేయాలని కూడా మల్లికా ఆలోచిస్తుంది. ఇక బొమ్మల కొలువు సందర్భంగా ఇంటి చుట్టుపక్కల లో ఉన్న పిల్లలను కూడా పూజకు రమ్మని చెప్పాలి అని జానకి అనుకుంటుంది. అయితే మొదట జ్ఞానాంబ అలాంటివి ఏమీ వద్దు అని అన్నప్పటికీ కూడా జానకి ఇంట్లో మన కుటుంబానికి చాలా మంచిది అని చెప్పి చుట్టుపక్కల వారి పిల్లలను పిలుస్తుంది. కానీ మల్లిక ఆ ప్లాన్ అయితే చెడగొడుతుంది.. ఇంటికి పిల్లలను రానివ్వకుండా నీలావతి చేత ఒక ప్లాన్ వేస్తుంది. ఇంటికి పూజకు వస్తే మంచిది కాదు అని ప్రచారం చేయించి జానకి ఆలోచనలు చెడగొడుతుంది.

  జానకి కోసం చిన్నారి

  జానకి కోసం చిన్నారి

  ఇక బొమ్మలకు కొలువుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన తర్వాత ఎవరు కూడా రాకపోవడంతో జ్ఞానాంబ కొంత ఆవేదన చెందుతుంది. నేను ముందే చెప్పాను ఇలాంటి వేడుకలు వద్దు అని ఇదివరకే ఒకసారి అవమానం జరిగింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు అందరు బాధపడుతున్న సమయంలో జానకి కోసం ప్రత్యేకంగా ఒక చిన్నారి అక్కడికి వస్తుంది గతంలో ఆ అమ్మాయిని జానకి కాపాడుతుంది. ఇక ఆ చిన్నారి ప్రత్యేకంగా జానకి కోసం అక్కడికి వచ్చి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. దీంతో ఇంట్లో అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఇక మల్లిక మాత్రం ఆ చిన్నారి రావడంతో మళ్ళీ అప్సెట్ అవుతుంది. నేను ఎన్ని ప్రణాళికలు రచించినా కూడా జానకికి కలసి వస్తోంది అని లోలోపల కుళ్ళుకుంటుంది.

  అందరికి అర్థమయ్యేలా..

  అందరికి అర్థమయ్యేలా..

  ఇక ఆ చిన్నారి పండగ విశేషాలు అడగడంతో జానకి కూడా ఎంతో చక్కగా వాటి గురించి చెబుతుంది. ముఖ్యంగా విజయదశమి ప్రత్యేకతను గురించి రాముడి గొప్పతనం గురించి కూడా జానకి అర్థమయ్యేలా చెబుతూనే మరోవైపు ఇంట్లో అందరూ కూడా తల్లిదండ్రుల మాటలకు గౌరవించాలని కాస్త సహనంతో ఉండే పరిస్థితులు ఎప్పటికైనా సర్దుకుంటాయి అని జ్ఞానాంబకు కూడా అర్థమయ్యేలా చెబుతుంది. ఇక జ్ఞానాంబ కూడా జానకి చెబుతున్న విషయాలను పసిగడుతుంది. ఎప్పటికైనా పరిస్థితులన్నీ చక్కబడతాయి అని చెబుతోంది అని జ్ఞానాంబ కాస్త ప్రశాంతతగా ఫీల్ అవుతూ ఉంటుంది....

   జెస్సి తల్లిదండ్రులకు మల్లిక ఫోన్

  జెస్సి తల్లిదండ్రులకు మల్లిక ఫోన్


  ఇక పూజ కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆ చిన్నారి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏదో ఒకటి చేసి ఇంట్లో గొడవలు సృష్టించాలి అని జానకిని అత్తగారి చేత తిట్టించాలి అని కూడా ఆలోచిస్తుంది. అందుకోసం ఆమె జెస్సీ పరిస్థితి గురించి వారి తల్లిదండ్రులకు చెబుతుంది. మీరు మీ అమ్మాయిని ఇక్కడికి కోడలిగా పంపించారు కానీ ఇంట్లో పరిస్థితులు ఆమెకు సంతోషాన్ని ఇవ్వడం లేదు అని అత్తగారు అయితే అమ్మాయితో అసలు మాట్లాడటం లేదు. కనీసం ఒక మనిషిగా కూడా గౌరవించడం లేదు అని మల్లికా జెస్సి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెబుతుంది. అంతేకాకుండా జానకి ఈ ఇంటి పరువు కాపాడడం కోసమే అఖిల్ పెళ్లి చేసింది అని అబద్ధం చెప్పడంతో జెస్సీ తల్లిదండ్రులు కూడా షాక్ అవుతారు. అలాగే మీరు ఇంటికి వచ్చి ఏదో ఒకటి తేల్చుకుంటే బెటర్ అని కూడా మల్లిక చెప్పడంతో జస్సీ తల్లిదండ్రులు కూడా అదే విధంగా చేయాలి అని అనుకుంటారు.

   సమయం వృధా చేయకుండా

  సమయం వృధా చేయకుండా

  మరోవైపు జానకి తన చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి అని రామచంద్ర కోరుకుంటాడు. అందుకోసం ఆమెకు సహాయంగా కూడా ఉండాలని అనుకుంటాడు. మీ ఐపీఎస్ అసలు పరీక్షలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు సమయం వృధా చేయకుండా చదువుకుంటే చాలా మంచిది అని రామా కోరుకుంటాడు. మీరు తెలియకుండానే వేరే పనుల వలన బిజీ అయిపోతున్నారు కాబట్టి అవన్నీ కూడా నేను చూసుకుంటాను. ఇప్పుడు మాత్రం మీరు బెడ్ రూమ్ నుంచి కదలకుండా చదువుకోండి అని రామా చెబుతాడు. అందుకు జానకి కూడా సరే అని చెబుతుంది.

   జ్ఞానాంబ ఇంటికి జెస్సి తల్లిదండ్రులు

  జ్ఞానాంబ ఇంటికి జెస్సి తల్లిదండ్రులు


  ఇక మరోవైపు జానకి ఉదయాన్నే లేచి తన భర్తతో కలిసి ఫిట్నెస్ పై దృష్టి పెడుతుంది. ప్రత్యేకంగా పార్కులో జాగింగ్ కూడా చేస్తుంది. ఇక మరోవైపు మల్లిక కూడా ఇంట్లో పనుల నుంచి తప్పించుకోవాలి అని బయట వ్యాయామం చేయాలని అనుకుంటుంది. కానీ ఆమె గర్భవతిగా ఉన్నట్లు అబద్ధం చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఎలా పడితే అలా వ్యాయామం చేస్తూ ఉండడంతో జానకి ఆశ్చర్య పోతుంది.
  నువ్వు అలా చేయకూడదు అని కేవలం నడవాలి అని సలహా ఇస్తుంది. ఇక ఆ తర్వాత మల్లిక సరే అంటుంది. మరోవైపు జ్ఞానాంబ గోవిందరాజు ఇద్దరు కూడా ఈ పండగ సమయంలో అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ అప్పుడే జెస్సీ తల్లిదండ్రులు కోపంగా వారి ఇంటికి వస్తారు మరి మల్లిక చెప్పిన మాటలకు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial October 6th Episode 404
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X