For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu October 7th: జానకి చదువు గురించి తెలుసుకున్న జ్ఞానాంబ.. అసలు కథ మొదలైంది

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. చదువుకున్న కోడలు వస్తే చదువుకోలేని కొడుకుతో సరిగ్గా కాపురం చేయదు అని కేవలం 5వ తరగతి చదువుకున్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటుంది. కానీ ఆ అమ్మాయి డిగ్రీ పూర్తి చేసినట్లు తెలుసుకున్న జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏకంగా ఐపీఎస్ అవ్వాలని కలలు కనే కోడలు అత్తకు చదువుకున్న విషయం తెలియకుండా భర్త సహకారంతో చదువును కొనసాగిస్తుంది. ఇక ఆ అబద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందననే పాయింట్ కు మొత్తానికి ముగింపు కార్డ్ పడింది. ఆ విషయం జ్ఞానాంబకు తెలుస్తుంది.

  సీనియర్ హీరోయిన్ రాశి జ్ఞానాంబ పాత్రలో సరికొత్తగా రీ ఎంట్రీ ఇవ్వడం కూడా సీరియల్ కు బాగా కలిసొచ్చింది. ఇక రోజురోజుకు రేటింగ్స్ తో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. రాశి తన పాత్రలో చాలా పవర్ఫుల్ గా కనిపిస్తోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 144వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

  జానకి విషయంలో రామ అబద్దాలు

  జానకి విషయంలో రామ అబద్దాలు

  భార్యను ఎలాగైనా ఐపీఎస్ చదివించాలని భర్త రామచంద్ర ఎంతగానో ఆసక్తి చూపిస్తాడు. ఫీజులు కట్టేందుకు కూడా సిద్ధమవుతాడు. ఈ క్రమంలో లక్ష రూపాయలు అవసరమైన సమయంలో ఏకంగా తన తల్లి ఎంతో ప్రేమగా ఇచ్చినటువంటి బ్రాస్లెట్ ను కూడా తాకట్టు పెడతాడు. ఆ విషయంలో తల్లికి చాలా అబద్దాలు కూడా చెప్పాల్సి వస్తుంది. ఇక ఫైనల్ గా బ్రాస్లెట్ ఎక్కడికి పోయింది అని సందేహం కలగడంతో మళ్లీ జానకి దాన్ని తీసుకువచ్చి రామచంద్రను కాపాడుతుంది.

  ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా

  ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా

  ఇంట్లో ఎవరికీ తెలియకుండా చదువు పూర్తి చేయాలని జానకి ఇప్పటికే తన భర్త ముందు ఎన్నో అబద్ధాలు ఆడింది. ఆ విషయంలో చిన్న కోడలు మల్లిక ఎన్నో అనుమానాలను లేవనెత్తినప్పటికి కూడా జ్ఞానాంబ ఏమాత్రం నమ్మదు. ఒక విధంగా మల్లిక వేసిన ప్రణాళికలు అన్ని కూడా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా మల్లిక ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జానకి గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది.

  టెన్షన్ పెట్టిన జ్ఞానాంబ

  టెన్షన్ పెట్టిన జ్ఞానాంబ

  ఇక జానకి పుట్టినరోజు సందర్భంగా గా ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తాడు. అర్ధరాత్రి ఎవరికీ తెలియ కుండా ఇంటి వెనకాల పెరట్లో జానకి తో ప్రత్యేకంగా కేక్ కట్ చేస్తాడు. అందుకు జానకి ఎంతగానో సంతోషిస్తుంది. ఇక ఆ తర్వాత ఉదయం లేవగానే జానకిని ఇంట్లో వాళ్ళందరూ కూడా కాస్తా టెన్షన్ పెడతారు. అసలు విషయాన్ని ఎందుకు చెప్పలేదు అని నువ్వు చెప్పకపోతే మాకు తెలియకుండా ఉంటుందా అని గోవిందరాజులు కూడా అడుగుతారు. కొద్దిసేపటి వరకు టెన్షన్ పెట్టిన వాళ్ళు ఈ రోజు నీ పుట్టినరోజు అని ఎందుకు మాకు చెప్పలేదు అని ఆరా తీస్తారు. అనంతరం నవ్వుతూ సరదాగా అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు.

  దీపం ఆరిపోవడంతో..

  దీపం ఆరిపోవడంతో..

  ఆ తర్వాత జ్ఞానాంబ కొత్త బట్టలను పెట్టి సాయంత్రం వరకు నువ్వు నీ భర్త సరదాగా బయటకు వెళ్లండి అని చెబుతుంది. ఇక ఇంతలో ఇంట్లో దేవుడికి దీపం పెట్టాలని, తన చదువు గురించి అత్తయ్యకు నిజం తెలిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అర్థం కావడం లేదు అని ప్రార్థిస్తుంది. అంతేకాకుండా ఆ గండం నుంచి నువ్వే నన్ను బయట పడేయాలని దేవుడిని కోరుకుంటుంది. ఇక దీపం ముట్టించగానే ఒక్కసారిగా ఆరిపోతుంది. దీంతో ఏదో జరుగుతోందని జానకి కంగారు పడుతుంది.

  జానకి మనసులో కంగారు

  జానకి మనసులో కంగారు

  ఇక మరోవైపు జ్ఞానాంబను ఒక కాలేజీ ప్రిన్సిపల్ పిలవడంతో అక్కడికి వెళుతుంది. అయితే అంతకుముందు జ్ఞానాంబ ఇద్దరు అమ్మాయిలను చదివేస్తూ ఉంటుంది. మరో ఇద్దరు అమ్మాయిలు కూడా సహాయం చేయాలని ఆ ప్రిన్సిపల్ చెప్పడంతో అందుకు సరేనని జ్ఞానాంబ ఒప్పుకుంటుంది. ఇక ఆ తర్వాత జానకి రామ చంద్ర ఇద్దరు కూడా సరదాగా గుడికి వెళ్ళాలి అని అనుకుంటున్న సమయంలో వారి బైక్ పంచర్ అవుతుంది.

  దీంతో జానకి మరింత కంగారు పడుతుంది. వరుసగా అపశకునాలు చోటుచేసుకోవడంతో భయాన్ని కలిగిస్తోందని భర్తకు కూడా చెబుతోంది. అందుకు రామచంద్రరావు చదువుకున్నవారు ఇలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ధైర్యం చెబుతాడు.

  నిజం తెలుసుకున్న జ్ఞానాంబ

  నిజం తెలుసుకున్న జ్ఞానాంబ

  ఇక జానకి అత్తకు ఫోన్ చేసి జరిగిన అపశకునాల గురించి చెబుతుంది. అలాంటి భయాలు ఏమి పెట్టుకోకుండా రామచంద్రను ధైర్యంగా ఉండమని చెబుతుంది. అయితే కాలేజీ ప్రిన్సిపాల్ ఒక అమ్మాయి ఇంటర్మీడియట్లో స్టేట్ టాపర్ గా నిలిచింది అని చెప్పడంతో ఆమె గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక కాలేజ్ బోర్డ్ పై జానకి ఫోటో ఉండడంతో జ్ఞానాంబ ఆశ్చర్యపోతుంది.

  ఆమె ఎవరు అని అడగడంతో పేరు జానకి, టాపర్ గా నిలిచిన అమ్మాయి అని సమాధానం చెబుతారు. దీంతో జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత మల్లిక కూడా ఫోన్ చేసి జానకి చదువుకున్నది ఐదవ తరగతి కాదు. డిగ్రీ అని చెబుతుంది. మరి ఇన్ని రోజులు అబద్దాలు అడుతున్నారని ఇప్పుడు నిజం తెలుసుకున్న జ్ఞానాంబ పెద్ద కోడలు జానకి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

  మెరుగైన రేటింగ్‌తో జానకీ కలగనలేదు

  మెరుగైన రేటింగ్‌తో జానకీ కలగనలేదు

  ఇక ఇటీవల కాలంలో ప్రేక్షకులను మెప్పిస్తున్న సీరియల్ జానకి కలగనలేదు. ప్రతీ వారం ఈ సీరియల్ మెరుగైన రేటింగ్‌ను నమోదు చేసుకొంటున్నది. 38వ వారంలో ఈ సీరియల్ అర్బన్ ప్రాంతంలో 7.56 రేటింగ్ సాధిస్తే.. 39వ వారంలో 8.26 రేటింగ్ నమోదు చేసింది. ఇక రూరల్ విషయానికి వస్తే.. 38వ వారంలో 8.07 రేటింగ్ నమోదు చేస్తే.. 39వ వారంలో 8.73 రేటింగ్ సాధించింది.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 144
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X