Janaki Kalaganaledu October 8th: జానకి ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిందే.. షాక్ ఇచ్చిన జ్ఞానాంబ

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇటీవల కాలంలో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సీరియల్ గా టాప్ రేటింగ్స్ అందుకుంటోంది. 38వ వారంలో అయితే సీరియల్ అర్బన్ ప్రాంతంలో 7.56 రేటింగ్ సాధిస్తే.. 39వ వారంలో 8.26 రేటింగ్ నమోదు చేసింది. ఇక రూరల్ విషయానికి వస్తే.. 38వ వారంలో 8.07 రేటింగ్ నమోదు చేస్తే.. 39వ వారంలో 8.73 రేటింగ్ సాధించింది. మొత్తానికి సీరియల్ అయితే అసలు కథలోకి వచ్చేసింది. చదువుకున్న కోడలు వస్తే చదువుకోలేని కొడుకుతో సరిగ్గా కాపురం చేయదు అని ఆలోచనతో జ్ఞానాంబ తన కొడుక్కి కూడా చదువుకోలేని అమ్మాయిని తేవాలని అనుకుంటుంది. కేవలం 5వ తరగతి చదువుకున్న జానకిని అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటుంది. కానీ జానకి డిగ్రీ చేసినట్లు తెలుసుకున్న జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏకంగా ఐపీఎస్ అవ్వాలని కలలు కనే కోడలు అత్తకు చదువుకున్న విషయం తెలియకుండా భర్త సహకారంతో చదువును కొనసాగిస్తుంది. ఇక ఆ అబద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందననే పాయింట్ కు మొత్తానికి ముగింపు కార్డ్ పడింది. ఇక ఇప్పటి నుంచి మరొక ఆసక్తికరమైన అంశంతో సీరియల్ కొనసాగనుంది. నేడు ప్రసారం కాబోయే 145వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 అబద్దంతో జానకి పెళ్లి

అబద్దంతో జానకి పెళ్లి

అమ్మానాన్న సహకారంతో ఎలాగైనా ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని జానకి చిన్నప్పుడు నుంచి ఎన్నో కలలు కంటుంది. అయితే హఠాత్తుగా అమ్మ నాన్న చనిపోవడంతో తన స్వార్థం కోసం అన్నయ్య జానకి పెళ్లి చేసేస్తాడు. జ్ఞానాంబ కుటుంబం మంచిది అని, అయితే వారికి చదువుకున్న అమ్మాయి వద్దు అని తెలియడంతో అబద్ధం చెప్పి కేవలం తన ఐదవ తరగతి మాత్రమే అని చెప్పి పెళ్లి చేసేస్తారు. జ్ఞానాంబ కూడా అతని మాటలు నమ్ముతుంది. కానీ అసలు విషయం తెలిసాక ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది.

 కాలేజ్ లో జానకి ఫొటో

కాలేజ్ లో జానకి ఫొటో

అయితే మరోవైపు చదువుకునే అమ్మాయిలను ఎంతగానో ఇష్టపడే జ్ఞానాంబ సొంతంగా ఇంటర్మీడియట్ చదువుతున్న మరో ఇద్దరు పేద విద్యార్థులకు సహకారం అందిస్తుంది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ జ్ఞానాంబతో మాట్లాడడానికి కాలేజ్ కి రమ్మని అంటాడు. అంతే కాకుండా మరో ఇద్దరు అమ్మాయిలు కూడా సహకారం అందిస్తే చాలా బాగుంటుంది అని చెప్పడంతో అందుకు ఒప్పుకుంటుంది. కానీ అక్కడ కాలేజీలో బొర్డ్ మీద ఇంటర్మీడియట్ టాప్ లో వచ్చిన జానకి ఫోటో ఉంటుంది. దీంతో జానకి ఫోటోలను చూసి ఆశ్చర్యపోతుంది.

ఓ వైవు జ్ఞానాంబ కోపం.. మరోవైపు రామ ప్రేమ

ఓ వైవు జ్ఞానాంబ కోపం.. మరోవైపు రామ ప్రేమ

అసలు ఏం జరుగుతుందో అర్థం కాకపోవడంతో జ్ఞానాంబ ఇంటికి వెళ్లకుండా మధ్యలోనే ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంటుంది. అసలు ఎందుకు అబద్ధాలు చెప్పారు జానకి కూడా ఎందుకు ఐదవ తరగతి మాత్రమే చదివినట్లు అబద్దం చెప్పింది అనే ఆలోచనలతో సతమతమవుతూ ఉంటుంది. ఇక మరో వైపు జానకి పుట్టినరోజు సందర్భంగా రామచంద్ర ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటాడు. గుడిలో జానకి ని చూస్తూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. నేను మొదటిసారి చూసింది కూడా ఇక్కడే అని చెప్పడంతో జానకి కూడా ఎంతో సంతోషంగా మీలాంటి భర్త లభించడం నా అదృష్టం అని ఎమోషనల్ అవుతుంది.

జానకి గదిలో డిగ్రీ సర్టిఫికెట్లు

జానకి గదిలో డిగ్రీ సర్టిఫికెట్లు

జానకి రామచంద్ర ఇద్దరూ గుడిలో సంతోషంగా ఉంటూ.. మనల్ని ఎవరు విడదీయలేరు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు జ్ఞనంబ 5వ తరగతి చదువుకున్న కోడలు ఎందుకు అబద్ధాలు చెప్పిందో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. ఇక అదే సమయంలో మల్లికా ఇట్లో ఎవరూ లేరని జానకి గదిలో సోదాలు నిర్వహిస్తోంది. జానకి చదువుకు సంబంధించిన ఆధారాలు ఏవైనా దొరకవచ్చేమో అని అన్ని వైపులా వెతుకులాట మొదలు పెడుతుంది. ఒక పెట్టెలో జనాకికి సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్లు ఉండడంతో కాస్త కన్ఫ్యూజ్ అవుతుంది. ఎలాగైనా వాటి గురించి తెలుసుకోవాలని తన స్నేహితురాలి దగ్గరికి వెళుతుంది. అయితే అవి డిగ్రీ సర్టిఫికెట్లు అని చెప్పడంతో మల్లికా కూడా షాక్ అవుతుంది.

 జానకి పెట్టె బయట పారేసిన జ్ఞానాంబ

జానకి పెట్టె బయట పారేసిన జ్ఞానాంబ

ఇక వెంటనే ఆ విషయం భర్తకు చెప్పాలని మల్లిక ఫోన్ చేస్తుంది. జానకి చదువు విషయంలో మీతో అబద్ధం చెప్పింది అని క్లియర్ గా వివరణ ఇస్తుంది. ఆమె కేవలం ఐదో తరగతి మాత్రమే చదువుకోలేదు అని డిగ్రీ కూడా పూర్తి చేసిందని అంటే పదవ తరగతి తర్వాత మరొక ఐదు తరగతుల ఎక్కువ అంటూ మల్లిక తెలియజేస్తుంది. దీంతో జ్ఞానాంబ గతంలో తన సోదరుడికి జరిగిన అన్యాయాన్ని గుర్తుచేసుకుని బాధపడుతుంది.చదువుకున్న భార్య ఉంటే రామచంద్రకు కూడా అలాంటి పరిణామాలు ఎదురావుతాయేమో అని జ్ఞానాంబ కంగారు పడుతుంది. అలాగే జానకిపై గతంలో కొందరు చెప్పిన విషయాలను కూడా గుర్తు చేసుకుంటుంది. నిజంగా జానకి చదువు విషయంలో చాలా అబద్దాలు చెప్పినట్లు తెలుస్తుంది. ఇక వెంటనే జానకి పెట్టెను తీసుకుని బయట పడేస్తుంది. జానకి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేయడంతో రామచంద్ర కూడా షాక్ అవుతాడు. మరి ఆ విషయంలో లో రామచంద్ర ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X