twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu October 7th: నిప్పు లేనిదే పొగ రాదు.. జెస్సి కౌంటర్.. మల్లిక ప్లాన్ డిజాస్టర్!

    |

    జానకి కలగనలేదు సీరియల్ సరికొత్త ట్విస్టులతో సరికొత్తగా ఆకట్టుకుంటోంది. భర్త రామ సహాయంతో జానకి ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. అత్త జ్ఞానాంబ కూడా జానకి చదువుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇక జనకికి ఇంట్లోనే కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. మరి వాటిని దాటి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోనే ప్రధాన అంశం. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 405 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

     జెస్సి పేరెంట్స్ కు ఫోన్

    జెస్సి పేరెంట్స్ కు ఫోన్

    జానకి పై నిత్యం ఏదో ఒక నింద వేయాలి అని మల్లికా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక జెస్సి పెళ్లి ప్రత్యేకంగా చేయడంతో ఆమె స్థాయి కూడా పెరిగిపోతోంది అని ఇంట్లో అత్తగారు జానకిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని ఎంతగానో అసూయ చెందుతుంది. అయితే ఈ క్రమంలో జ్ఞానాంబ అలాగే ఇంట్లో వాళ్ళు అందరూ కూడా బాధపడే విధంగా ఏదో ఒకటి చేయాలి అని జెస్సీ తల్లిదండ్రులకు మల్లికా ఫోన్ చేస్తుంది. ఈ ఇంట్లో మీ కూతురు ఏమాత్రం సంతోషంగా లేదు అని మా అత్తగారు మీ కూతురుని చాలా చిన్న చూపు చూస్తున్నారు అని అసలు మాట్లాడడంలేదు అని కూడా అంటుంది. అంతేకాకుండా జానకి రామచంద్ర వాళ్ళు పరువు కోసం మాత్రమే మీ కూతురికి ఇంటి కోడలుగా చేసుకున్నారు అని కూడా మల్లికా లేనిపోని విషయాలు అన్నీ చెబుతుంది.

    కోపంగా మాట్లాడుతూ..

    కోపంగా మాట్లాడుతూ..


    ఇక ఈ విషయాలు నేను చెప్పినట్లుగా మా ఇంట్లో చెప్పకూడదు అని మల్లికా ఆ తర్వాత వినయంగా అడుగుతుంది. ఇక తర్వాత జెస్సి తల్లిదండ్రులు ఆలోచనలో పడతారు. నిజంగానే జెస్సి ఆ ఇంట్లో బాధపడుతుందేమో అనుకుని వారు జ్ఞానాంబ ఇంటికి వస్తారు. అందరూ ఇంట్లో సంతోషంగా ఉండాలి అని గోవిందరాజులు జ్ఞానాంబ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే జెస్సి తల్లిదండ్రులు వచ్చి చాలా కోపంగా చూస్తారు. మీది చాలా పరువు గల కుటుంబం మర్యాదగాల కుటుంబం అనుకున్నాము. అలాగే ఇతరులను ఎంతగాను గౌరవించే కుటుంబమని కూడా అనుకున్నాము. కానీ ఇలా చేస్తారు అనుకోలేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు.

     జానకి అనుమానం

    జానకి అనుమానం


    మా కూతురిని మంచి మనసుతో మీ ఇంటి కోడలిగా చేసుకున్నారు అనుకుంటే ఆ తర్వాత లేనిపోని విధంగా కష్టాలు పెడతారా అని జెస్సీ తండ్రి అలాగే వారి తల్లి కూడా జ్ఞానాంబ ముందు కోపంగా మాట్లాడతారు. అయితే మధ్యలో వచ్చిన జానకి మీరు పొరపాటు పడినట్లు ఉన్నారని ఎవరో లేనిపోనివి చెప్పి ఉంటారు అని కూడా జానకి వారికి అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటుంది.
    అంతేకాకుండా జానకి ఈ విషయం మీకు ఎవరు చెప్పారో అని అనుమానిస్తుంది. అంతేకాకుండా మల్లికవైపు చూసి ఇది కచ్చితంగా ఆమె పని అని కూడా జానకి అనుకుంటుంది.

    నిప్పు లేనిదే పొగ రాదు

    నిప్పు లేనిదే పొగ రాదు


    ఎవరో కావాలని మీకు ఈ అబద్ధాలు చెప్పారని వాటిని నమ్మకూడదు అని కూడా జానకి జెస్సి తల్లిదండ్రులకు చెబుతుంది. కానీ జెస్సి తల్లిదండ్రులు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదు కదా అని అనవసరంగా మాకు ఎందుకు అలాంటి అబద్ధాలు చెబుతారు అని మళ్ళీ జెస్సీ తండ్రి కోప్పడతాడు. ఇక తర్వాత రామచంద్ర కూడా నచ్చజెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా జెస్సీ తండ్రి ఏమాత్రం శాంతించడం.

    కౌంటర్ ఇచ్చిన జెస్సి

    కౌంటర్ ఇచ్చిన జెస్సి

    ఇక అప్పుడే సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన వారి కూతురు జెస్సి మరొక మా అత్తగారిని అలాగే ఈ ఇంట్లో వారిని మరో మాట కూడా అనకూడదు అని హెచ్చరిస్తుంది. నేను ఒక సాధారణ ఇంట్లోకి రాలేదు ఒక దేవాలయంలోకి కోడలిగా అడుగుపెట్టాను. ఇక్కడ మా అత్తగారు దైవంతో సమానం అంటూ జెస్సి చాలా గౌరవంగా మాట్లాడుతుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. జెస్సీ అంతా ధైర్యంగా చెబుతోంది అంటే నిజమే అనుకొని పొరపడినట్లుగా జెస్సి తల్లిదండ్రులు అనుకుంటారు. ఆ తర్వాత మళ్లీ జ్ఞానాంబకు అలాగే వారి ఇంట్లో సభ్యులందరికీ కూడా క్షమాపణలు చెబుతారు.

    ప్లాన్ మొత్తం ఫెయిల్

    ప్లాన్ మొత్తం ఫెయిల్


    మల్లికా పేరు చెప్పాలని అనుకున్నప్పటికీ కూడా ఆమెకు దండం పెడుతున్నట్లు చేతులు చూపడంతో జెస్సి పేరెంట్స్ సైలెంట్ గా వెళ్ళిపోతారు. ఇక తర్వాత బయటకు వచ్చిన మల్లికా తనలో తానే ఆవేశాన్ని తెచ్చుకుంటుంది. ప్లాన్ చేస్తే మొత్తం వృధా అయ్యిందని అనుకుంటుంది. కానీ గోవిందరాజులు ఆమెను కూడా అనుమానిస్తాడు. ఈ విషయంలో నీకు నిజంగా సంబంధం ఉంది అని తెలిస్తే మాత్రం మామూలుగా ఉండదు అని కూడా హెచ్చరిస్తాడు. ఇక ఆ తర్వాత జానకి చదువుకుంటూ ఉండగా రామచంద్ర ఆమెను ఏ మాత్రం డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుంటాడు. కానీ అప్పుడే జెస్సి జానకి దగ్గరకు వచ్చి అఖిల్ తనతో సరిగ్గా మాట్లాడటం లేదు అని అలాగే ఈ ఇంట్లో నేను మంచి కోడలిగా ఉండాలి అంటే పద్ధతులు ఆచారాల గురించి పండగల గురించి తెలుసుకోవాలని అనుకున్నట్లు మాట్లాడుతుంది. మరి జానకీ జెస్సి విషయంలో ఎలాంటి సహాయం చేస్తుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Serial October 7th Episode 405
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X